-జగన్ పెళ్లి పులివెందులలోని ఓ కళాశాలలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పాస్టర్ ఆధ్వర్యంలో జరిగింది
-క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం సంతకాలు పెట్టి రిజిష్ట్రరు చేసుకున్నారు
-జగన్ రెడ్డి చెల్లెలు షర్మిల పెళ్ళి కూడ వెస్లీ చర్చ్ లో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే జరిగింది
-లోటస్ పాండ్ లోని జగన్ ఇంటినిచూస్తే పెద్ద సిలువ కనపడుతుంది
-జగన్.. శ్రీవారి సన్నిధికి డిక్లరైజేషన్ పై సంతకం చేసి వెళ్లాలి
– గత ముఖ్యమంత్రులు సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పిస్తే.. జగన్ ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారు
– సతీ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలని పండితులు అంటున్నా.. లెక్కలేనితనం
– టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
గత ముఖ్యమంత్రులు సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పిస్తే.. జగన్ ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ వీడియో ద్వారా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపక్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే… హిందూ సాంప్రదాయంపై జగన్ రెడ్డికి చిన్న చూపు వుంది. ప్రజలు పట్ల లెక్కలేని తనం ప్రదర్శిస్తున్నారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలని టీడీపీ, యావత్ హిందూ సమాజం తరపున డిమాండ్ చేస్తున్నాం.
అన్య మతస్తుడైన జగన్ రెడ్డి తిరుపతికి వెళ్లినప్పుడు డిక్లరైజేషన్ పై సంతకం చేసి వెళ్లడంలేదు. శ్రీవారికి జగన్ రెడ్డి సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించాలి. కానీ సింగిల్ గా వెళ్తున్నారు. హిందూ సమాజ మనోభవాల్ని, దేవాలయాల్ని కాపాడాలి. జగన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికలో క్రిష్టియన్లుగా పేర్కొన్నారు.
జగన్ పెళ్లి పులివెందులలోని ఓ కళాశాలలో క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం పాస్టర్ ఆధ్వర్యంలో జరిగింది. క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం సంతాకాలు పెట్టి రిజిష్ట్రరు చేసుకున్నారు. జగన్ రెడ్డి చెల్లెలు షర్మిల పెళ్ళి కూడ వెస్లీ చర్చ్ లో క్రీస్టియన్ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. లోటస్ పాండులోని జగన్ ఇంటినిచూస్తే పెద్ద సిలువ కనపడుతుంది. జగన్ రెడ్డి కుటుంబంలో ఏం జరిగినా క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. జగన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ ఎక్కడకు వెళ్లినా బైబిల్ తీసుకొని వెళతారు.
క్రిష్టియన్ గా ఉన్నజగన్ హిందూ సాంప్రదాయాన్ని కూడ గౌరవించాలి. అవగౌరవ పరచకూడదు. పండింతులు పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు సతీసమేతంగా సమర్పించాలి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. గత మూడేళ్ళుగా పట్టువస్త్రాలను సమర్పిస్తున్న జగన్ రెడ్డి సతీసమేతంగా ఏనాడు వెళ్లలేదు. గతంలో ముఖ్యమంత్రులందరూ సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించినవారే. ఆ సాంప్రదాయాన్ని గౌరవించారు. నేడు జగన్ రెడ్డి ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. ఆ విధంగా పట్టువస్త్రాలను సమర్పించకపోతే అరిష్టమని పండింతులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి సతీసమేతంగా సమర్పించడం ఇష్టం లేకపోతే కనీసం దేవాదాయ శాఖ మంత్రితో అయిన పట్టువస్త్రాలు సమర్పించాలి. అందుకు ఎవరూ అభ్యంతరం తెలపరు. గతంలో వేరే మతానికి చెందిన సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఎందుకు గత మూడేళ్ళుగా జగన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం చేయడంలేదు? టీటీడీ అధికారులు కూడ ఎందుకు సంతకం తీసుకోవడంలేదు? అనేది ప్రభుత్వం, టిటిడి అధికారులు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న ప్రతిసారి ఇష్యూ అవుతోంది. హిందూసాంప్రదాయాన్ని గౌరవించి సతీసమేతంగా రావాలని కోరడం జరుగుతోంది. జగన్ రెడ్డి ఈసారి అయిన డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. టిటిడి అధికారులు బాధ్యత తీసుకొని సంతంకం చేయించాలి. టీడీపీ తరపున, యావత్తు హిందూ సాంప్రదాయం ప్రకారం డిమాండ్ చేయడం జరిగింది.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 200 పైగా దేవాలయాల పై దాడులు జరిగాయి. దేవాలయాల పై జరిగిన దాడుల ఘటనలో ఏ ఒక్క దేవాలయానికి జగన్ రెడ్డి స్వయంగా వెళ్లి తెలుసుకుంది లేదు. జగన్ రెడ్డి తీరు హిందూ సాంప్రదాయం పై, దేవాలయాలు పై చిన్న చూపు కాదా?
దేవాలయ భూములు, మానస ట్రస్ట్ ఆస్తులు పై ఉన్న శ్రద్ధ దేవాలయాల పరిరక్షణ పై లేదు. అంతర్వేదిలో జరిగిన సంఘటన తరువాత సిబిఐ విచారణ వేస్తాం అని ప్రభుత్వం చెప్పంది. కాని నేటికి సిబిఐ విచారణ వేయకుండా గాలికి వదిలేసింది ప్రభుత్వం. నిధులు దారి మళ్లింపు, అన్యాక్రాంతం జరుగుతున్నా దేవాలయాలను కాపాడ బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగింది లేదు. ప్రజలు సంతోషంగా ఉండేలా మతాల మధ్య ఘర్షణలు చలరేగకుండా చంద్రబాబు నాయుడు బాధ్యతల తీసుకొన్నారు. ఉత్తారాంధ్ర అయోధ్యగా పేరొందిన 400 ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే నేటికి ఎవరు చేశారని తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు.
పీఠాపురంలో 6 దేవాలయాలు, 23 దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారు, గుంటూరులో దుర్గమ్మ ఆలయం కూల్చివేసినా, సింహాద్రి అప్పన్న ఆలయం, తిరుపతి తిరుమలలో, శ్రీశైలంలో కనక దుర్గమ్మ గుడిలో అపచరాలు దొర్లినా వాటిని సరిదిద్దడానికి అపచారం చేసిన వారి మీద ఏవిధమైన చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. అంతర్వేది, బిట్రగుంట రథాలు దగ్ధమైనచోట ఇంత వరకు ఏ విధమైన చర్యలను తీసుకోలేదు. రాజకీయాల్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. టీటీడీకి 81 మందిని తీసుకొచ్చి వ్యాపార కేంద్రంగా మార్చేయడం బాధాకరం. గత ప్రభుత్వం పింక్ డైమైండ్ విషయానికి సంబంధించిన కేసు కోసం ప్రజా ధనాన్ని వినియోగిస్తే, నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆ కేసును విత్ డ్రా చేసుకుంది.
భక్తులు కట్టిన డబ్బుతో వేసిన కేసును ఎందుకు నీరుగార్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతుంది. బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం జరుగుతుంది. తిరుమల కొండ పై అన్యమత గుర్తులు కనపడుతున్నాయి. టీటిడి వెబ్ సైట్ లో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. భక్తులకు అశ్లీల లింక్ టిటిడి వెబ్ సైట్ నుంచి వెళ్లడం బాధాకారం, సిగ్గుచేటు. ఎటువంటి పరిస్ధితులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో ప్రజలందరికి తెలుసు. వాటర్ బాటిల్ ధర రూ.60లు అమ్ముతున్న వైనం. ఘాట్ రోడ్డు నుంచి చెక్ పోస్టు వరకు ఎక్కడ నీరు దొరికే పరిస్ధితి లేదు.
నేడు తిరుపతిలో ముఖ్యమంత్రి పర్యటన కోసం అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు పెట్టకూడదని ముఖ్యమంత్రే చెబుతున్నారు. కానీ నేడు ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం గోడల పై వేయించిన దేవుళ్ల బొమ్మలను తొలగించి ముఖ్యమంత్రి పర్యటన ఉందని వైసీపీ పార్టీ రంగులను వేశారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీయోద్దని టీడీపీ తరపున హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగంలో అన్ని మతాలు సమానమని చెబుతుంటే హిందూ దేవాలయాలన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. దేవదాయ శాఖ నుంచి 144 కోట్లు దారి మళ్లించడం నిజంకాదా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రశ్నించారు.