– వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాపం కూడా ఆయనదే
– స్థానిక సంస్థల ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన క్రెడిట్ కూడా వైసీపీ ప్రభుత్వానిదే
– రాష్ట్రంతో పాటు మన బిడ్డల భవిష్యత్తును, ప్రధానంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
– తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం భీమవరంలో నిర్వహించిన గౌరవసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి ఏమన్నారంటే..
ఏపీలో జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసెంబ్లీ, శాసనమండలితో పాటు న్యాయస్థానాలకు కూడా విలువలేకుండా చేసేశారు. డీజీపీ అన్నా సీఎస్ అన్నా ఆయనకు లెక్కలేదు….ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నిస్సహాయులైపోయారు. ఎస్సైలు, సీఐలకు బాసులు డీఎస్పీ, ఎస్పీలు కాదు..ఎమ్మెల్యేలు, మంత్రులే బాస్ లు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్ చార్జీలు పెరగకపోయినా బాదుడే..బాదుడు అంటూ అసత్య ప్రచారం చేశారు..అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఏట్లో దొరికే ఇసుకను అప్పట్లో ఉచితంగా ఇస్తే ఇప్పుడు తన బినామీ కంపెనీకి అప్పగించి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు.అన్నపూర్ణ లాంటి ఏపీలో బూతుల సంస్కృతి తెచ్చిన ఘనత కూడా జగన్ రెడ్డిదే.
63 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్న ఏపీలో అగ్రికల్చర్ శాఖను నామరూపాల్లకుండా నిర్వీరం చేసేశారు.ఏపీ రైతులు క్వింటాలుకు రూ.213 మద్దతు ధర కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఏసీపీ(కమిషనర్ ఫర్ అగ్రిక్చలర్ కాస్ట్ అండ్ ప్రైసెస్) తేల్చింది.కానీ వాస్తవంగా మన నెల్లూరు జిల్లాలోనే క్వింటాలుకు రూ.500 మద్దతు ధరను రైతులు నష్టపోయారు. అసెంబ్లీ సాక్షిగా బడ్డెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేసిన పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదే.
ఇజ్రాయిల్ టెక్నాలజీ బిందు తుంపర్ల సేద్యాన్ని 2002లో దేశంలోనే మొదటిసారిగా ఏపీరైతులకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది.2014లో మరోమారు అధికారంలోకి వచ్చాక విస్తృతంగా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా సామాన్య రైతులకు కూడా ఆ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.2017లో బిందు తుంపర్ల సేద్యంలో ఏపీని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపాం.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిందు తుంపర్ల సేద్యమే కాదు..యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ కార్డులు, సూక్ష్మపోషకాలు..ఇలా అన్ని పథకాలను ఎత్తేశారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యవసాయ శాఖ పథకాలకు ఏపీలో స్థానం లేకుండా పోయింది.
రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చి దోచుకుంటున్న జగన్ రెడ్డి….ఆ వ్యాపారాలకు అడ్డు వస్తే రెడ్డి అయినా కోడిగుడ్డు అయినా ఒకటే అన్నచందంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారు.
చిల్లకూరు మండలంలో దశాబ్దాలుగా సిలికా వ్యాపారం చేసే రెడ్లలో అనేక మంది ఎగిరెగిరి వైసీపీకి ఓట్లు వేయించారు..అధికారంలోకి రాగానే వాళ్లందరి మైనింగ్ ను నిలిపేసి షాక్ ఇచ్చారు…మైన్లన్నింటిని శేఖర్ రెడ్డి చేతిలో పెట్టారు.బీహార్, యూపీలో కూడా లేనివిధంగా ఏపీలో పాలకులే దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు.
భీమవరం గౌరవసభలో కేంద్ర మాజీ మంత్రివర్యులు పనబాక లక్ష్మి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, సూళ్లూరుపేట ఇన్ చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, రవినాయుడు, వేనాటి సతీష్ రెడ్డి, రఘునాధ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీధర్, విజేత శ్రీనివాసులు, విజయకుమార్, మురలీ, శంకరయ్య, శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.