-రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశాడు
-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శనివారం నాడు సాయంత్రం వైసీపీ పార్టీ విశాఖ గర్జనను ఖండిస్తూ తంగిరాల సౌమ్య ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని జగన్ రెడ్డి తన అహంకారపూరితమైన స్వప్రయోజనాల కోసం నీరుగార్చాడు.
ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిన ప్రజాధనాన్ని రక్షించడానికి మోసపూరిత జగన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం చేసింది? గత తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి జరిగింది. పరిశ్రమలు, కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంవైపుగా చూశాయి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ భూబకాసురుల దాటికి రాష్ట్రము విడి పరుగులు తీశాయి.గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం పనులను అటకెక్కించారు.
వైసీపీ నేతల దృష్టిలో వికేంద్రీకరణఅంటే విభజించి దోపిడీని కేంద్రీకరించడమేనని ఏ ఒక్కరిని బాగు చేసే ఉద్దేశం కాదు.ఎంపీల బలంతో కేంద్రం మెడలు వంచుతాను అది చేస్తాను ఇది చేస్తాను అన్న జగన్ రెడ్డి పోలీస్ బలగాల సహాయం లేకుండా తాడేపల్లి రాజప్రాసాదం వీడి బయటకు వచ్చే సాహసం కూడా చేయలేని పరిస్థితి.వైసీపీ లో ఉన్న 25 మంది ఎంపీలతో ఎందుకు రాష్ట్ర ప్రజల హక్కులు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజల వాటా కోసం పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఎందుకు గర్జించలేకపోతున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడిందని ప్రకటించినప్పుడు వైసీపీ పార్టీ ఎంపీలు నిద్రపోతున్నారా?ఆంధ్ర రాష్ట్రమంతటా ప్రాంతాల నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా గర్జించడం చేత కానీ వైసీపీ పార్టీ, రాష్ట్రానికిప్రత్యేక హోదా తేవడానికి గుర్తురాని గర్జన ఇప్పుడెందుకు గుర్తొచ్చింది.
ప్రాంతాల మధ్య విద్వేషాలను రేకెత్తించి మూడు రాజధానిల పేరిట ఒకరిపై ఒకరిని ఉసిగొలిపి మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలనను మరియు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ పార్టీ రాజకీయ కుయుక్తులు చేస్తుంది వైసీపీ పార్టీ నీతిమాలిన రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అతి త్వరలోనే తిప్పి కొడతారు. ఇప్పటికే వైసీపీ పార్టీ గడప గడపకు వెళ్తున్న రాజకీయ నాయకులను రాష్ట్ర ప్రజానీకం ఛీత్కరిస్తున్నారని వైసీపీ పార్టీ అది తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.