-హత్యా ప్రణాళిక బెడిసి కొడుతుందనే ఆలోచనతోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ మార్పు
-సొంత బాబాయిని హత్య చేయించిన జగన్ రెడ్డికి తన సొంత పార్టీ ఎంపీ ఒక లెక్కా?
– మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంగళగిరిలోని జాతీయ టీడీపీ పార్టీ కార్యలయం, ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ………..
జగన్మోహన్ రెడ్డిది మొసలి తన పిల్లలని తానే తింటుంది అనే తత్వం. గతంలో జగన్ రెడ్డి తన సొంత బాబాయి గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చి రాజకీయాలలో లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేసును నీరుగార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో అందరికి తెలుసు. అనేక సాక్షాధారాలతో సిబిఐ, ప్రధాన ప్రతి పక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి కుటుంబ పాత్ర ఉందని అనేక సార్లు బయట పెట్టాం. సొంత చెల్లెలు సునీతమ్మ కూడ తన తండ్రి హత్య కేసులో జగన్ రెడ్డి కుటుంబ పాత్ర గురించి అనేక సార్లు చెప్పినా నిసిగ్గుగా నిందితుల పక్షాన నిలిచి వివేకానంద హత్య కేసును నీరుగార్చారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆంధ్రప్రదేశ్ వస్తే స్థానిక ఎమ్.పి. రాఘురామకృష్ణ రాజుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించడమే కాకుండా, అతని చుట్టూ ఆంధ్రప్రదేశ్ కు సబంధించిన సిబి.సిఐడికి చెందిన వంద మంది అధికారులను హైదరాబాద్ లో నిఘా ఉంచారు. రాఘురామ కృష్ణ రాజు హెలికాఫ్టరులో, రోడ్డు, రైలు మార్గాన ఏ విధంగా వస్తాడు అని ఎందుకు నిఘా పెట్టారు? రాఘురామ కృష్ణ రాజు నర్సాపూర్ ట్రైనుకి టిక్కెట్టు బుక్ చేసుకొని వచ్చుంటే ఆయనకు అదే చివరి రోజు అయివుండేది. సత్తెనపల్లి వద్ద హత్య చేయడానికి తాడేపల్లి నుంచి పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రధాన మంత్రి కార్యక్రమానికి నీ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు వస్తే వచ్చే సమస్య ఏంటి? ఎందుకు ఈ విధంగా ఆయన రాకుండా అడ్డంకులు సృష్టించారు? గతంలో రాఘురామ కృష్ణ రాజు తన సొంత హెలికాఫ్టరులో భీమవరంలోని ఎస్సార్ కెఆర్ కాలేజిలో అనేక సార్లు దిగారు. మరల అదే విధంగా రావడానికి అనుమతికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టరు, ఆర్ అండ్ బీ అధికారులతో కుదరదని లేఖ పెట్టించారు. రాఘురామ కృష్ణ రాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఏంటి మీకు ఇబ్బందని వైసీపీ నాయకులను, గతంలో అదే ఎస్సార్ కెఆర్ కాలేజి, భీమవరంలో అనేక సార్లు హెలికాఫ్టరులో వచ్చినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్సార్ కెఆర్ కాలేజిలో అనూకూలత లేదు అని కలెక్టరు ఇచ్చిన రిపోర్టుతో అనుమతి రద్దు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భీమవరం కన్సెంటివ్ స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ఉత్తరం తీసుకొని మరల ప్రభుత్వానికి అప్పీలు చేస్తే ఆ స్కూలు యాజమాన్యాన్ని బెదిరించి మరల ఆ అనుమతిని కూడ ఇవ్వకుండా రద్దు చేశారు. కోర్టు స్పష్టంగా ఎమ్.పి పర్యటనలో ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దు అని చెప్పినా అనేక రకాలుగా అడ్డుతగులుతూ ఇబ్బంది పెట్టారు.
చివరకు రాఘురామ కృష్ణ రాజు వచ్చే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ నుంచి అదే ట్రైన్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడ వస్తున్నాడని అతనికి కూడ భద్రత ఉంటుంది ధైర్యంగా ప్రయాణించొచ్చు అని అనుకున్నారు. కాని రాఘురామ కృష్ణ రాజు ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకున్న భోగినీ సత్తెనపల్లె వద్ద తగుల బెట్టి హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కాని కిషన్ రెడ్డి అదే ట్రైన్ లో ఉంటే వేసుకున్న ప్రణాళిక అమలు అవ్వదని మీరు ట్రైన్ లో రావద్దు ప్రత్యామ్నాయంగా విమానంలో రండి అని చెప్పి షెడ్యూల్ ని మార్చారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము చెప్తున్న విషయాలు, వాస్తవాల మీద సిబిఐ విచారణ జరిపించాలి. సత్తెనపల్లి సీసీ పుటెజును బయటకు తీయాలి. సత్తెనపల్లె రైల్వే స్టేషన్ లో రౌడి మూక, గూండాలు ఎంత మంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి వ్యవస్థతో విచారణ జరపాలి. చిన్న పోస్టు పెడితేనే అరెస్టు చేసే, చేతి కీలు బొమ్మలా వ్యవహరించే సిబి సిఐడి ఉంది కదా!. మీకు ఇంత వ్యవస్థ ఉన్నా మేము ఆధారాలతో సహా చెప్తున్న విషయాల గురించి విచారణ జరపలేరా?
ప్రధాని మంత్రి కార్యక్రమంలో స్థానిక ఎమ్.పి ఉండటం అనేది కనీస ప్రోటోకాల్. స్థానిక ఎమ్.పి, అది కూడ జగన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్.పి వస్తుంటే హతమార్చాలని ప్రణాళిక రచించారంటే అత్యంత బాధాకరం, దుర్మార్గం. సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్ళకి, సొంత పార్టీ ఎమ్.పిని హత్య చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రధాని మోడి కార్యక్రమానికి వస్తున్న రాఘురామకృష్ణ రాజుని హత్య చేయాలనుకోవడం వాస్తవమా కాదా జగన్ రెడ్డి చెప్పాలి? అదృష్టవశాత్తు రాఘురామ కృష్ణ రాజుకి ఈ విషయం గురించి వేరొకరి ద్వారా ముందే తెలిసి బేగం పేటలో ట్రైన్ దిగిపోయాడు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని అంతమోందిస్తారా? జగన్ రెడ్డి, అతని ఎమ్మేల్యేలు, ఎమ్.పిలు ఈ రాష్ట్రంలో రౌడి రాజ్యాన్ని తీసుకొచ్చి అంతులేని దౌర్జన్యాలు చేస్తున్నారు. దీనికి అనేక సంఘటనలు, రుజువులు ఉన్నాయి. మమ్మల్ని మాచర్లలో అంతమోందిచాలని అనుకున్నారు. పల్నాడులో ఇప్పటికి ఎన్నో హత్యలు జరిగాయి. ప్రొద్దుటూరులో పట్నం సుబ్బయ్య, జమలయ్య ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకం ఉన్నాయి. రాఘురామ కృష్ణంరాజు మీద హత్యా ప్రయత్నం జరిగిందా లేదా? చిన్న కోడి కత్తి ఘటన జరిగితేనే జగన్ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని కేంద్రంతో దర్యాప్తు చేయించుకున్నాడు. అలాంటిది 100 మందితో ఎంపీని చంపడానికి ట్రైన్ భోగిని తగలబెట్టాలనుకోవడం దేశ ద్రోహం అవుతుంది.
ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, విధ్వంసానికి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అమరావతి ప్రజా వేదిక నుంచి దుర్మార్గాలను మొదలు పెట్టాడు. మాస్క్ లేదని ప్రశ్నించిన దళితుడు సుధాకర్ ను చంపేశారు. గుంటూరులో మందుషాపుకు వెళుతున్న ముస్లిం యువకుడిని చంపేశారు. నంద్యాలలో సలాం అనే వ్యక్తి కుటుంబాన్ని హింసించి రైలు పట్టాల మీద తల పెట్టి చనిపోయేలా చేశారు. తెలుగుదేశం పార్టీకీ సంబంధించిన 600 మంది నాయకులు, కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలిసులనే తన సైన్యంలా మలచుకొని చట్ట ఉల్లంఘన కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడు. విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి ఎ1 ముద్దాయిగా ఉన్న అన్ని కేసులలో ఎ2. ఇవాళ కేంద్రంలో లాబీయింగ్ చేయడం, అక్రమాలు చేయడం, కలెక్షన్లు, సెటిల్మెంట్లు అన్ని చేసేది విజయసాయి రెడ్డినే. విశాఖ పట్నంలో గత 3 సంవత్సరాలలో విజయసాయి రెడ్డి ఎన్ని అక్రమాలు చేశాడో అందరికి తెలుసు. రఘురామకృష్ణ రాజు హత్యా ప్రణాళికపై రాష్ర్ట ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. దీని పై కేంద్రం కూడ విచారించాలి.