Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల సొమ్ముతో జగన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలేంటి రోజా?

• రూ.2కోట్లతో పుట్టినరోజు చేయడానికి జగన్ ఏం ఊడబెరికాడు?
• జగన్ రెడ్డిపై రోజాకు అంతప్రేముంటే నగరిలో స్టెప్పులేయాలి.
• నగరిలో చీటిచిరిగే జగన్ మెప్పుకోసం డ్యాన్సులేస్తోంది.
– తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

జగన్ రెడ్డి 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడని, మంత్రిరోజా పర్యాటకశాఖ పేరుతో చేస్తున్నడ్యాన్సులు, ఉత్సవాలపేరుతో 2కోట్లప్రజలసొమ్ము తగలేస్తున్న తీరు చూస్తుంటే, ప్రజలంతా మూకుమ్మడిగా ఇదేంఖర్మరా మాకు అంటున్నారని, జగన్ రెడ్డి ఏం ఘనకార్యంసాధించి, రాష్ట్రానికి, ప్రజలకు ఏంఊడబెరికాడని రోజా, ఆయనపుట్టినరోజు ఉత్సవాలు చేస్తోందో సమాధానంచెప్పాలని, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. జూమ్ ద్వారా శనివారం ఆమె విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆమె మాటల్లోనే ….

“జగన్ రెడ్డి 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంటే, పర్యాటకశాఖ పేరుతో ఉత్సవాలు నిర్వహించడమేంటమ్మా…రోజా? ప్రజలకు, రాష్ట్రానికి మీనాయకుడు ఏం ఊడబెరికాడని జనంసొమ్ము రూ.2కోట్లు తగలేసిమరీ ఉత్సవాలుచేస్తున్నావు. పదోతరగతి ప్రశ్నపత్రాలు దొంగిలించాడనా… లేక 16నెలలుజైల్లో చిప్పకూడు తినొచ్చాడనా..లేక బాబాయ్ ని చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టినందుకా? రాష్ట్రంలోని మహిళలు, యువతులు మాన,ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నందుకు రోజా ఉత్సవాలుచేస్తున్నారా? జగన్ రెడ్డి రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఊడపెరికాడని ఆయన పుట్టినరోజులు చేస్తున్నారు. రోజా తననాయకుడి డప్పుకొట్టి, ఆయనమెప్పుపొందాలంటే సొంతసొమ్ముతో సంబరాలు చేస్తే ప్రజలు హర్షించేవారు. తననియోజకరవర్గంలో రోజా చీటి చిరిగిపోయింది కాబట్టే, జగన్ మెప్పుకోసం ఉత్సవాలపేరుతో డ్యాన్సులేస్తోంది.

పర్యాటకశాఖఉద్యోగులకు నెలనెలా జీతాలులేక అల్లాడిపోతుంటే, ప్రజలసొమ్ముతో జగన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో స్వర్ణోత్సవాలు చేయడమేంటి రోజా? మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ , మంత్రి రోజా, హోంమంత్రి విజయవాడ నాగసాయి ఉదంతంపై డీజీపీకి ఎందుకు ఫిర్యాదుచేయలేదు? వైసీపీకి 151స్థానాలిచ్చింది వారిసొమ్ముతో జల్సాలు, ఉత్సవాలు చేసుకోవడానికి కాదు. రాష్ట్రంలో పెద్ద అప్పులఅప్పారావు ఎవరంటే జగన్మోహన్ రెడ్డే. ప్రజలకు ఏమైనా చేయమంటే డబ్బుల్లేవనే వ్యక్తి, తనపుట్టినరోజుకి జనంసొమ్ము ఎలా తగలేస్తాడు? తనపాలనలో ఏవర్గంప్రజలు సంతోషంగా ఉన్నారని జగన్ సిగ్గులేకుండా పుట్టినరోజులు, ఉత్సవాలంటున్నాడు.

స్వాత్రంత్య్రోత్సవం, గణతంత్రదినోత్సవంమాదిరి, బతికున్న జగన్ రెడ్డిపుట్టిన రోజుకి స్వర్ణోత్సవాలు నిర్వహించడం పిచ్చికాక మరేమిటి? తననియోజకవర్గంలో చీటి చిరిగిపోబట్టే, రోజా జగన్ మెప్పుకోసం పాకులాడుతోంది. జగన్ రెడ్డిపై ఆమెకు చెప్పుకోలేనంత ప్రేమే ఉంటే, నగరినియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు నిర్వహించి, ప్రజలమధ్యన స్టెప్పులేయాలి.

రోజా విన్యాసాలు చూశాక, జనానికి ఏమిటి మాకీ ఖర్మ అనే పరిస్థితిరాక ఏమవుతుంది? పర్యాటకశాఖంటే పర్యాటకుల్ని ఆకర్షించి, తద్వారావచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి కేటాయించాలి. మూడున్నరేళ్లనుంచి పడుకున్న పర్యాటకశాఖ జగన్ రెడ్డి పుట్టినరోజు అనగానే నిద్రలేచింది. తమరాష్ట్రంలో పర్యాటకశాఖ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, గొప్పగొప్రప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోలేని స్థితిలో మంత్రి రోజా ఉన్నారు.

వైసీపీ మహిళా నేత పరసా గురునాగసాయి విజయవాడలో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది? మాట్లాడితే రోడ్లపైకొచ్చి దిష్టిబొమ్మలు తగలెట్టి, ధర్నాలుచేసే వైసీపీమహిళానేతలు నాగసాయి దిష్టిబొమ్మ ఎందుకు తగలేయడంలేదు? ఆమె బాగోతం రోజాకు, ఇతరమంత్రులకు తెలియదా? లేకతమపార్టీ మహిళ ఏంచేసినా తప్పుకాదని వదిలేశారా? ఏపీ పర్యాటకశాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, పర్యాటకుల ఆకర్షణకోసం ప్రభుత్వంచేపట్టిన కారయక్రమాలేంటో కూడా రోజాకు తెలియదు. సులభ్ కాంప్లెక్స్ లకు కూడా జగన్ పేరుపెట్టే దుస్థితికి వచ్చిన వైసీపీనేతలు, మున్ముందు బ్రహ్మోత్సవాలకు కూడా జగన్ పేరు పెట్టేలా ఉన్నారు.

ఎప్పుడు బయటకు వచ్చినా ప్రజలకు ముఖం కనిపించకుండా పరదాలు అడ్డుపెట్టుకొని బటన్లునొక్కివెళ్లిపోయే ముఖ్యమంత్రికి పుట్టినరోజు సంబరాలు అవసరమా? రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఇలా అన్నివర్గాలు ఏమిటి మాకీఖర్మ అని బుర్రలు బాదుకుంటుంటే, 51ఏళ్లువచ్చాక జగన్ రెడ్డికి పుట్టినరోజు సంబరాలు కావాలా? సంబరాలు ఉత్సవాలు చేయించుకునేవాడికి, చేసేవాళ్లకు బుద్ధిలేదని తేలిపోయింది. తనకు పబ్లిసిటీ, ప్రమోషన్లు కావాలంటే రోజా మరలా జబర్దస్త్ కు వెళ్లొచ్చు. అంతేగానీ జనం సొమ్ముతో తమనాయకుడిని ఎంతగా లేపాలనిచూసినా, ప్రజలు లేవలేనివిధంగా ఆయన్ని కప్పెట్టేస్తారని టూరిజం మంత్రి తెలుసుకుంటే మంచిది” అని అనిత హితవుపలికారు.

LEAVE A RESPONSE