Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడిపై చర్యలు తీసుకోవాలి

– జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతికతఉన్నా, అశ్లీల అసభ్యపదజాలంతో, పశువుకంటే హీనంగా చంద్రబాబు, లోకేశ్, వారికుటుంబసభ్యుల్ని దూషించిన ఎమ్మెల్యే తోపుదుర్తిసోదరుడిపై చర్యలుతీసుకోవాలి
• రాప్తాడుఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అతనిసోదరుడు చందుని, జగన్ రెడ్డి తక్షణమే పార్టీ నుంచి తప్పించాలి.
• సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీవారిని అరెస్ట్ చేసే డీజీపీకి ఎమ్మెల్యే సోదరుడి బూతు పురాణం కనిపించలేదా?
• తోపుదుర్తి చందుపై తక్షణమే సుమోటోగా కేసునమోదుచేసి, అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖనుడిమాండ్ చేస్తున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టింది రాష్ట్రవినాశనానికేనని, ఆయన వైఖరిని, ఆపార్టీవారిని చూస్తే అర్థమవుతోందని, సభ్యతసంస్కారాలు తిలోదకాలిచ్చి, రాక్షసనడక నడుస్తున్న పార్టీ అని, కాబట్టే అశ్లీలత, అసభ్యతల కలబోతతో వైసీపీనేతలు బూతులపురా ణం వల్లేవేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్ర హం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయనమాటల్లోనే …

“రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంకోసమే జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టినట్టుంది. తనపార్టీద్వారా జగన్, ఇన్నేళ్లలో ప్రజలకు ఏంసందేశం ఇచ్చాడు? బూతులు తిట్టించడం తప్ప. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సభ్యతసంస్కారాలు, మానవత్వానికి తిలోదకాలిచ్చిన పార్టీ. ఆపార్టీ నడత, నడక అంతాబూతులమయం. రాక్షసనడక నడుస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు…
పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి అసమర్థ నాయకుడనే చెప్పాలి. అసమర్థుడు, చేతగానివాడుకాబట్టే 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, తండ్రివయస్సున్న వ్యక్తిని, 40ఏళ్ల సుదీర్ఘరాజకీయ అనుభవమున్నమనిషిని, ఆయన కుమారుడు లోకేశ్, కుటుంబసభ్యుల్ని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు ఇష్టానుసారం దూషించినా చర్యలు తీసుకోలేకపోతున్నాడు. పార్టీని కంట్రోల్ చేసి, సరైనరీతిలో నడపలేకపోతున్నాడు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ జగన్ కు లేకపోవడం వల్లే, వైసీపీనేతలు బరితెగించి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డే తనపార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు మనిషా…పశువా?
రాప్తాడు వైసీపీఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పశువుకంటే హీనంగా మాట్లాడాడు. అసలు అతను మనిషా..లేక పశువా? పశువులు కూడా సిగ్గుపడేలా ఆ భాష ఉంది. అలా మాట్లాడిన వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అతను మాట్లాడిన మాటల్ని ప్రజలచెవులు భరించలేవు. సభ్యతసంస్కారం ఉన్న వారు ఎవరైనా ఆమాటలు వింటే గుండెలుబాదుకుంటారు. రాష్ట్రప్రజలు ఆఘోరకలి చూసి, వినలేరనే ఎమ్మెల్యే సోదరుడి బూతులవీడియోను చూపించడంలేదు.

లోకేశ్ మా టార్గెట్ అంటున్నారంటే, లోకేశ్ ను చంపేస్తారా?
ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడి అసభ్యభాషను జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? అతని భాషను సమర్థిస్తున్నానని చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? లేదు..ఎందుకంటే ఆయనొక పిరికినాయకుడు. ప్రకాశ్ రెడ్డి సోదరుడి భాషఆసాంతం నేరంకాదా? దానిపై పోలీసులు కేసు నమోదుచేయరా? లోకేశ్ మా టార్గెట్ అంటున్నారంటే, వారి ఉద్దేశం లోకేశ్ ను చంపేస్తామనా? లోకేశ్ ను చంపేస్తామంటున్న పశుప్రాయులది అసలు మానవజన్మేనా? లోకేశ్ బాబు పేరుచెబితే ఎందుకు కొంతమంది వైసీపీనేతల దుస్తులు తడుస్తున్నాయి? లోకేశ్ మీతాటాకుచప్పుళ్లకు, ఉడతఊపులకు భయపడే స్థితిలో లేడు, ఆకుర్రాడు చాలా రాటుదేలిపోయాడని తెలుసుకోండి. జాకీ కంపెనీ పారిపోవడానికి రాప్తాడు ఎమ్మెల్యే కారణమని పత్రికల్లో వార్తవస్తే, దానిపైచట్టపరంగా ముందుకెళ్లాలిగానీ, అందరినీ తిడతారా? వార్తరాశారనిచెప్పి ఒకపత్రికాధిపతిని, పోయినకంపెనీ గురించి మాట్లాడరని చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని బూతులుతిడతారా?

ఎమ్మెల్యే సోదరుడిపై డీజీపీ తక్షణమే సుమోటోగా కేసునమోదుచేసి, అరెస్ట్ చేయాలి
తోపుదుర్తి సోదరుడి వ్యాఖ్యలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకని సుమోటోగా కేసు నమోదుచేయలేదు. ఎంపీనికూడా కాళ్లువిరగ్గొట్టే పోలీస్ శాఖ, ఎమ్మెల్యేసోదరుడిని ఎందుకు ఉపేక్షిస్తోంది? డీజీపీ తక్షణమే ప్రకాశ్ రెడ్డి సోదరుడిపై కేసుపెట్టి, వెంటనే అరెస్ట్ చేసి, బహిరంగప్రకటన చేయాలి. అతనిలానే టీడీపీవారు ఎవరైనా మాట్లాడిఉంటే, రాజేంద్రనాథ్ రెడ్డి ఊరుకునేవాడా? తోపుదుర్తి సోదరుడిలాంటి వారిని ఉపేక్షిస్తే, పోలీసులు భవిష్యత్ లో బాధపడకతప్పదు. ప్రకాశ్ రెడ్డి సోదరుడికి, ఆయనమాట్లాడిన భాషకు ఐపీసీ సెక్షన్లు వర్తించవా? తనపార్టీవారు, ప్రభుత్వంలోని వారు అశ్లీలంగా బూతులతో పేట్రేగిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణం.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుగారిని ఉద్దేశించి, “చంద్రబాబుని చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డుపై కాల్చిచంపాలి, చంద్రబాబుని బంగాళాఖాతంలో కలిపేయాలి, గ్రామాల్లో తిరిగితే చంద్రబాబుని రాళ్లతో కొట్టండి, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా, బాబూ.. బావిలో దూకిచావు” అన్నాడు. అధినాయకుడు బరితెగించి మాట్లాడితే, అతనిపార్టీవారు అశ్లీలత, అసభ్యతతో మాట్లాడ కుండా నీతివాక్యాలుచెబుతారా?

మేంకూడా మీకులానే మాట్లాడగలం జగన్మోహన్ రెడ్డిగారు..కానీ మా తల్లిదండ్రులు మమ్మల్ని సభ్యతసంస్కారంతో మాట్లాడటం నేర్పంచారు. తోపుదుర్తి ప్రకాశ్ ని, అతనిసోదరుడిని వారితల్లిదండ్రులు సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని చెప్పిఉంటే అలా మాట్లాడేవారుకాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మకాలే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, నిత్యం ఇలాంటిబూతులు, రోతనేతల పాలనను ప్రజలు చూడాల్సివచ్చింది” అని తెలిపారు.

LEAVE A RESPONSE