టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జగ్గంపేట, పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక అనపర్తిలో అడ్డంకులు సృష్టించారు.ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు.ఏపీలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోంది. ఇది చాలా దుర్మార్గం.
జగన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేసినా, కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఏనాడు అడ్డంకులు కల్పించలేదు.రోడ్లపై అడ్డంగా నిలబడి పీకే రాసిచ్చిన పచ్చి అబద్ధాల సొల్లు చెబుతున్నా టీడీపీ హయాంలో పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారా?నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరపడింది.సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రజలనుద్దేశించి మాట్లాడానివ్వరా… ఏపీలో ప్రజస్వామ్యం చచ్చింది.రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి..ఇది చాలా బాధాకరం.