Suryaa.co.in

Andhra Pradesh

అప్పు పుడితేనే అన్ని వర్గాలకు పైసలనే దుస్థితిలో జగన్ రెడ్డి సర్కార్

• భవిష్యత్ లో పోలీసులకు జీతాలకు బదులు బాండ్లు ఇచ్చే పరిస్థితి
• పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2లక్షల చొప్పున అప్పులభారం వేసిన జగన్ రెడ్డి, ఇప్పటివరకు రూ.10లక్షల14వేలకోట్ల అప్పులుచేశాడు
• అప్పులు చేయడంలో పోటీపడుతున్న జగన్ రెడ్డి సర్కారు, గత 12 నెలలనుంచి 1వ తేదీ నుంచి 24 తేదీలమధ్యనే ఉద్యోగులకు జీతాలిస్తోంది
• సామాజిక పింఛన్లు, వాలంటీర్ల జీతాల చెల్లింపునకు కూడా కిందామీదా పడుతోంది.
• ఎస్ఐపీబీకి పెట్టుబడులు, యువతకు లక్షకుపైగా జాబ్స్ అంటూ సాక్షిలో తప్పుడురాతలు రాశారు
• కేబినెట్ ఆమోదం తెలిపితే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావని తెలియదా జగన్ రెడ్డి?
• అప్పులు చేయడంలో ఉన్న శ్రద్ధలో సగంకూడా, జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంపై చూపడంలేదు
• పాకిస్థాన్, శ్రీలంక కంటే దారుణంగా ఏపీ తయారైందనే వాస్తవాన్ని ప్రజలంతా గ్రహించాలి.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి

జగన్ రెడ్డి ఎడాపెడా చేస్తున్న అప్పులతో ఇప్పటికే రాష్ట్రంపై 10లక్షల14వేలకోట్ల అప్పుల భారం పడిందని, పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2లక్షల అప్పులేసిన ఘనత చేతగాని ముఖ్యమంత్రికే దక్కిందని, 12 నెలలనుంచీ 1వతేదీ నుంచి 24వ తేదీ మధ్యలో జీతాలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం, భవిష్యత్ లో జీతాలకు బదులు, పోలీసులకు బాండ్లు ఇవ్వబోతోం దని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయమాటల్లోనే…

“రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వని జగన్ రెడ్డి ప్రభుత్వం, అప్పులు మాత్రం ఎడాపెడా చేసేస్తోంది. విపరీతంగా అప్పులుచేస్తూకూడా, ఉద్యోగులకు సకాలంలోజ జీతాలు, వృద్ధులు, వికలాంగులకు సామాజిక పింఛన్లు చెల్లించలేకపోతోంది. జనవరి నెలలో ఆర్ బీఐ ద్వారా ప్రభుత్వం రూ.4,557కోట్లరుణం తీసుకుంటే, కార్పొరేషన్ల ద్వారా రూ.5వేలకోట్లు, ప్రజలద్వారా వచ్చిన పన్నులు, ఇతరత్రా ట్యాక్స్ లు కలిపి వచ్చిన రూ.12వేలకోట్ల పైచిలుకు మొత్తంకలిపి రూ.20వేలకోట్లు రాబట్టింది. జనవరిలో రాష్ట్ర ఖజానా కు మొత్తం రూ.20వేలు కోట్లు వచ్చినా, ఫిబ్రవరి 8వతేదీవచ్చినా జీతాల చెల్లింపులు 20శాతం కూడా పూర్తికాకపోవడం జగన్ రెడ్డి అసమర్థత కాదా? పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2లక్షల చొప్పున అప్పులభారం వేసిన జగన్ రెడ్డి, ఇప్పటివరకు రాష్ట్రంపై రూ.10లక్షల 14వేలకోట్ల అప్పులభారం మోపాడు.

గత 12నెలల నుంచి చూస్తే 1 నుంచి 24 తేదీల మధ్యనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది…
అప్పులు చేయడంలో పోటీపడుతున్న జగన్ రెడ్డి సర్కారు, గత 12 నెలలనుంచి చూస్తే, 1వ తేదీ నుంచి 24 తేదీలమధ్యనే ఉద్యోగులకు జీతాలిస్తోంది. అప్పులు చేయడంపై చూపుతున్న శ్రద్ధలో సగంకూడా అభివృద్ధి, సంక్షేమంపై జగన్ రెడ్డి చూపడంలేదు. రాష్ట్రఆర్థిక పరిస్థితి, పాకిస్థాన్, శ్రీలంక కంటే దారుణంగా ఉందనే వాస్తవాన్ని ప్రజలంతా తెలుసుకోవాలి. సరిగా లెక్కలు చెప్పకుండా, ఉద్యోగుల ఇన్సూరెన్స్ సొమ్ము, పీఎఫ్ సొమ్ముని కూడా జగన్ సర్కారు వాడేసింది. గత రెండున్నరేళ్లనుంచి రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేటికీ చెల్లించలేదు. డీఏలు, పీఆర్సీ బకాయిలు, టీఏలు అన్నికలిపి దాదాపు రూ.25వేలకోట్లవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. నెలల తరబడి ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం జీతాలు, ఇతరత్రా బకాయిలు చెల్లించకపోవడం దౌర్భాగ్యం కాక, మరేమిటి? గతంలో టీడీపీ ఉద్యోగుల జీతాలపై ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలను సాకుగా చూపి తప్పించుకున్నారు. మంత్రి బుగ్గన అయితే పిట్టకథలు, కట్టుకథలు ఎన్నోచెప్పు కొచ్చారు. నెలలు గడిచేకొద్దీ ప్రభుత్వానికి చెప్పడానికి కారణాలు కూడా దొరకడంలేదు.

త్వరలో పోలీసులకు పేస్లిప్ లకు బదులు బాండ్లు ఇవ్వనున్న జగన్ రెడ్డి ప్రభుత్వం…
పోలీస్ శాఖలో 80శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా వారి పీఎఫ్ ఖాతాలు తనిఖీచేసుకుంటే, ప్రభుత్వం వారుదాచుకున్న సొమ్ము ఉంచిందో, లేదో తెలుస్తుంది. పోలీసు లకు సకాలంలో టీఏ, డీఏలు ప్రభుత్వం చెల్లిస్తుందా? పండుగలు, పబ్బాలు, శుభకార్యాలు లేకుండా 24 గంటలు పనిచేసే పోలీసులకు సక్రమంగా జీతాలు ఇవ్వని దుస్థితిలో జగన్ సర్కారు ఉంది. పోలీసుల నుంచి వసూలుచేసే టీడీఎస్ సొమ్ముని కూడా ఏపీ ప్రభుత్వం సకాలంలో కేంద్రానికి జమచేయడంలేదు. సంవత్సరంన్నర నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి జగన్ ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సింది ఇవ్వడంలేదు. త్వరలోనే పోలీసులకు పే స్లిప్ లనే బాండ్లుగా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వముంది. జీతాలు ఇవ్వలేక బాండ్లు ఇస్తే, రెండు, మూడుసంవత్సరాల తర్వాత పోలీసులు వాటిని క్యాష్ చేసుకోవాల్సిన దుస్థితి రాబోతోంది. పోలీసుల పరిస్థితి భవిష్యత్ లో దారుణంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నవారిని మెప్పించడంకోసం హద్దులుదాటి ప్రవర్తిస్తున్న పోలీసులంతా భవిష్యత్ లో జీతాలకోసం పడిగాపులు పడక తప్పదు. ఠంఛన్ గా 1వ తేదీన సామాజిక పింఛన్లు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, ఇప్పుడు 7వ తేదీ వచ్చినా సరిగా పింఛన్లు ఇవ్వడంలేదు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ రెడ్డి, మూడున్నరేళ్లలో ఒక్కజాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. మధ్యలో ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించాడు. వాలంటీర్లను ప్రభుత్వఉద్యోగులని, ఆర్టీసీసిబ్బందిని ప్రభుత్వంలో కలిపి వారిని కొత్తగా నియమించినట్టు డబ్బాలు కొట్టుకున్నా డు. జగన్ రెడ్డి నియమించిన వాలంటీర్లకు కూడా సక్రమంగా జీతాలు రావడంలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాలే సక్రమంగా ఇవ్వనప్పుడు, తమ ఉద్యోగాలు ఉంటే ఎంత.. పోతే ఎంత అని వాలంటీర్లే బావురుమంటున్నారు.

చలిగా ఉందని, జ్వరం వస్తుందని దావోస్ వెళ్లకుండా ఇళ్లల్లో కూర్చొని, కేబినెట్ ఆమోదం తెలిపితే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా జగన్ రెడ్డి?
ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి అలా ఉంటే సాక్షిపత్రికలో మాత్రం ప్రైవేట్ ఉద్యోగాలు లక్షల్లో వస్తున్నాయని విషపురాతలు రాస్తున్నారు. ‘లక్షకుపైగా జాబ్స్’ అంటూ నేడు ఆ పత్రికలో వచ్చిన కథనం.. ముమ్మాటికీ నిరుద్యోగులను వంచించడమే. ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్ మెం ట్ ప్రమోషన్ బోర్డు)లోకి పెట్టుబడులు వస్తున్నాయని, దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని దిక్కుమాలిన రాతలు రాశారు. ఏసీ గదుల్లో కూర్చొని, కేబినెట్ ఆమోదించింది.. పెట్టుబడు లు వస్తున్నాయి అనగానే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయా? ఇలాంటి కాకమ్మ కబుర్లు, కట్టుకథలతో ఎన్నాళ్లు యువతను, నిరుద్యోగుల్ని మోసగిస్తారు? దావోస్ వెళ్లడాని కి చలిఉంటుంది.. జ్వరం వస్తుందని చెప్పే ప్రబుద్ధుల ముఖాలు చూసి, దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తారా? తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లి తన రాష్ట్రానికి పరిశ్రమ లు, పెట్టుబడులు రాబట్టుకుంటే, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ విశాఖలో కూర్చున్నాడు. ముఖ్యమంత్రో, ఏపీ కేబినెట్టో కేంద్ర కేబినెట్టో ఆమోది స్తేనో, అవాహి..ఆవాహి అంటేనో ఏపీకి పరిశ్రమలు రావు జగన్ రెడ్డి? 2014 నుంచి 2018 మధ్యన చంద్రబాబు మంత్రులు, అధికారుల బృందంతో ప్రతిఏటా దావోస్ వెళ్లి, పారిశ్రామికవే త్తలతో భేటీఅయ్యి రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికదిగ్గజాలతో ఆయన జరిపిన సంప్రదింపులు ఫలితమే నేడు హైదరాబాద్ మహానగరంలో నెలకొన్న పరిశ్రమలు. చంద్రబాబు మాదిరి, అధికారంలోకి వచ్చినప్ప టినుంచి ఒక్క సంవత్సరమైనా జగన్ రెడ్డి రాష్ట్రం దాటివెళ్లి, పారిశ్రామికవేత్తలతో మంతనాలు జరిపాడా” అని జీ.వీ.రెడ్డి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE