Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్షాలకు సహకరించిన వారిపై దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులు పెట్టడమే జగన్ రెడ్డి విధానం

– పవన్ కల్యాణ్ బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్థులు చేసిన నేరమా?
-ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ రెడ్డి పని కల్పిస్తున్నారు
-ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు
-పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో సుపారీ
– ప్రాణాలు తీయాలనే నందిగామ పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి
-పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

జగన్ రెడ్డి విధ్వంసంతోనే తన పరిపాలన మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి పాలన మొదలైంది. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వ అవినీతిని ప్రశించిన వారిపై దాడులు, కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్షాలకు సహకరించిన వారిపై దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులు పెట్టడమే జగన్ రెడ్డి విధానం. జగన్ రెడ్డి పాలనలో విధ్వంసానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటం గ్రామస్థులు చేసిన తప్పేంటి? అనేక ఇళ్లు కూల్చారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే వారు చేసిన నేరమా?

రహదారి విస్తరణ పేరుతో జేసీబీలు తీసుకువచ్చి గర్భిణీలు ఉన్నప్పటికీ కాళ్లవేళ్లా పడినా లాఠీలతో కొట్టింటి ఇళ్లను కూల్చారు. ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ రెడ్డి పని కల్పిస్తున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రెడ్డి పాలన ఉంది. విశాఖలో 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ప్రశ్నించినందుకు అయ్యన్నపాత్రుడిని సీబీసీఐడీ పోలీసులు దండుపాళ్యం బ్యాచ్ లా వెళ్లి, గోడలు దూకి, ఆడవారిపై దౌర్జన్యం చేసి, కుమారుడు రాజేష్ ను కొట్టి అర్థరాత్రి అరెస్ట్ చేశారు. మీ అరాచకాలు ప్రజలు చూడకూడదని అర్థరాత్రిళ్లు వెళ్తున్నారా?

అమరావతి కోసం భూములిచ్చిన రైతులను బూట్లతో తన్ని పాదయాత్రను అడ్డుకున్నారు. బాత్రూం అంత గోడకట్టారని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే కోర్టులు ఏం తీర్పులు ఇచ్చాయో చూశాం. జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కమలాపురంలో వక్ఫ్ భూముల్లో సినిమా హాళ్లు కడితే చర్యలు ఉండవు. నదులు పక్కన, చెరువులు పక్కన భూములు ఆక్రమించుకుని ఇళ్లు కడితే పట్టించుకోరు. దుర్యోధనుడి పరిపాలన మాదిరిగా జగన్ రెడ్డి తీరు ఉంది. దుశ్సాశునుడికి పట్టిన గతే పడుతుంది.

ప్రతిపక్ష నేతల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు
పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేశారు. రెక్కీ కూడా నిర్వహించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రతిపత్ర నేతలను, అధ్యక్షులను కూడా చంపుతారా? నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై స్థానిక ఎమ్మెల్యే, వారి తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్, వారి ముఖ్య అనుచరులు కుట్రపన్ని దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆ రాయి సీఎస్ వోకు గడ్డంపై తగిలింది. అదే కంటిపై తగిలుంటే కన్నుపోయేది. ఇంకా 15 రాళ్ల వరకు విసిరారు. ఈ ప్రభుత్వం పథకం ప్రకారం ప్రతిపక్ష నేతలపై, అధ్యక్షులపై పథకం ప్రకారం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.

ఇందుకు నిదర్శనమే పవన్ పై రెక్కీ. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వ్యక్తులు తాడేపల్లి ప్యాలెస్ లోనే తిరిగుతున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇప్పటం గ్రామస్థులపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ఇళ్లు, కాంపౌండ్ వాల్ ను కట్టించి ఇస్తాం. ప్రజలందరూ జగన్ రెడ్డి అరాచకాలను గమనించాలి. ముఖ్తకంఠంతో ఖండించాలి. ఇప్పటంలో గాంధీ, నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేసి.. వైఎస్ విగ్రహానికి మాత్రం పోలీసులు కాపలా ఉండి కాపాడారు. చంద్రబాబు పై హత్యాయత్నంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలి.

అరుణ్ కుమార్ ముఖ్య అనుచరుడే నిన్నటి పర్యటనలో ఉన్నాడు. ఎందుకు వారు అక్కడ ఉన్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లు సుపారీపైనా విచారణ జరగాలి. ఇందులో తాడేపల్లి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటంలో రహదారి విస్తరణ కోసం అని చెబుతున్నారు.. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఒక్క తట్ట మట్టి వేశారా? టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు బూజు పట్టగా.. నేడు ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు. ఒక్క ఇల్లు కట్టలేదు. వైసీపీ పాలన జేసీబీ పాలన. వచ్చే రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, మేథావులు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు టీడీపీ పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు గారి నిర్ణయం మేరకు కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్తాం.

LEAVE A RESPONSE