ఉద్యోగులు, నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు

-వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అక్రమాలకు పాల్పడాలని చూస్తోంది
-మొత్తం ఐదు స్థానాల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది.
– శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు
-వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది

-అధికారులు ఎన్నికల అక్రమాలకు పాల్పడితే వారిపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం
-మాజీ శాసనమండలి సభ్యులు ఎ.ఎస్ రామకృష్ణ

పర్చూరి అశోక్ బాబు:
సాధారణంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అక్రమాలకు తావులేకుండా జరుగుతాయి. కానీ, భారతదేశంలో ప్రప్రధమంగా ఏపీలో ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, అక్రమాలు చూస్తున్నాం. స్వయంగా ఎన్నికల సంఘమే వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దని చెబితే.. అనంతపురంలో స్వయానా మంత్రి ఉషశ్రీ చరణ్ వాలంటీర్లను వాడుకోమని బహిరంగంగా చెప్పడం దుర్మార్గం. వైసీపీ మంత్రులు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు.

చిత్తూరు ఓటర్ల నమోదుపై కూడా సి.ఎం ఆఫీసు నుంచి ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను ప్రలోభపెడుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చట్టాన్ని తుంగలో త్రొక్కి అధికార పార్టీ నాయకులకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమీషన్ వద్ద సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసే వ్యవస్థ లేదని అవకాశంగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం దొంగ సర్టిఫికేట్లను పెట్టి ఓటర్ల నమోదుకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని మేం సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ దృష్టికి తీసువెళుతాం. ఓటర్ పేరు ప్రక్కన వారి విద్యార్హతలు కూడా ఓటర్ల జాబితాలో ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నాం.

వైసీపీ దుర్మార్గాలకు అనుకూలంగా వ్యవహరించని అనంతపూర్, నెల్లూరు డీఈఓలను బదిలీ చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిజాయితీగా, నిబద్దతతో పనిచేసే అధికారులను బదిలీ చేయడం ఎంతవరకు న్యాయం.? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు డీఈఓ అక్రమ బదిలీపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు డీఈఓను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఉత్తరాంధ్రలో Physical Obligations ఎన్ని ఇస్తున్నారో కూడా ఎమ్మార్వోలు లెక్క చెప్పడం లేదు.

ప్రతిపక్షాలు తీసుకెళితే అభ్యంతరం చెబుతున్న అదికారులు వైసీపీ వాళ్లు తీసుకెళితే మాత్రం నిరభ్యంతరంగా తీసుకుంటున్నారు. డూప్లికేట్ ఒటర్ లిస్టులు ఇవ్వడం, సక్రమంగా పనిచేసే డీఈఓలను బదిలీచేయడం, వద్దన్నా వాలింటీర్లను ఎన్నికల్లో వాడుకోవడం మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మంత్రులే వాలంటీర్లను విచ్చలవిడిగా వాలంటీర్లను వాడుకుంటున్నారు. తెలుగుదేశం టీచర్ ఎమ్మెల్సీలలో పోటీ చేయకపోయినా… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోటీ చేస్తున్న టీచర్ల సంఘాలు లేవనెత్తిన అంశాలకు పూర్తి మదత్తు ఇస్తాం.

గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు చివరి తేది నవంబర్ 7. కొంతమంది ఇది 9 వ తారీఖు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. వైసీపీ ప్రభుత్వం ఈ అక్రమాలకు పాల్పడటానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు. నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఐదు గ్రాడ్యేయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం గెలిచే అవకాశం లేదు. అందుకే అక్రమాలకు, ప్రలోభాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. రౌడీలను, క్రిమినల్స్ ను పెద్దల సభకు తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైసీపీ అక్రమాలను త్రిప్పికొట్టేందుకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం. వాలంటీర్ల సేవలను వాడుకోవాలని చెప్పిన మంత్రిని డిస్ క్వాలిఫై చేయాలని కూడా ఫిర్యాదు చేస్తాం.

ఏ.ఎస్ రామకృష్ణ:
2024 లో జనరల్ ఎన్నికలు ఉన్న సంధర్బంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ లాంటివి. గతంలో రాజశేఖర్ రెడ్డి ఈ రెండు ఎన్నికల్లో మేం పోటీం చేయం, వీటిని ఇతరులకు వదిలిపెడుతున్నాం అని అనేవాడు. జగన్ రెడ్డి తండ్రిలా ఎన్నికల్లో నిలబడవద్దు అని మేం అనడం లేదు. కానీ, జగన్ రెడ్డి పాల్పడుతున్న అక్రమాలపై మాత్రమే చూస్తూ ఊరుకోం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరిగినప్పుడే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది ప్రాధమిక సూత్రం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూత్రాన్ని తుంగలో త్రొక్కుతోంది.

2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఒక టీచర్ కానీ టీచర్ ను అనంతపూర్ నుంచి దిగుమతి చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానంలో పోటీ చేయించారు. అనేక మంది అధికారులను ప్రలోభాలకు గురిచేసి ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలవడం జరిగింది. తిరుపతి, నెల్లూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అలాంట అక్రమాలతోనే గెలవాలనే దురుద్దేశంతో డీఈఓలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. వారు ఒప్పుకోకపోవడంతో వారిని కమీషనర్ కు అప్పగించారు. వీళ్లు చేసిన తప్పేంటి? ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్లు ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇందులో మూడు సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి ఉండాలి. ఈ మూడు సంవత్సరాలు వరుసగా ఫ్రావిడెంట్ ఫండ్ కట్టాలి. వీరి జీతాలను ఆయా స్కూల్ మేనేజ్ మెంట్ వారి బ్యాంకు ఖాతాలలో జమచేయా. ఈ నింబంధనలు సంతృప్తపరచని టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని డీఈఓలపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు దానికి ఒప్పుకోకపోవడంతో వారిని కమీషనర్ కు అప్పగించారు.

కర్నూలు డీఈఓ ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో త్రొక్కి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ వందిమాగాదులకు కర్నూలు డీఈఓ ఓటు హక్కు కల్పిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నుతోంది. ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పర్యవేక్షణలో జరగవు. ఇవి కేంద్ర ఎన్నికల సంఘం నియమించే ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి.

యూనిఫైడ్ సర్వీసు రూల్స్ తీసుకురాకపోతే వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తామని చెప్పారు. రాజీనామా చేశారా? దీనిపై ప్రజలు వారిని నిలదీయాలి. వాలంటీర్లు తమకు ఇష్టమైన వాళ్లను ఓటర్ల లిస్టులో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేసుకుని జగన్ రెడ్డి రాక్షస ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉంది. ఓటర్ల ఎన్నికల నమోదులో డీఈఓలు అక్రమాలకు పాల్పడితే వారిపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నాం. 2021 లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య గెలుపుకోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.

Leave a Reply