Suryaa.co.in

Andhra Pradesh

పన్నులు విధించటం,ప్రజల నుంచి డబ్బులు గుంజటమే ధ్యేయంగా జగన్ రెడ్డి పాలన

– రద్దయిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టుకు జీవో 36 తెచ్చి ప్రజలపై భారం మోపటం సిగ్గుచేటు
– జీవో 36 వెంటనే ఉపసంహరించుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

గతంలో రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను 36 జీవో పేరుతో తెరపైకి తెచ్చి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలనుకోటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ మండిపడ్డారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సంపద సృష్టించడం చేతకాని జగన్ రెడ్డి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. 2008 లో జీవో 747 ద్వారా రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మళ్లీ 36 జీవో ద్వారా తెరపైకి తెచ్చి ప్రజల ‎ డబ్బులు గుంజేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం తెగబడటం దుర్మార్గం.

2008కి ముందు మిగులు భూములపై ప్రభుత్వానికి హక్కు ఉండేది. అక్కడ ఎవరూ అనుమతి లేకుండా ఇళ్లు కట్టుకోవాడిని అవకాశం లేదు, కానీ 2008లో గత ప్రభుత్వం 747 జీవో తెచ్చి ఇళ్లు కట్టుకునే పేదల వద్ద నామినల్ ఫీజు కట్టించుకొని కొంత మినహాయింపు ఇచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి అర్హత, హక్కు లేని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు పేరుతో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో 36 జీవో పేరుతో ఆ ప్రాంతాల్లో ఉన్న విలువ కంటే ఒకటిన్నర రెట్లు కట్టమని చెప్పి అర్బన్ ‎ల్యాండ్ రెవెన్యూ చీప్ కమిషనర్ పేరుతో నోటీసులిచ్చారు.

రద్దు అయిన యాక్టును మళ్లీ 36 జీవో తెచ్చి ప్రజల్ని ఏవిధంగా నోటీసులు జారీ చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతసేపు ప్రజల నుంచి డబ్బులు ఎలా గుంజాలి‎, ఖజానా ఎలా నింపుకోవాలి అన్న ద్యాసే తప్ప అభివృద్దిపై చేద్దామన్న ఆలోచన లేదు. జగన్ రెడ్డి కనిపించిన ప్రతిదానిపై పన్నులు విధిస్తూ బ్రిటీష్ పాలకులకంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు.

చెత్త పన్ను, ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో పేదల ఇళ్లపై పన్ను అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో జీవో 36 తెచ్చి ప్రజల నుంచి పన్నులు వసూలుకు ప్రణాళికి సద్దం చేయటం దుర్మార్గం. జగన్ రెడ్డి అస్తవ్యస్త పాలన విధానాలతో సామాన్యులు జీవించటమే కష్టంగా మారింది, మరి పన్నులు ఎలా కడతారు? సంపద సృష్టించటం చేతకాని జగన్ రెడ్డి పన్నులు వేసి ప్రజల సంపద కొల్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు.

చెత్తపన్ను, డ్రైనేజీ పన్ను, ఇంటి పన్ను, ఆస్తి పన్నలపై ప్రజల నుంచి ఇప్పటికే ప్రతిఘటన ఎదరవుతోంది. ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు ఇప్పుడు వన్ టైంట్ సెటిల్ మెంట్ పేరుతో పేదల నుంచి. రూ. 10 వేలు, రూ. 20 వసూలు చేయటం దుర్మార్గపు చర్య. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.

గతంలో జుట్టుకు పన్ను వేయడం చూశాం. బ్రిటీష్ వారు వారికి వ్యతిరేకంగా వ్యవహరేంవారిపై పన్ను వేయటం చూశాం కానీ జగన్ రెడ్డి కనిపించిన ప్రతిదానిపై పన్నులు విదిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు.ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 36 జీవోను ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం 36 జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి. జగన్ రెడ్డి ప్రభుత్వం అర్బన్ సీలింగ్ యాక్ట్ పై, 36 జీవోపై తన వైఖరి మార్చుకోకుంటే టీడీపీ ‎ఆందోళన నిర్వహిస్తుందని సయ్యద్ రఫీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE