Suryaa.co.in

Andhra Pradesh

గ్రోత్ రేట్ పెరిగినా, ప్రభుత్వఆదాయం ఎందుకు పెరగలేదో జగన్ చెప్పాలి

– చంద్రబాబు హయాంలో పెరిగిన గ్రోత్ రేట్ ఎంత..వచ్చిన ఆదాయమెంత?
– తన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో పెరిగిన గ్రోత్ రేట్ ఎంత..వచ్చిన ఆదాయమెంతో జగన్ బహిర్గతం చేయగలరా?
• ముఖ్యమంత్రి ఎకనమిస్ట్ కాదు.. గ్రేట్ కేపిటలిస్ట్. ఆయన ఆర్థికవిధానాలు స్టడీచేయడానికి అంతర్జాతీయ సంస్థలు తహతహలాడుతున్నాయి.
• ప్రధానరంగాలకు కేపిటల్ ఎక్స్ పెండేచర్ కు పెంచకుండా ప్రభుత్వఆదాయం ఎలా పెరుగుతుంది?
• ప్రభుత్వం బడ్జెట్లో చూపిన లక్షలకోట్ల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడంలేదు.
• గ్రోత్ రేట్ పెరిగితే ఆదాయం పెరగాలని టీడీపీప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అన్న జగన్, ఇప్పుడు తన ప్రభుత్వంలో గ్రోత్ రేట్ పెరిగినా ఆదాయం ఎందుకు పెరగలేదో చెప్పాలి.
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

వైసీపీప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్ (2023-24) ద్వారాఎప్పటిలానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రప్రజలకు మాయాప్రపంచంచూపే ప్రయత్నంచేశారని, ఆయన మాటలు కోటలు దాటు తుంటే, ప్రభుత్వచేతలు మాత్రం గడపకూడా దాటడంలేదనేలా బడ్జెట్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే , పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“బడ్జెట్లో పెరుగుతున్న లక్షలకోట్ల అభివృద్ధి, వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎక్కడాకనిపించడం లేదు. సాగునీటిరంగం, ఇతరప్రధానరంగాలకు టీడీపీప్రభుత్వం పెట్టినఖర్చుతోపోలిస్తే, ఈ4ఏ ళ్లలో వైసీపీప్రభుత్వం చేసినఖర్చు చాలాచాలాతక్కువ. 4ఏళ్లలోవివిధ ప్రధానరంగాలకు జగన్ ప్రభుత్వం రూ.20వేలకోట్లుకూడా ఖర్చుపెట్టలేదు. అవికూడా పాతబిల్లుల చెల్లింపులకే. అం టే రూ.10వేలకోట్లుకూడా ఖర్చుపెట్టలేదు. ఉదాహరణకు చంద్రబాబు హయాంలో కేటాయిం పులు రూ.100 లు ఉంటే, ఖర్చు 95రూ.లు ఉండేది. వైసీపీప్రభుత్వంలో ఖర్చులు రూ.40, 50కే పరిమితం అవతున్నాయి. శాసనసభ ఆమోదంమేరకు శాఖలుఖర్చు చేస్తున్నాయా ..లేదా? చేయకపోతే నిరుపయోగంగా ఉన్ననిధుల్ని ఎలా ఖర్చుచేయాలనే ఆలోచన ప్రభుత్వం అసలు చేయడంలేదు. కొన్నికొన్నిశాఖల్లో శాసనసభ అనుమతితో పనిలేకుండానే ఖర్చుపెడుతున్నారు. నిధులకేటాయింపు, ఖర్చుల్లో వైసీపీప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. ఈమాట మేం అంటున్నదికాదు..సీ.ఏ.జీ (కాగ్) నే రూ.86వేలకోట్లఖర్చుకి వైసీపీ ప్రభుత్వం లెక్కలు చూపలేదని చెప్పింది. మాటలు, కవితలతో ఆకట్టుకోవాలనిచూస్తే సామా న్యులకు ఒరిగేదేం లేదు.

గ్రోత్ రేట్ పెరిగితే ఆదాయంపెరగాలని అన్న జగన్, ఇప్పుడు తన ప్రభుత్వంలో గ్రోత్ రేట్ పెరిగినా ఆదాయం ఎందుకు పెరగలేదో సమాధానం చెప్పాలి
జగన్మోహన్ రెడ్డిపదేపదే చెబుతున్న మాట తనప్రభుత్వం అద్భుతప్రగతిసాధిస్తోంది అని, దేశప్రగతి కంటే ఏపీప్రగతే బాగుందని. ఇదే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడి హాయాం లో అప్పటిఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, మాట్లాడుతూ, “గ్రోత్ రేట్ కు, రెవెన్యూస్ కి సంబంధంలేదు. బడ్జెట్లోచూపే తప్పుడులెక్కలవల్ల నష్టమే ఎక్కువ. అరుణ్ జైట్లీగారు 7శాతం జీడీపీని చూపిస్తూ, డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ 35శాతంపెరిగిందన్నారు. 9, 9.5శాతం గ్రోత్ రేట్ ఏపీప్రభుత్వం చూపిస్తుంటే, డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూకూడా 35శాతంపెరగాలికదా!” అన్నారు. గ్రోత్ రేట్ పెరిగితే ఆదాయంపెరగాలని అప్పుడుజగన్ అన్నాడు. రైతుభాషలో పె ట్టాలంటే పంటఏపుగా పెరిగితే దిగుబడిపెరగాలి. అదేలెక్కన ఏపీప్రభుత్వం అభివృద్ధి బ్రహ్మం డంగాచేస్తే, దానికితగినట్టు ఆదాయంపెరగాలికదా!

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు హాయాంలో సాధించిన వృద్ధి రేటుని తన ఘనతగా చెప్పుకుంది. జగన్ తన నాలుగేళ్ల పాలనలో సాధించిన గ్రోత్ రేట్ సున్నా. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి సంవత్సరం నమోదైన గ్రోత్ రేట్ : 8.6శాతం. చంద్రబాబు హాయాంకంటే మెరుగ్గా పెరిగిందని, అద్భుతమైన ప్రగతి సాధించామని జబ్బలు చరుచుకున్నారు. అలానే రెండో ఏడాది 11.43శాతం సాధించామని, కరోనాటైమ్ లోకూడా అద్భుత ప్రగతి నమోదైందని ప్రకటనలు వేశారు. ఆ ఏడాది అక్వారంగం ఆదాయం బాగా పెరిగినట్టు చెప్పా రు. వాస్తవంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆక్వాఎగుమతులు ఆగిపోయి, ఆ రంగం తిరోగమనంలో పయనించింది. దేశంలో కూడా ఆక్వారంగం పరిస్థితి అలానే తయారైంది. అలాంటిది ఏపీ మాత్రం ఆక్వారంగంతో ప్రగతిసాధించినట్టు చెప్పింది. ఇలాంటి మర్మాలు సామాన్యులకు అర్థంకావు. జగన్ ప్రభుత్వం నిజంగా అద్భుతమైన గ్రోత్ రేట్ సాధిస్తే, దానికి తగినట్టు ప్రభుత్వఆదాయం ఎందుకు పెరగలేదో, గొప్ప ఆర్థికవేత్త అయిన జగన్ సమాధానం చెప్పాలి. అప్పులుతప్ప, ఆదాయంలేని ప్రభుత్వం గొప్పలతో మభ్యపెట్టాలని చూసింది. 2018-19లో రాష్ట్ర ఆర్థికవృద్ధిరేటు 22వశాతంలో ఉంటే, తాము మొట్టమొదటిస్థానానికి తీసు కొచ్చామని చెప్పారు. ఎలా తీసుకొచ్చారో ఆర్థికశాఖామంత్రి వివరాలు బయటపెట్టగలరా? కేవలం ప్రభుత్వ ప్రకటనల ద్వారా దేశంలో తామే నెంబర్-1అని చెప్పుకుంటున్నారు. తొలి ఏడాది నమోదైన గ్రోత్ రేట్ చంద్రబాబు హయాంలో సాధించిన అభివృద్ధివల్లే నమోదైంది. జగన్ తన నాలుగేళ్లపాలనలో సొంతంగా సాధించిన గ్రోత్ రేట్ సున్నా. ఈ వ్యవహారంపై శాసనసభలో తా ము లేవనెత్తే ప్రశ్నలకు సమాధానంచెప్పగల ధైర్యం ఆర్థికమంత్రి బుగ్గనకు ఉందా?

ప్రజల్ని ఆర్థికంగా ఎంపవర్ చేసేవాటికి జగన్ ప్రభుత్వం ఖర్చులు పెంచలేదు. చంద్రబాబు హాయాంలో పెరిగిన గ్రోత్ రేట్ ఎంత..వచ్చిన ఆదాయమెంత? జగన్ ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో పెరిగిన గ్రోత్ రేట్ ఎంత..వచ్చిన ఆదాయమెంతో బహిర్గతం చేయగలరా? 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్న రెవెన్యూలోటు రూ.13,898కోట్లు. ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం దాన్ని రూ.లక్షా10వేలకోట్లకు పెంచింది. ఇంతపెంచి.. కేపిటల్ ఎక్సపెండేచర్ పెంచారా అంటే, అదీలేదు. కేపిటల్ ఎక్స్ పెండేచర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, రోడ్లు, ఆసుపత్రులు, భవనాలు, పాఠశాలల నిర్మాణం…వాటిద్వారా వచ్చే ఆదాయం. ఇది ఏమైనా పెంచారా అంటే…ఏమీలేదు. చంద్రబాబు హాయాంలో పెరిగిన గ్రోత్ రేట్ ఎంత.. వచ్చిన ఆదాయంఎంత? అలానే ఇప్పుడు మీప్రభుత్వంలో పెరిగినగ్రోత్ రేట్, వచ్చినఆదాయం వి వరాలు బయటపెట్టాలని బుగ్గనను డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ మా ప్రభుత్వంలో జగన్ అడిగిన ప్రశ్నలే..వాటినే ఇప్పుడు మేం అడుగుతున్నాం. ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసే పథకాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలాచాలా స్వల్పం. ఈ బడ్జెట్లో జగన్ ప్రభుత్వం ప్రజల్ని ఎంపవర్ చేసేవాటికి ఖర్చులు పెంచలేదు. చంద్రబాబుహాయాంలో కేపిటల్ ఎక్స్ పెండేచర్ 12.18శాతముంటే, జగన్ ప్రభుత్వంలో అది 6.77శాతం మాత్రమే. కేపిటల్ ఎక్స్ పెండేచర్ కు నిధులు వెచ్చించకుండా ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది?

ముఖ్యమంత్రి ఎకనమిస్ట్ కాదు.. గ్రేట్ కేపిటలిస్ట్. ఆయన ఆర్థికవిధానాలు స్టడీచేయడానికి అంతర్జాతీయ సంస్థలు తహతహలాడుతున్నాయి
ముఖ్యమంత్రి తనకు తాను గొప్ప ఎకనమిస్ట్ నని చెప్పుకున్నాడు. పాకిస్తాన్ పాలిటిక్స్, శ్రీలంక ఎకనామిక్స్ లోజగన్ దిట్ట. గ్రేటెస్ట్ కేపిటలిస్ట్ అయిన జగన్ పొరపాటున ఎకనమిస్ట్ అని చెప్పుకున్నట్టున్నాడు. ప్రజాస్వామ్యానికి కాదు… జగన్ ధనస్వామ్యానికి నిలువెత్తు రూపం. అలాంటి వ్యక్తి తాను పేదవాడినని చెప్పుడం సిగ్గుచేటు. క్యాష్ వార్ లో జగన్ బలంగా ఉన్నాడు.. వచ్చేఎన్నికల్లో దాన్నే అమలుచేస్తాడు. కానీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో క్లాస్ వార్, క్యాష్ వార్ ను కాకుండా, పెర్ఫార్మెన్స్ వార్ నే నమ్ముతారు. జగన్ అద్భుతాలకు గొప్పపరిశ్రమలు.. గొప్పపెట్టుబడులు వచ్చాయి. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ సంస్థలకు వస్తున్నలాభాలే అందుకు నిదర్శనం. జగన్ తన విధానాలతో పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలిస్తున్నాడు. జగన్ ఆర్థికవిధానాలు, బిజినెస్ మోడల్ ను స్టడీ చేయడానికి అంతర్జాతీయసంస్థలు తహతహలాడుతున్నాయి.

జగన్ ఒక్కసారి నేలమీద నడిస్తేనే (పాదయాత్ర) ప్రజలజీవితాలు తలకిందులయ్యాయి. ఆయన ఎప్పుడూ ప్రత్యేక విమానాల్లో గాల్లో తిరిగితేనే రాష్ట్రానికి, జనానికి మంచిది. టీడీపీ ఆవిర్భవించాకే బీసీలు రాజకీయపార్టీలవైపు చూడటం మొదలైంది. ఢిల్లీ నుంచి తనమిత్రులకు నోటీసులు వచ్చాకే జగన్ ఢిల్లీ పర్యటన ఖరారవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం వేదికను బీసీల వేదికగా మార్చారు. టీడీపీ మాది అని బీసీలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీల్నిజగన్ నా బీసీలు అంటుంటే వారు భయపడుతున్నారు. నా అన్నవారిని జగన్ ఏంచేశాడో అందరికీ తెలుసుకదా!” అని జగన్ ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE