Suryaa.co.in

Andhra Pradesh

జగన్ టెన్త్ ఫెయిల్

-అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ గా నమోదు చేసుకోలేదు
– జగన్ పాలనలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు
విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రుల పై పెను భారం
కదిరి నియోజకవర్గంమోటుకుపల్లి పీవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హల్ లో ముస్లీంలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

వైసీపీ పాలనలో ముస్లీం ల పై దాడులు పెరిగిపోయాయి. మా రక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలి.విదేశీ విద్య పథకం రద్దు చేశారు.వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేస్తున్నారు.కనీసం ఖబర్ స్తాన్ అభివృద్ది కి నిధులు కేటాయించడం లేదు.ఉన్నత విద్య కోసం ఉర్దూ కాలేజీలు లేక ఇబ్బంది పడుతున్నాం.బీడీ కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందడం లేదు. -కదిరి నియోజకవర్గం మైనార్టీలు

లోకేష్ మాట్లాడుతూ…
ముస్లీంలను మోసం చేశారు జగన్.ఆత్మహత్య చేసుకోవడం మహా పాపంగా బావించే ముస్లీంలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చారు జగన్.అబ్దుల్ సలాం కుటుంబం పై దొంగ అనే ముద్ర వేసి కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకునేలా వేధించారు వైసిపి నాయకులు.స్కూల్ ఫస్ట్ వచ్చే మిస్బా కి టీసి ఇప్పించారు వైసీపీ నేతలు. ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
హజీరా అనే ముస్లిం యువతిని రేప్ చేసి చంపేశారు వైసిపి నేతలు ఇప్పటి వరకూ ఆమె తల్లికి న్యాయం జరగలేదు.ఇబ్రహీం అనే వ్యక్తి మసీదు భూముల కోసం పోరాడితే నడి రోడ్డు మీద నరికేసారు వైసిపి వాళ్ళు.ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు జగన్.మైనార్టీ ల రిజర్వేషన్ల కోసం ఢిల్లీ లో పోరాడుతుంది టిడిపి మాత్రమే.మైనార్టీల రిజర్వేషన్లు కోసం కనీసం అడ్వకేట్ ని పెట్టడానికి జగన్ కు మనస్సు రాలేదు.

ముస్లిం లను రాజకీయంగానూ, ఆర్థికంగానూ ఆదుకుంది టిడిపి.డిపి హయాంలో మైనార్టీలను లోక్ సభ, రాజ్య సభ కి పాంపాం.కౌన్సిల్ చైర్మన్ గా షరీఫ్ గారికి అవకాశం ఇచ్చాం.టిడిపి హయాంలో ముస్లీం లకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి.దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి.రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, మైనార్టీలకు ప్రత్యేక పాఠశాలలు, ఉర్దూ యునివర్సిటీ, ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేసింది టిడిపి.

మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసింది టిడిపి.ఇమామ్, మౌజమ్ లకి గౌరవ వేతనం ఇచ్చింది టిడిపి.టిడిపి హయాంలో దుకాన్ , మకాన్ పథకం అమలు చేసాం.జగన్ పాలనలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదు.రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ లు అభివృద్ది కి జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదు.

వైసిపి నాయకులు వక్ఫ్ ఆస్తులను కబ్జా చేస్తున్నారు.టిడిపి గెలిచిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.వక్ఫ్ బోర్డు కి జ్యుడిషియల్ పవర్ ఇచ్చి ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.నేను ముస్లిం సమావేశం లో జై హింద్ అన్నానని వైసిపి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు.దేశం ముందు… దేశం పై ప్రేమ ఉండటం తప్పా? మైనార్టీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు వైసిపి నేతలు.టిడిపి హయాంలో హజ్ హౌస్ లు నిర్మించి, హజ్ యాత్రకు సహాయం అందించాం.వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపిలో నిర్మాణం లో ఉన్న హజ్ హౌస్ నిర్మాణం ఆపేసింది.మైనార్టీలను ఆర్ధికంగానూ, రాజకీయంగానూ జగన్ దెబ్బతీశారు.

అమ్మఒడి డబ్బులు కూడా ముస్లీం సంక్షేమానికి ఖర్చు చేసాం అని చెబుతుంది వైసిపి ప్రభుత్వం.ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు కనీసం మైనార్టీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు.బీజేపీ తో పొత్తు ఉన్నా చంద్రబాబు గారి హయాంలో ఏ రోజు ముస్లీం లకి అన్యాయం జరగలేదు. ఒక్క దాడి జరగలేదు.దామాషా ప్రకారం ముస్లీం లో ఉన్న ఉపకులాలకి నిధులు కేటాయిస్తాం. కదిరి లో ఉన్న బీడీ కార్మికులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటుంది. ఇక్కడ ఈస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చెయ్యడానికి కృషి చేస్తాం.కదిరిలో టిడిపి గెలవకపోయినా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ముస్లీం లకి అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసాం.కదిరి లో 18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షిల్ స్కూల్ ఏర్పాటు చేసింది టిడిపి.కదిరి లో 15 కోట్లతో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేశాం.మిగిలిన పనులు పూర్తి చెయ్యలేని అసమర్థ ప్రభుత్వం వైసిపిది.

కదిరి లోని ప్రతి మండలం లో షాది ఖానా లు ఏర్పాటుకు 2 కోట్ల నిధులు ఇచ్చాం.కదిరి లో మైనార్టీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కోసం రెండు కోట్లు ఇచ్చాం. ఇప్పుడు అక్కడ సచివాలయం నడుస్తుంది.జగన్ టెన్త్ ఫెయిల్ అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ గా నమోదు చేసుకోలేదు.టెన్త్ ఫెయిల్ జగన్ అవగాహన లేకుండా అరకొర డబ్బులు ఇచ్చి సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అని కలరింగ్ ఇస్తున్నాడు.విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రుల పై పెను భారం పడుతుంది.

LEAVE A RESPONSE