Suryaa.co.in

Political News

జగన్..ఉత్తరాంధ్రలో ప్రమాద గంటలు మోగుతున్నాయ్

స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు. ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు. విశాఖ జిల్లాలో వైకాపా కు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది.

విశాఖ జిల్లాలో చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తు పోతున్నాయి. జనంలో అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నాయి. దీంతో అధికార పక్షంలోంచి తెలుగుదేశం లోకి జంప్ చేయాలని ఆలోచించే వారుchandrababu-naiduమొదలై పోయారు. ఇది సత్యం. చూస్తుంటే జగన్ యాంటీ మీడియా కథనాలు ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటే, జనాలు ఇలా భయంకరంగా రావడం చూస్తుంటే, వైకాపా పట్ల జనం వ్యతిరేకత పెంచుకుంటున్నారా? లేదా చంద్రబాబు మీద ప్రేమ పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అనకాపల్లి సభ విజయవంతం కావడం గమ్మత్తయిన విషయం. ఎందుకంటే ఇక్కడ కాపులకు ప్రాధాన్యత ఇచ్చి, గుడివాడకు మంత్రి పదవి ఇచ్చారు. గవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పదవులు ఇచ్చారు. అన్నింటికి మించి అనకాపల్లిని జిల్లా కేంద్రం చేశారు. అయినా జనం ఇలా రావడం వెనుక ఏముంది? అన్నది పాయింట్. వెలమలను పక్కన పెట్టడం అన్నది గట్టిగా ప్రభావం కనబరుస్తోందని లోకల్ రాజకీయనాయకులు అంచనా వేస్తున్నారు. నిజానికి వెలమలకు కూడా ఇటీవలే మంత్రి పదవి దక్కింది. కానీ దాని ప్రభావం మాత్రం కనిపిస్తున్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ వెలమలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. బండారు, అయ్యన్న తరచు వైకాపాను గట్టిగా ఢీ కొంటున్నారు.

ఇక చోడవరం లాంటి చిన్న సెంటర్ లో జనం వేలాదిగా తరలి రావడం చూసి వైకాపా చోటా నాయకులు కిందా మీదా అయిపోతున్నారు. చోడవరం సభ అంత భారీ సక్సెస్ కావడానికి రీజన్ ఏమిటి అని కారణాలుbabu-chodavaramలెక్కిస్తున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కానీ ఇది ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే కావచ్చు. ఒకటి ఒకటి కలిస్తే రెండు అన్నట్లు..వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగడానికి ఇలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి గమనించి ప్రణాళికలు మార్చుకోవాల్సి వుంది.

-గోపాల్

LEAVE A RESPONSE