– ప్రజల ప్రాణాల్ని గాల్లో దీపాలుగా మార్చి, తనచేతగానితనంతో వైద్యరంగాన్ని నిర్వీర్యంచేశాడు.
108, 104, మహాప్రస్థానం వాహనాల్ని నిర్వహించలేని జగన్, ప్రజల్ని ‘ఫ్యామిలీ డాక్టర్’ తో ఆదుకుంటాడా?
• వైద్యరంగానికి సంబంధించి జగన్ మాటలు కోటలుదాటుతుంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీసం జ్వరం ఇంజక్షన్లు, టాబ్లెట్లు కూడా దొరకడంలేదు.
• రాష్ట్రంలోని నెట్ వర్క్ఆసుపత్రులకు జగన్ ప్రభుత్వం రూ.750కోట్లు చెల్లించాల్సి ఉంది.
• ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్యసేవల్ని నిలిపేశాయి.
• కేంద్రం కేవలం 3 మెడికల్ కళాశాలలకు అనుమతిస్తే, జగన్ నిర్మాణానికి ఒక్కరూపాయి కేటాయించకుండా 17కళాశాలలు తానే కట్టిస్తున్నట్టు డబ్బాలు కొడుతున్నాడు.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని, నెట్ వర్క్ ఆసుపత్రులు ఏవీ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు వైద్యం అందించడంలేదని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని ఆర్థికసమస్యలతో అనారోగ్యంతో ప్రజలునానా అవస్థలు పడుతున్నారని, 2000 నెట్ వర్క్ ఆసుపత్రుల్లో 900 వరకు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయని, నెట్ వర్క్ ఆసుపత్రులకు జగన్ ప్రభుత్వం రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకం అమలు కేవలం సాక్షి దినపత్రికలోని ప్రకటనలకే పరిమి తమైంది. ఆరోగ్యశ్రీ కింద రూ.7338కోట్లు ఖర్చుపెట్టామన్న జగన్ మాటలు పచ్చిఅబద్ధం. “ప్రభుత్వ ఉద్యోగులు చేయించుకున్న వైద్యానికి సంబంధించి, వారికి ఈ ప్రభుత్వం రూ.100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాడెకట్టేసిందనే చెప్పాలి. అబద్ధాలు చెప్పడంలో జగన్ ది అందెవేసిన చెయ్యి. ఆరోగ్యశ్రీ కింద రూ.7338కోట్లు ఖర్చుచే సినట్టు ఇటీవలే జగన్ చెప్పాడు. అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని వంచిస్తూ, సాక్షిదినపత్రికలో వాటినే అక్షరాలరూపంలో ప్రజలసొమ్ము దుర్వినియోగంచేసి మరీ అచ్చేయిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వమిచ్చే ఆయుష్మాన్ భారత్ నిధులతోనే ఇన్నాళ్లు ఆరోగ్యశ్రీని నడిపిం చింది. అదికూడా లేకపోవడంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాల్లో దీపంలా మార్చింది. నెట్ వర్క్ ఆసుపత్రులు తమబకాయిలకోసం ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్యంచేయించుకున్న రోగులకు డబ్బులిస్తాంగానీ, ఆసుపత్రులకు ఇవ్వ మని ఇటీవల జగన్ చేసిన ప్రకటనకూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చింది.
టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీకి ద్వారా ఎంతసొమ్ము కేటాయించి, ఎంతమందికి వైద్యసేవలు అందించారో చెప్పగలం. తనప్రభుత్వంలో ఎన్నికోట్లు వెచ్చించి, ఎందరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాడో జగన్ చెప్పగలడా?
టీడీపీహాయాంలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కి నిధులు కేటాయింపులు ఇబ్బడిముబ్బడి గాజరిగాయి. ఆ నిధుల్లో 40శాతం సొమ్ము రోగులఆపరేషన్లకు, 35శాతం సొమ్ము ఆసుపత్రు లకు ఇచ్చేవారు. మిగిలిన సొమ్ముని బోధనాసుపత్రులకుచెల్లించేవారు. జగన్ ప్రభుత్వంలో అవేవీ జరగడంలేదు. ఆఖరికి ప్రభుత్వాసుపత్రుల్లో సర్జరీలు జరగడమే గగనమైంది. సాధార ణ ఇంజక్షన్లు, పారాసెట్మాల్ వంటి టాబ్లెట్లు కూడా ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లో లభించడంలేదు. ఒకపక్కప్రభుత్వాసుపత్రుల్ని నిరుపయోగంగా మార్చిన జగన్, ఇటీవల ఆర్భాటంగా ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించాడు. ఆ పథకం ఒక అపహస్యం గా మారిందనే చెప్పాలి. ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు వైద్యులుండాల్సింది ఒక్కరే ఉంటున్నారు. మరోపక్క 108, 104 వైద్యసేవలు ప్రజలకు అందకుండా పోయాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖపై జగన్ మాటలు కోటలుదాటుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు ఎలాం టి వైద్యం అందడంలేదు. ప్రభుత్వఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, సరైన సౌకర్యాలు లేక పోవడంతో పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు.
టీడీపీహయాంలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద కోటి20లక్షలమందికి నాణ్యమైన వైద్యసేవలు అందాయి. జగన్ ప్రభుత్వంలో ఈ 4ఏళ్లలో ఎంతమందికి మెరుగైనవైద్యం అందిందో చెప్పగలరా?
ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాసొమ్ము ఎలాగైతే తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుందో, ప్రభుత్వపెద్దలు, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు అత్యవసర వైద్యసేవలకోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. కరోనాసమయంలో మంత్రులు చికిత్సకోసం హైదరాబాద్, బెంగుళూ రు వంటి నగరాలకు వెళ్లారు. సామాన్యప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లాలనుకంటే అక్కడిప్రభుత్వం అడ్డుకుంది. ఆ సమయంలో కేసీఆర్ తో మాట్లాడి, ఏపీ ప్రజలకు మెరుగైనవైద్యం అందేలాచేయడంలో కూడా జగన్ విఫలమయ్యాడు. కరోనా సమయంలో ప్రజలకు సరైనవైద్యం అందించలేక జగన్ చాలామందిని బలితీసుకున్నాడు. ప్రజలు చస్తే ఛస్తారు..నాకేంటి అన్న అహంకారంతో ముఖ్యమంత్రి ఉన్నాడు. టీడీపీహయాంలో ఎన్టీ ఆర్ వైద్యసేవ ద్వారా కోటి20లక్షలమందికి మెరుగైన వైద్యం అందించారు. తన ప్రభుత్వంలో జగన్ ఎంతమందికి నాణ్యమైన వైద్యం అందించాడో చెప్పగలడా? చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో మూత్రపిండాల మార్పిడి, గుండెశస్త్రచికిత్స వంటి పెద్దపెద్ద చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువధరకే ప్రజలకు అందుబాటులో ఉండేవి. సీఎంఆర్ఎఫ్ క్లెయిమ్స్ 70 శాతం వరకు టీడీపీప్రభుత్వం పూర్తిచేసింది. వైసీపీప్రభుత్వంలో ఒక్కమంత్రి, ఎమ్మెల్యే కూడా రూపాయి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ప్రభుత్వం నుంచి రాబట్టుకున్నది లేదు.
వైద్యఆరోగ్యశాఖలో 13,987 ఖాళీలభర్తీ.. రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల నిర్మాణం అంతా ముఖ్యమంత్రి ప్రచారార్భటమే
2021-22లో ఆర్భాటంగా ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, వైద్యారోగ్య శాఖలో 13,987ఉద్యోగాలుభర్తీచేసినట్టు చెప్పాడు. వాటిలో 10,341 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలే. శాశ్వత ఉద్యోగాలు 1,532 మంది అయితే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2,114. ఇదేనా ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖకు చేసిన గొప్ప? రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి డబ్బాలుకొడుతున్నాడు. వాస్తవంగా కేంద్రం 3 మెడికల్ కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. వాటినిర్మాణంకోసం కేంద్రప్రభుత్వం రూ.303 కోట్లు మంజూరుచేస్తే, రాష్ట్రప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు. ప్రభుత్వం తరపును రూపాయి ఇవ్వకుండా 17మెడికల్ కళాశాలలు ఎక్కడ కడుతున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. 108, 104 వాహనాల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. వాటిని బాగుచేయించలేని జగన్ మెడికల్ కళాశాలలు కట్టించి పేదల్నిఉద్ధరిస్తాడా? 1000రూపాయలు దాటితే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద పేదలకు అయ్యేఖర్చంతా భరిస్తుందన్న ముఖ్యమంత్రి మా టలు నీటిమీదరాతలే అయ్యాయి.
ఏ నెట్ వర్క్ ఆసుపత్రిలో కూడా ముఖ్యమంత్రి చెప్పింది జరగడంలేదు. రాష్ట్రవైద్య ఆరోగ్యమంత్రి విడదలరజని ఉత్తుత్తి సమీక్షలతో సరిపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకార్డుతో ఎలాంటి ఉపయోగంలేదని ప్రజలకు అర్థమైంది. పేదలుప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్తులు తాకట్టుపెట్టాల్సిన దుస్థితివచ్చింది. ఆఖరికి చంద్రబాబు ప్రభుత్వంలో నడిచిన మహాప్రస్థానం వాహనాలను కూడా నిర్వహించలేని దుస్థితి లో జగన్ ప్రభుత్వం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు మిథ్యగా మారాయి. ఆఖరికి గిరిజనమహిళలకు సరైన ప్రసవాలు చేయలేని దుర్భరస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిం ది. ప్రజల్ని హింసించడం.. ప్రతిపక్షాలను, గిట్టని మీడియాను మారీచులు, రాక్షసులు అని నిందించడం తప్ప, జగన్ కు పరిపాలన ఏంటో తెలియదు.” అని రఫీ తెలిపారు.