Suryaa.co.in

Andhra Pradesh

అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్ పిలుస్తోంది.. జగన్ మళ్లీ జైలుకే

– నేను పరదాలు కట్టుకుని ప్రజల్లోకి రావడం లేదు
– లోకేష్ ఎక్కడికి వస్తే పోలీసులు అక్కడికి వస్తారు
– కానీ అత్యాచారాలు చేసిన వాళ్ల దగ్గరకు మాత్రం వెళ్లి పట్టుకోరు
– తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం సదాశివపురం, మోదుగులపాడులో స్థానికులతో నారా లోకేష్ మాటామంతీ

పోలీసుల ప్రవర్తన రోజురోజుకూ వింతగా మారుతోంది. నేను ప్రజల్ని చూడటానికి స్టూలు ఎక్కితే దాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. నేను మైకుతో మాట్లాడకపోయినా అడ్డుకుంటున్నారు. పోలీసులూ.. మీరు అడ్డుకోవాల్సింది నన్ను కాదు రేపిస్టులను, హత్యలు చేసేవాళ్లను అడ్డుకోండి. లోకేష్ ఎక్కడికి వస్తే పోలీసులు అక్కడికి వస్తారు..కానీ అత్యాచారాలు చేసిన వాళ్ల దగ్గరకు మాత్రం వెళ్లి పట్టుకోరు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి మోసం చేశాడు. విద్యార్థులకు సరిగ్గా ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. కార్మికులకు పని దొరకడం లేదు.నా స్వరం ఎన్టీఆర్ ఇచ్చింది..దాన్ని నొక్కేయలేరు.జగన్ అరాచకాలకు నేను భయపడను. నేను పరదాలు కట్టుకుని ప్రజల్లోకి రావడం లేదు.రైతులు, రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు రావాలి.

అందుకే బాబు రావాలి..బాధలు పోవాలి అని అంటున్నారు.టీడీపీ ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.నేను ఎక్కడుంటే అక్కడ పోలీసులతో డ్రోన్లతో వీడియోలు తీయిస్తున్నారు. రఘురామిరెడ్డి అనే అధికారి తాడేపల్లిలో కూర్చుని వీటన్నింటినీ చూస్తాడు పోలీసులపై ఒత్తిడి పెంచడం వల్ల..వాళ్లు ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రం నుండి వచ్చిన పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.బాబాయిని చంపిన కేసులో, అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్ పిలుస్తోంది. జగన్ మళ్లీ జైలుకే పోతాడు. అందుకే సౌకర్యం కోసం జైళ్లకు కూడా నాడు-నేడు అంటూ పనులు చేయిస్తున్నాడు.

LEAVE A RESPONSE