– నారా లోకేష్
జనాల్ని దారుణంగా జగన్ మోసగించాడనే దానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం ముసిలిపేడులో ఈ వైన్ షాపు నిదర్శనం. ఎన్నికల ముందు మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్ పదవిలోకి వచ్చిన వెంటనే తానే లిక్కర్ కింగ్ అవతారం ఎత్తారు. లిక్కర్ సిండికేట్ చేసి జగన్ డాన్ అయ్యాడు. దశలవారీగా ప్రమాదకరమైన మద్యం అమ్మకాలు పెంచేస్తున్నారు. పేరుకి ఇది ప్రభుత్వ మద్యం దుకాణం. ఇందులో అమ్మే సరుకు జగన్ ది. అమ్మేవాళ్లు వైసీపీ వాళ్లు. అమ్మిన సొమ్ము చేరేది తాడేపల్లి ప్యాలెస్‌కే. ఇదేనా జగన్ రెడ్డి చెప్పే విషపు నీయత? చేసిన మద్యనిషేధం? దేశంలోనే ధనికుడైన సీఎం జగన్, డబ్బు కోసం ప్రమాదకర మద్యంతో జనం ప్రాణాలు తీసేస్తున్నారు. మహిళల తాళిబొట్లు తెంపే మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు.