Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అన్నం తిని బతుకుతున్నాడా? కరెన్సీ తిని బతుకుతున్నాడా?

-రాహుల్ గాంధీ తరువాత అతి ఎక్కువ ట్రోలింగ్ కి గురి అయ్యింది నేనే
-ఆర్బీకే కేంద్రాలు అనేవి ఒక పనికిమాలిన పథకం
-వ్యవసాయ శాఖ మంత్రి ఓ కోర్టు దొంగ
-నేను లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదు
-పదో తరగతి ప్రశ్నా పత్రాలు దొంగలించలేదు
-శ్రీకాళహస్తి నియోజకవర్గం మడిబాక, రాజుల కండ్రిగ గ్రామాల రైతులతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

జగన్ ఒక హాలిడే సిఎం ఆయన వచ్చిన నాటి నుండి క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటాం.వైసీపీ ఎంపీలు ఇప్పటి వరకు వ్యవసాయరంగాన్ని ఉపాధిహామీతో అనుసంధానం, ప్రత్యేకహోదా, విభజన హామీలపై పార్లమెంట్ లో నోరు విప్పలేదు. రైతులు కోరిక మేరకు మేం అధికారంలోకి వచ్చాక కేంద్రాన్ని ఒప్పించి వ్యవసాయాన్ని నరేగాకు అనుసంధానం చేస్తాం. రైతులను ఆదుకునే కార్యాచరణను తెలుగుదేశం పార్టీ త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 1న అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచుతామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి జగన్ రెడ్డి మోసం చేశారు.
వైసిపి పాలనలో వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. జగన్ అధికారంలకి వచ్చాక 3.8 ఏళ్లలో ఒక్కో రైతుపై రూ.2.50లక్షల అప్పు భారం మోపారు.

వ్యవసాయ శాఖ మంత్రి ఓ కోర్టు దొంగ… రైతుల సంక్షేమాన్ని వ్యవసాయశాఖ మంత్రి పట్టించునే పరిస్థితి లేదు.రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడవ స్థానంలో ఉంది. ఇది జగన్ రెడ్డి చేతకానితనమే.చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర, సబ్సిడీలు, పంటనష్టం బీమా అందించాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటిని రద్దు చేశారు.ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ది ఉన్నా రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. మోటార్లకు మీటర్లు తెచ్చి జగన్ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు.రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలి.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయి పండించేవాళ్లకు గిట్టుబాటు ధర అందిస్తున్నాడు. తినే పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు.రైతు భరోసా కింద రూ.13,500ఇస్తానని చెప్పి రూ.7,500మాత్రమే ఇస్తున్నారు. రూ.6వేలు ఎగ్గొట్టి మోసం చేశారు. ఒక్కో రైతుకి జగన్ పెట్టిన టోపి 30 వేలు.

చంద్రబాబు పాలనలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశారు.రూ.50వేలు రుణాలున్న రైతులకు ఒకే విడతలో చంద్రబాబు రుణమాఫీ చేశారు. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి విడతల వారీగా రద్దు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడుల భారం పెరిగిపోయింది.జగన్ ప్రభుత్వం విత్తనాలిచ్చేసి చేతులు దులుపుకుంటోంది.నా పాదయాత్రలో ఒక్క రైతుభరోసా కేంద్రం పనిచేస్తున్నట్టు నా కంటికి కనిపించలేదు.. ఆర్బీకే కేంద్రాలు అనేవి ఒక పనికిమాలిన పథకం. భూసార పరీక్షా కేంద్రాలను పెడతానని జగన్ రెడ్డి మాట తప్పారు..రాష్ట్రంలో ఎక్కడా భూసార పరీక్షలు లేవు. జగన్ రెడ్డి అన్నం తిని బతుకుతున్నాడో, కరెన్సీ తిని బతుకుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు వచ్చాయి.

వ్యవసాయశాఖ మంత్రి క్రాప్ హాలిడేలు లేవని బుకాయిస్తూ కాలం గడుపుతున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తాం. పురుగుమందు, ఎరువులపై జగన్ సర్కార్ పెంచిన జీఎస్టీ భారంపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పోరాడతాం.పెట్రోల్, డీజిల్ పై వేసిన పన్నులు, పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరల వల్ల పెట్టుబడులు పెరిగాయి. కర్నాటకలో ధరలకు, మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కు రూ.11తేడా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి.భారతదేశంలో అత్యధిక అప్పుభారం ఎపి రైతులపైనే ఉంది.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరుజిల్లాలో 4 చక్కెర ఫ్యాక్టరీలు పనిచేసేవి. 2019 ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి 6 ఫ్యాక్టరీలను నడిపిస్తామని హామీ ఇచ్చి, ఒక్క ఫ్యాక్టరీని మాత్రమే తెరిపించాడు. ఇటువంటి వ్యక్తిని దద్దమ్మ అనాలా? చేతకాని వ్యక్తి అనాలా? రైతులకు గిట్టుబాటు ధర కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది.సమస్యలపై రైతులు జగన్ సర్కార్ తో పోరాడండి…మీకు మేం అండగా నిలుస్తాం.

రైతుల సమావేశంలో ఆసక్తికర సంఘటన…
ప్యాంటు వేసుకున్న ఒక రైతు సమస్యలు చెబుతున్న సందర్భంలో లోకేష్ వ్యాఖ్యలు. మిమ్మల్ని పేటిఎం గ్యాంగ్ ట్రోలింగ్ చేస్తుంది. రైతులు ప్యాంట్లు వేసుకోవడం వైసీపీ వారికి ఇష్టం ఉండదు, మహిళలు పసుపు చీర కట్టుకున్నా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పేటిఎం గ్యాంగ్ ట్రోల్ చేస్తుంది అన్న లోకేష్. పర్వాలేదు నేను వ్యవసాయం చేసే రైతుని ఏమి ట్రోల్ చేస్తారో చెయ్యనివ్వండి నేను రైతు సమస్యల గురించి మాట్లాడి తీరుతా అన్న రైతు. దేశంలో రాహుల్ గాంధీ తరువాత అతి ఎక్కువ ట్రోలింగ్ కి గురి అయ్యింది నేనే.
వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే నేను అంత బలపడుతున్నా. నేను లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు దొంగలించలేదు.16 నెలలు జైలుకి వెళ్ళలేదన్న నారా లోకేష్.
నేను ప్రజా సమస్యల పై పోరాడేందుకు ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తున్నా.

LEAVE A RESPONSE