( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ పండు ముసలి పేరు గద్దల మరియమ్మ. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం వరరం గ్రామంలో ఉంటుంది. 85 ఏళ్ల ఈ అవ్వకు గత 15 ఏళ్ల నుంచి నిరాటంకంగా పెన్షన్ వస్తోంది. అయితే మరికేం బాధ?
అని అడగవచ్చు. అవును. పాపం మరియమ్మవ్వకు పెద్ద బాధనే వచ్చిపడింది. అధికారులు ఉన్నట్టుండి ఆమె అభయహస్తం పెన్షన్ ఆపేశారు. ఠంచనుగా పడాల్సిన పెన్షన్ గంట వినిపించకపోవడంతో ఖంగారు పడిన మరియమ్మవ్వ.. తనకు పెన్షన్ ఎందుకివ్వలేదు బిడ్డా? అని అధికారులు అడిగితే.. ఒకే కార్డులో రెండు పెన్షన్లు ఉన్నందున పెన్షన్ తొలగించాలని సార్లు చల్లగా సెలవిచ్చారు. కొత్తగా కొడుక్కి కూడా పెన్షన్
వస్తున్నందున మీకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పారట. దానితో ఖంగుతిన్న అవ్వ.. కొత్తగా పెన్షన్ వ చ్చిన కొడుకు వల్ల నా పెన్షన్ ఎందుకు ఆపేశారన్న అవ్వ ప్రశ్నకు, అధికారుల వద్ద సమాధానం లేదు. దానితో పాపం మరియమ్మవ్వ ఈ వయసులో.. ఎక్కే గడప దిగే గడపతో నానా యాతన పడుతోంది. అధికారులూ… మీకు అర్ధమవుతోందా?