– ప్రజాస్వామ్యంలో గెలిచి, అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేస్తూ నియంత్రత్వ పాలన – బీసీలకు మంత్రిపదవులు ఇవ్వడం కాన్ స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ లో భాగమే.
• మంత్రివర్గంలోఉన్న బీసీలకు పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యంలేదు. కేవలం కేబినెట్లోనే వారుభాగస్వాములు
• మంత్రివర్గ నిర్ణయాలు, మంత్రులుగా ఎవరుండాలనే విషయాల్లో సజ్జలే అంతాతానై వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి బంధువన్న ఒకేఒక్కఅర్హత తప్ప, ప్రభుత్వంలో, కేబినెట్ నిర్ణయాల్లో జోక్యంచేసుకునే అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికిఉందా ?
• గత కేబినెట్ పప్పెట్ కేబినెట్ అయితే ఇప్పుడు కొలువుదీరిన మంత్రివర్గం ఛాయ్ బిస్కెట్ కేబినెట్
• బీసీలపై జగన్మోహన్ రెడ్డికి అంతప్రేమేఉంటే, ప్రభుత్వసలహాదారుల నియామకాల్లో, ఇతరత్రాముఖ్యమైన పదవుల్లో వారికి ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు?
• తనపై, తనప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని జగన్ కు అర్థమైంది అందుకే పాత మంత్రివర్గంలో ఉన్నవారే 11మంది తిరిగి చోటు దక్కించుకున్నారు
• నిధులు, విధులు, కూర్చోవడానికి కుర్చీలులేని బీసీకార్పొరేషన్లతో బడుగులకు ఏం ఒరుగుతుంది?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో కొత్తగాకొలువుదీరిన కేబినెట్ అంతా ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అని, గతంలోఉన్నదేమో పప్పెట్ కేబినెట్ అని, బీసీలకుమంత్రివర్గంలో అధికప్రాతినిధ్యం కల్పించామని ప్రచారంచేసుకుంటున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం, ఎంతమంది బీసీ మంత్రులకు స్వేచ్ఛగానిర్ణయాలు తీసుకునే అధికారంకల్పించిందో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. పేరుకే బీసీమంత్రులని పెత్తనమంతా ప్రభుత్వసలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిదని యనమల కుండబద్ధలు కొట్టారు.మంగళవారం ఆయన తననివాసంలో మీడియావారితో ఇష్టాగోష్టిగా మాట్లాడిన వివరాలు …!
ఎందరు బీసీలకు మంత్రిపదవులిచ్చామనేదానికంటే, బీసీమంత్రులకు కేబినెట్ లో ఎంతప్రాధాన్యత ఉందనేది చాలాముఖ్యమైన అంశం. ప్రాతినిధ్యంకంటేప్రాధాన్యత చాలాచాలా ముఖ్యమైనది. గతకేబినెట్ ముమ్మాటికీ పప్పెట్ కేబినెట్టే. ఎందుకంటే మంత్రులకుఎలాంటి అధికారాలులేవు, వారివారిశాఖలకు సంబంధించి స్వతంత్ర్యంగా వ్యవహరించే అవకాశం అసలేలేదు. మంత్రులుఏంచేయాలో, వారిశాఖలకు సంబంధించి ఎలాంటినిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించేది ముఖ్యమంత్రే. ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రమరీ ఎక్కువ.
కేబినెట్ నిర్ణయాలుచెప్పడం, మంత్రులకు వాయిస్ లేకుండాచేసి తానే మాట్లాడటంవంటివి…. సజ్జలే చేస్తున్నాడు. అసలు ఎవరీ సజ్జల? అతనికేం అధికారముం దని మంత్రుల నిర్ణయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. సజ్జలకు ఉన్నది కాన్ స్టిట్యూషనల్ పవరా? ఆయనెప్పుడూ ఎక్స్ ట్రా కాన్ స్టిట్యూషనల్ అథారిటీనే. కేవలం జగన్మోహన్ రెడ్డి బంధువు అన్నఒకే ఒక్కకారణంతో మంత్రివర్గంఏంచేయాలో, ఎలా ప్రవర్తించాలో నిర్ణయిస్తాడా?
కేబినెట్ లో బీసీలకు స్థానం కల్పించామంటున్న ముఖ్యమంత్రి, తనప్రభుత్వ సలహాదారుల్లో ఎందరు బీసీలుఉన్నారో చెప్పాలి. రాజ్యాంగంప్రకారం ఇవ్వాలి కాబట్టి కేబినెట్లో బీసీలకుఅవకాశమిచ్చారుతప్ప, బడుగుబలహీనవర్గాలపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉండికాదు. పొలిటికల్ ఆబ్లిగేషన్ ప్రకారం ముఖ్యమంత్రి తనకేబినెట్లో బీసీలకుప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం కాన్ స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ప్రకారం కేబినెట్లో బీసీలుఉండాలికాబట్టి వారికి మంత్రిపదవులుఇచ్చాడు. పేరుకేబీసీమంత్రులు, వారికి పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యంలేదు. పరిపాలనచేస్తున్నదంతా సలహాదారులే. కేబినెట్ లోకి తీసుకున్నవారంతా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకునేవారేతప్ప, ఎవరికీ స్వతంత్రంగా వ్యవహరించే ధైర్యం లేదు. మంత్రులకు వాయిస్ లేకపోవడానికి ముఖ్యమంత్రే కారణం. ముఖ్యమంత్రి డెమోక్రటిక్ డిక్టేటర్.
ప్రజాస్వామ్యంలో గెలిచాడు.. డెమోక్రటిక్ సిస్టమ్ తోనే నియంత్రత్వపాలనచేస్తున్నాడు. ముఖ్యమంత్రిని అందుకే తుగ్లక్, హిట్లర్ తో పోల్చా ము. అలాంటి నియంతలభావాలే ఈ ముఖ్యమంత్రిలో ఉన్నాయి. కేబినెట్ మార్చినంత మాత్రాన అధికారంలోకి వస్తామని అనుకోవడం అన్ వాంటెడ్ ఇమాజినేషన్. జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం అధికారంలోకి రావడమనేది ఇంపాజిబుల్. ఊహాగానాలతో ప్రజలను మాయలోముంచి, వారికిచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చని ఏకైకప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
టీడీపీప్రభుత్వంలో మంత్రులు ఇప్పుడున్నవారిలా ఏనాడుప్రవర్తించలేదు. నేనే ఆర్థికమంత్రి గా ఉన్నాను. నానిర్ణయాల్లో ఎప్పుడూ ముఖ్యమంత్రిజోక్యంచేసుకున్నది లేదు. మేం ఒకటి అనుకున్నాక, ఆయనతోసంప్రదించి నిర్ణయం తీసుకునేవాళ్లం. మానాయకుడికి ఒకప్రత్యేకత ఉంది. ఎలాంటి చిన్నవిషయమైనాసరే, పార్టీపరంగా అయినా, ప్రభుత్వపరంగా అయినా అందరితో సంప్రదించాకే అంతిమనిర్ణయానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డిలాగా ఎవరూ ప్రవర్తించరు.
అంతాతను అనుకున్నట్టే జరగాలి..తానుచెప్పిందే జరగాలనే విపరీతపోకడ జగన్మోహ న్ రెడ్డికేఉంది. ప్రజాస్వామ్యంలో చుట్టూఉన్నవారిని మరీముఖ్యంగా మంత్రులతో సంప్రదించ కపోవడం ముమ్మాటికీ డిక్టేటర్ షిప్. మొన్నటివరకు ఉన్న పప్పెట్ కేబినెట్ లో మీడియాతో సహా అందరూ పెత్తనమంతా జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఇప్పుడున్న కేబినెట్ లో కూడా అలానే వ్యవహరిస్తాడు.
పాత కేబినెట్లో ఉన్నవారందరినీ తీసేసి, అందరినీ కొత్తవారినే నియమి స్తానని గతంలో చెప్పాడు. అలా చెప్పిన వ్యక్తి పాతకేబినెట్లో ఇద్దరినో, ముగ్గురినో ఉంచుతాన న్నాడు. చివరకు ఏమైంది.. ఆ సంఖ్య అలాఅలాపెరిగి 11వరకుచేరింది. కేబినెట్ కూర్పులో కులసమీకరణలుఉంటాయని ముఖ్యమంత్రికి ముందుతెలియదా? ఈ విధానంచూస్తుంటే, తనసొంతపార్టీలో రివల్యూషన్ వస్తుందని ముఖ్యమంత్రి భయపడ్డాడని అర్థమవుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై వ్యతిరేకత ఉండటంతో, సీనియర్లనుతొలగిస్తే, వారంతా తిరగబడతారని ముఖ్యమంత్రికి అర్థమైంది. కొందరు తిరగబడటానికి ప్రయత్నిస్తారని గ్రహించే పాతవాళ్లలో చాలామందిని తిరిగి కేబినెట్లో కొనసాగించాడు.
రెండో విషయం ఏమిటం టే తిరగబడిన వారిలో కొందరు లోపాయికారీగా వ్యవహరిస్తే, కొందరు బహిరంగంగానే మాట్లా డారు. ప్రజావ్యతిరేకత ప్రభుత్వంపై ఎక్కువైనప్పుడు సాధారణంగా రాజకీయనేతలంతా తిరగ బడతారు. ప్రజల్లో తనపై, తనప్రభుత్వంపైఉన్న వ్యతిరేకతకు భయపడే ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేకతకు తలొంచాడు. ఆక్రమంలోనే సీనియర్లనిచెప్పుకుంటన్నవారిని తొలగించే ధైర్యం చేయలేకపోయాడు.విధులు, నిధులు, ఆఖరికి కూర్చోవడానికి కుర్చీలు లేని బీసీకార్పొరేషన్లలో బడుగు, బలహీ నవర్గాలకు ఏం ఒరుగుతుంది?
బీసీలకు ఇవ్వాల్సిన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఏటా రూ.12వేలకోట్లవరకు కేటాయించేవాళ్లం. మూడేళ్లలో రూ.36వేలకోట్లు కేటాయించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనిధులన్నీఏంచేసిందో తెలియదు? బీసీల సంక్షేమానికి కేటాయించేనిధులు ఎటుపోతున్నాయో, బీసీల కాలనీల్లోఎలాంటి అభివృద్ధిపనులుజరుగు తున్నాయో బీసీసంక్షేమమంత్రికే తెలియదు. బీసీలకు రాజకీయంగా స్థానికసంస్థల్లో దక్కాల్సిన 16,800లకు పైగా పదవులు, రిజర్వేషన్లలో కోతపెట్టి, వారికికాకుండాచేశారు. రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను అన్నివిధాలా అణగదొక్కుతూ, వారిని తామేఉద్దరిస్తు న్నామని, ఆ పదవులు… ఈ పదవులిచ్చామని చెప్పుకుంటున్నారు.
ఈ మూడేళ్లలో రాష్ట్రంలో పేదరికంబాగాపెరిగింది. అదికూడా ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీవర్గాల్లోనే పెరిగింది. ఆయావర్గాల్లో పేదరికం పెరిగినప్పుడు, వారు ఆర్థికంగా బలోపేతంకావడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఈ మూడేళ్లలో ఇదిగోఇలాచేశామని చెప్పగలరా? బీసీలకు మంత్రిపదవులు ఇచ్చినా ఏపీ మొత్తం వన్ మ్యాన్ షో కిందే నడుస్తోంది. రాజకీయాల్లో పవర్ , మనీ చాలాముఖ్యమైనవి. ఆ రెండూ తనచేతిలోనే పెట్టుకున్న ముఖ్యమంత్రి, బీసీలకుఏదో పంచిపెట్టినట్లు ప్రజలనుతప్పదోవ పట్టిస్తున్నాడు. వాస్తవంగా పరిపాలనలో బీసీలకు సరైనప్రాతినిధ్యం, ప్రాధాన్యతలేవని స్పష్టంగా కనిపిస్తోంది.