Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి కరెంట్ ఛార్జీల మోత మోగిస్తున్న జగన్మోహన్ రెడ్డి

– ఏఐసీసీ సభ్యులు,విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు

ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ కు ఓటు వేసిన ఆనందం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడానికి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం. కార్పొరేట్ సంస్థలకి మేలు చేయడం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి.రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ట్రూ అప్ ఛార్జీలు, యూనిట్ ఛార్జీల పెంపుతో విద్యుత్ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజలు.

విద్యుత్ బిల్లులతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అప్పటికప్పుడు ఎక్కువ ధరలలో ఎక్కువ మొత్తంలో కరెంటును కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ భారం సామాన్య వినియోగదారుడి మీద వేయడం సమంజసం కాదు. దీనిని తప్పనిసరిగా పునరాలోచించాలి. ఒక్కసారిగా ట్రూ అప్ చార్జెస్ చెల్లించమని అంటే వినియోగదారుడు ఏమైపోవాలి. కానీ నిజంగా వినియోగదారుడు ఉపయోగించని కరెంటుకు చార్జెస్ వేసి ఆ భారాన్ని ఎలక్ట్రిసిటీకి చెల్లించడం పూర్తిగా ఖండిస్తున్నాము.

రాష్ట్రంలో వాతావరణం చల్లబడిన తర్వాతే పాఠశాలలు పునః ప్రారంభం చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు అధికంగా ఉండి ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం ఎండలు అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పులు కుంపటిగా మారింది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధులు వరకు ఎండ తీవ్రతకు ఇబ్బందులకు గురి అవుతున్నారు.

ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు 12వ తేదీ నుండి రీ ఓపెన్ చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రతను గమనించడం లేదు అని అనిపిస్తున్నది. ఈ సమయంలో పిల్లలు స్కూల్కు వెళ్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వర్షాలు కురిసి చల్లటి వాతావరణం ఏర్పడినప్పుడు పాఠశాలలు పునః ప్రారంభం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనది.

LEAVE A RESPONSE