Suryaa.co.in

Andhra Pradesh

తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి : కాకినాడ ఎంపీ గీతా విశ్వనాధ్

కాకినాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల అభ్యున్నతి కోరి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను ప్రక్క తోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాకినాడ ఎంపీ గీతా విశ్వనాధ్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ సత్రం దగ్గర వైసిపి నాయకులు రెండో రోజు చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్.పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో విజయం సాధించారని, ప్రజలకు ఇచ్చిన హామీలను పదవి చేపట్టి నుండి అమలు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రజల అభ్యున్నతి కోరి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై పార్టీపై తెలుగుదేశం నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశార.మీకు సత్తా ఉంటే మీ పార్టీ విధానాలు ఏంటో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అంతేగాని అనవసరంగా ఎవరైనా ప్రభుత్వం పైన, పార్టీ పైన బురదజల్లే కార్యక్రమం చేపట్టినట్లైతే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీ హెచ్చరించారు. ఈ దీక్షలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE