జగన్మోహన్ రెడ్డి రైతులను దొంగలుగా చూస్తున్నాడు

– నీరు-చెట్టు కార్యక్రమం కింద పనులుచేసిన సాగునీటి సంఘాలవారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నాడు.
– జగన్ ప్రభుత్వం, ఈ రెండున్నరేళ్లలో ఎక్కడా ఒకఎకరాకు కూడా కొత్తగా నీరిచ్చిందిలేదు.
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్
రైతులను దొంగలుగా చూసిన ఏకైకప్రభుత్వం దేశంలో ఏదైనాఉందంటే, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, దేశఆదాయంలో అన్నదాతలు ప్రముఖపాత్ర పోషిస్తున్నతరుణంలో, సదరు రైతాంగానికి వైసీపీ ప్రభు త్వం వెన్నెముక లేకుండా చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాస నసభ్యులు కూనరవికుమార్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీనేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రైతాంగానికి అతిముఖ్యమైన నీటివనరులను పెంపొందించేదిశగా చంద్ర బాబునాయుడు గారు గతంలో నీరు-చెట్టు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగస్వాములై, నీటివనరులను పెం చుకోవడానికి టీడీపీప్రభుత్వంలో శ్రమించిన రైతుసోదరులను జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం నేడు దొంగలుగా చిత్రకరించడం దుర్మార్గం. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని, తండ్రిచాటుబిడ్డగా రాష్ట్రఆదాయాన్నిఅప్ప నంగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి, నేడు అధికారం దక్కింది కదా అని, కోట్లాదిరూపాయలు వెచ్చించి, రాష్ట్రజీడీపీని, ఆదాయాన్ని పెంచడానికి శ్రమించిన అన్నదాతలను దోషులుగా చూస్తన్నాడు.
జగన్మోహన్ రెడ్డి తన ఏలుబడిలో రైతులకు, వ్యవసాయానికి సంబంధించి సాధించిన ప్రగ తి రైతుఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రాన్ని మూడోస్థానంలో నిలపడమే. ఇదేవిధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే, రాష్ట్రంత్వరలోనే రైతు ఆత్మహత్యల్లో తొలిస్థానంలో నిలవడం ఖాయం. రాష్ట్రంలో 15లక్షల మంది కౌలురైతులుంటే, కేవలం 45వేలమందికే జగన్ ప్రభుత్వం, రైతు భరోసా అమలుచేస్తోంది. అధికారంలోకి రాకముందు రైతుసంక్షేమంపై జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటాయి, ఇప్పుడేమో చేతలుకూడా దాటడంలేదు. టీడీపీప్రభుత్వంలో వాణిజ్యపంటలసాగుకి పెద్దపీట వేసి, నీరు-చెట్టుపథకంకింది నీటిసంరక్షణ చర్యలను ఇబ్బడిముబ్బడిగా చేప ట్టడం జరిగింది. నీటిసంఘాలపై జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనందు నే, వాటికి కూడా ముఖ్యమంత్రి పార్టీలు ఆపాదిస్తున్నాడు.
నీరు-చెట్టు కింద గతంలో పనులుచేసిన నీటిసంఘాలవారికి రెండున్నరేళ్లనుంచి రూ.1700కోట్లబిల్లులుచెల్లించలేదని స్వయంగా ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వారే చెప్పారు. గతంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఎంతెంతశాతం నీటినిల్వలుఉన్నాయి, వాటిపెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సర్వేలు చేయిస్తే, జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులు కావడానికి ముందే గనులు ఎక్కడున్నాయి..వాటినెలా దోపిడీచేయాలని సర్వేలు చేయించారు. జగ న్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రంలో ఎక్కడా నీటినిల్వలపెంపు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 2015లో చంద్రబాబునాయుడి గారిహయాంలో నీరుప్రగతిద్వారా నీటి విలువను గ్రామస్థాయిప్రజలకుతెలియచేసి, నీటినిల్వలపై సర్వే నిర్వహించారు.
నదులు, చెరువులు, భూగర్భంలో 2,225 టీఎంసీల నీ టినిల్వలు అందుబాటులోఉన్నాయని గుర్తించారు. ప్రజలకు 2,750 టీఎంసీలు అవసరమవుతాయని, ఇంకా 525 టీఎంసీల నీటికొరత, రాష్ట్ర అవసరాలకు ఉందని నిర్ధారించడం జరిగింది. దాన్ని అధిగమించ డానికి నీరు-చెట్టు పథకంలో భాగంగా, రూ.4851కోట్లు వెచ్చించిమరీ, టీడీపీప్రభుత్వం చెరువులపూడికతీత, పంటకుంటలనిర్మాణం, చెక్ డ్యామ్ ల నిర్మాణం వంటివాటిని చేపట్టింది. ఆనాడు టీడీపీప్రభుత్వం అలా ముందుచూపుతో వ్యవహరించబట్టే, రాష్ట్రవ్యాప్తంగా 90టీఎంసీల భూగర్భజలాలు అదనంగా స్థిరీకరించబడ్డాయి. దానిఫలితంగానే, అనేకప్రాంతాల్లో కేవలం 8మీటర్లలోతులోనే చాలాగ్రామాల్లో రైతులకు నీరు అందుబాటులోకివచ్చింది.
నీరు-చెట్టు కార్యక్రమం కింద చంద్రబాబునాయుడి హయాంలో 6.795 లక్షలఎకరాలు (దాదాపు 7లక్షలఎకరాలు) ఆయకట్టు కొత్తగా స్థిరీకరించడం జరిగింది. దానివల్ల రైతులకు విపరీతమైన ప్రయోజనాలు కలగడమేగాక, టీడీపీప్రభుత్వాని కి, 9 మెరిట్ స్కాచ్ అవార్డులు కూడా రావడంజరిగింది. నీటినిల్వలు పెంచడానికి టీడీపీప్రభుత్వం ఆ విధంగా కృషిచేస్తే, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదలరంగాన్ని నిర్వీర్యంచేయడంతోపాటు, రాష్ట్రంలో నీరు–చెట్టు పథకాన్నే నామరూపాలులేకుండాచేసింది. వర్షాలు, వరదలద్వారా ప్రాజెక్టుల్లోకి వచ్చిన కొన్నివందలటీఎంసీల నీటిని సముద్రంపాలుచేసింది, ఈ అచేతన, అసమర్థ ముఖ్యమంత్రి కాడా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాడకం పేరుతో ప్రాజెక్టుల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకుంటుంటే, చేతగాని జగన్ ప్రభుత్వం చేష్టలుడిగిచూస్తోంది తప్ప, ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
దాదాపు రూ.3లక్షలకోట్లవరకు అప్పులుచేసిన జగన్ ప్రభుత్వం, కనీ సంలోకనీసంగా రాష్ట్రంలో ఎక్కడా 3ఎకరాలనుకూడా కొత్తగాసాగులోకి తేలేకపోయింది. ప్రభుత్వం తెస్తున్న అప్పులు, ప్రజలనుంచి ముక్కు పిండివసూలుచేస్తున్న డబ్బులన్నీ ఎక్కడికిపోతున్నాయోతెలియని ప రిస్థితి. టీడీపీప్రభుత్వంలో నీరు-చెట్టు కింద 98కోట్ల ఘనపుమీటర్ల మట్టి ని పూడికతీయడంతోపాటు, దేశంలో ఎక్కడాలేని విధంగా 4,735చెరు వులను బాగుచేయడం జరిగింది. 93,975 చెక్ డ్యామ్ లనిర్మాణంతో పాటు, 7లక్షల పంటకుంటలతవ్వకం చేపట్టడంద్వారా 3 నుంచి 5 మీటర్లకు భూగర్భజలాలుపెంచడం జరిగింది.
కానీ నేడు జగన్మోహన్ రెడ్డి జమానాలో భూగర్భజలాలు పెంచేకార్యక్ర మం రాష్ట్రంలో ఒక్కటైనా జరుగిందా అని ప్రశ్నిస్తున్నాం. నీటినిల్వల్లో, వ్యవసాయంలో దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో చంద్రబాబునాయు డు నిలిపితే, నేడుజగన్మోహన్ రెడ్డి రైతుఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుంచాడు. చివరకు రాష్ట్రంలో గంజాయిసాగుని ఇబ్బడిముబ్బడిగాపెంచి , దేశంలోనే గంజాయిసాగులో రాష్ట్రం ముందుండేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది.
నీరు-చెట్టుకింద టీడీపీప్రభుత్వంలో పనులుచేసిన నీటిసంఘాల సభ్యు లంతా నేడు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో హలోలక్షణా అని రోడ్లపాలై విలపిస్తున్నారు. పనులుచేసిన వారు బిల్లులచెల్లింపులకోసం న్యాయస్థానాలను ఆశ్రయించారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిపై కక్షకట్టింది. బిల్లులు చెల్లించాలంటూ కోర్టునుఆశ్రయించిన 192 మందిపై పగబట్టి, వారుచేయించినపనులను పరిశీలించాలంటూ, అధికారులను పురమాయించడంద్వారా రైతులను బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధమైంది. 28-10-2021న ప్రభుత్వంఇచ్చిన మెమోలో నీరుచెట్టుకింద జరిగిన పనులపరిశీలన చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అమ రావతి రైతుల త్యాగాలఫలితమే నేడు జగన్మోహన్ రెడ్డికి దక్కిన కుర్చీ అనే వాస్తవాన్ని ఆయన విస్మరిస్తున్నాడు. 03-03-2019 నాటికి, నీరుచెట్టు కింది రైతుసంఘాలకు చెల్లించాల్సిన బిల్లులు రూ.1277 కోట్ల వరకు సీఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లోఉంటే, అధికారంలోకి వచ్చిన వెంట నే వాటిని సీఎఫ్ఎంఎస్ నుంచి తొలగించాలని ఆదేశించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తనమూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు .
నీరుచెట్టుపథకం కింద నీటిసంఘాలు, సాగునీటి సరఫరా సంఘాల వారు రూ.10లక్షల్లోపు విలువైన పనులనుమాత్రమే చేపట్టారు. రూ.10లక్షలు ఆపైన విలువచేసే పనులన్నింటినీ టెండర్ల విధానంలోనే ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానం లో కట్టబెట్టడం జరిగింది. అలాజరిగిన పనుల్లోకూడా అవకతవకలు జరిగాయని, టీడీపీనేతలు నిధులు స్వాహా చేశారని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే వాటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాడు. రాష్ట్రవ్యాప్తంగా, టీడీపీహాయాంలో దాదాపు 93,975 చెక్ డ్యామ్ లనిర్మాణంతో పాటు, 9లక్షల పంటకుం టల తవ్వకం చేపడితే, కేవలం 775 పనుల్లో మాత్రమే అవకతవకలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి నియమించిన విజిలెన్స్ బృందంతేల్చింది. విజిలెన్స్ నివేదికతో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయాయి.
పాదయాత్ర ఆరంభించినప్పటినుంచీ ముగించేవరకు చెప్పిన అబద్ధాలు చెబుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించి, తనపబ్బం గడుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు.
నీరు-చెట్టుకింద పనులుచేసిన సాగునీటిసమాఖ్యలవారు బిల్లుల చెల్లింపుకోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, వారిని వేధించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?
డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ కింద కొత్తగా నిర్మించినా, మరమ్మతులు చేపట్టినా ఆయా పనులయొక్కకాలపరిమితి కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ విషయం తెలిసీకూడా జగన్ ప్రభుత్వం, ఎప్పుడో నాలుగే ళ్లక్రితం జరిగిన నీరు-చెట్టు పనులను తనిఖీచేయాలని అధికారులను ఆదేశించడం దుర్మార్గం కాదా?
వర్షాలు, వరదలకారణంగా చెరువులు పూడిపోయి, గట్లు తెగిపోతే, ఇప్పుడువాటిని తనిఖీలుచేయడం కుదర దనిచెప్పిన అధికారులను, మంత్రులతో ఈ ముఖ్యమంత్రి బూతులు తిట్టించాడు. ఇరిగేషన్ శాఖఅధికారులతో నిర్వహించాల్సిన తనిఖీలకు ఆర్ డబ్ల్యూఎస్, హౌసింగ్ అధికారులను పంపాడు. నోటికొచ్చినట్టుగా నిబంధనలు రూపొందించి, నీరు-చెట్టుకింద పనులుచేసిన వారిని దొంగ లుగా చిత్రీకరించడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నించడం, వారికి చెల్లించాల్సిన రూ.1707కోట్లకు ఎగనామం పెట్టాలనిచూస్తున్నాడు.
విజి లెన్స్, ఇతర శాఖలవారు నీరు-చెట్టు పనుల తనిఖీలపేరుతో ముఖ్య మంత్రి ఆడమన్నట్టల్లా ఆడితే, అందుకు తగిన మూల్యంచెల్లించుకుంటా రు. చట్టవిరుద్ధంగా, నిబంధనలకువిరుద్ధంగా నివేదికలు తయారుచేసే అధికారులతీరుపై, టీడీపీప్రభుత్వం రాగానే విచారణకు ఆదేశించి, చ్యలు తీసుకొనే తీరుతామని హెచ్చరిస్తున్నాం. జిల్లాకలెక్టర్లు కూడా వారికి లేని అధికారాలను ఉపయోగించి, అత్యుత్సాహంచూపితే, అందుకు తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరిస్తున్నాం. ఇరిగేషన్ శాఖసహా, ఇతరశాఖల అధికారులంతా ప్రజలకు సేవకులేనని గుర్తుంచుకుంటే మంచిది. ఏ అధికారి అయినాసరే తప్పుడు నివేదికలు ఇచ్చి, రైతుల ఉసురుతీసే చర్యల్లో పాలుపంచుకోవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం.
ఇరిగేషన్ శాఖకు సంబంధించి జరిగిన పనులకు ఢిఫెక్టివ్ లయబులిటీ కింద రెండేళ్ల కాలపరిమితి మాత్రమే ఉండగా, నాలుగేళ్లతర్వాత పనులతనిఖీ పేరుతో రైతులను వేధింపులకు గురిచేయడం ఎంతవరకు న్యాయమో తనిఖీలుచేస్తున అధికారులు ఆలోచిస్తే మంచిది. అధికారులు విజ్ఞతతో ఆలోచించి, న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలని సూచిస్తున్నాం. ప్రజల దీవెనలతో రేపు ప్రజలందరి ప్రభుత్వమైన తెలుగుదేశంప్రభుత్వం అధికారంలోకి వస్తే, తప్పుచేసిన అధికారులకుశిక్షలు పడటంఖాయం. అధికారంలో ఉన్నవారు చెప్పారుకదా అని ఆఖరికి కొందరు అధికారులు న్యాయస్థానాలకుకూడా తప్పుడు నివేదికలు ఇస్తూ, వారు చదివిన చదువులకుకూడా అన్యాయం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఉన్నది ప్రజలని, నీరు-చెట్టు కింద పనులుచేసినవారు రైతులనే వాస్తవాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. ప్రజలసొమ్ముని జీతంగా తీసుకుంటున్న ప్రభుత్వసలహాదారులకు చీమునెత్తురుఉంటే, వారు రైతులకున్యాయంచేసేలా ముఖ్యమంత్రికి సలహాలుఇవ్వాలని కోరుతు న్నాం. రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించేచర్యలకు ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్వస్తిపలక్కపోతే, భవిష్యత్ లో ఆయన అన్నదాతల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఒక పక్క అమరావతి రైతులు కన్నీటితో, మరోపక్క పంటలు పండక రోదిస్తున్న రైతులకన్నీటితో రాష్ట్రం ఎటుపోతుందో, చివరకు తనకు ఏ గతి పడుతుందో ముఖ్యమంత్రి ఆలోచించుకుంటే మంచిది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆదేశాలమేరకు మంగళగిరిలోనిపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగంద్వారా, గతంలో పనులుచేసిన రైతులకు సంబంధిం చిన పూర్తివివరాలను త్వరితగతిన సేకరించి, వారికి న్యాయసహాయం అందించి, ప్రతిరైతు, ప్రతిసభ్యుడికి ఆఖరిరూపాయి అందేవరకు టీడీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాను.
ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు (సాగునీటివినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు) : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్యచట్టం 1997 ప్రకారం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఒకచట్టంచేయడం జరిగింది. దేశంలో తొలిసారిగా, రాజకీయాలకు అతీతంగాఏర్పడిన సదరుచట్టం ప్రకారం రైతుసంఘాల వ్యవస్థ ఆవిర్భవించింది. 2017లో టీడీపీప్రభుత్వ మిచ్చిన 187 జీవోప్రకారం పారదర్శకంగా, అన్నిఅనుమతులతో రాష్ట్ర వ్యాప్తంగా 28,857 పనులను నీరు-చెట్టుకింద సాగునీటిసంఘాల అధ్యక్షులు, రైతులు చేపట్టడంజరిగింది. వాటిలో చట్టబద్ధంగా సీఎఫ్ఎంఎస్ టోకెన్ పడి రూ.1277కోట్ల విలువైన పనులు పెండింగ్ లో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులపై కక్షకట్టి, కోర్టులకు వెళ్లా రని ప్రతీకారంతో మెమోలపేరుతో బిల్లులు చెల్లించకుండా కాలయాపన చే యడంవల్ల, సన్నచిన్నకారు రైతులు అప్పులపాలై, వడ్డీలుకట్టలేక తనువులుచాలించే దుస్థితికివచ్చారు. గతప్రభుత్వహయాంలో నీటిపా రుదలరంగానికి అత్యధికప్రాధాన్యత ఇవ్వడంజరిగింది. రూ.65వేలకోట్లు ఖర్చుపెట్టి, 23ప్రాజెక్టులను పూర్తిచేయడంద్వారా 30లక్షలఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించడంజరిగింది. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండేళ్లకాలంలో రూ.7వేలకోట్లు సాగునీటిరంగానికి ఖర్చుపెట్టినా, ఎక్కడా ఒక్కఎకరాకు కూడా కొత్తగా నీరివ్వలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరంప్రాజెక్ట్ నిర్మాణానికి టీడీపీప్రభు త్వం రూ.15వేలకోట్లు ఖర్చుపెట్టి, 72శాతంపనులు పూర్తిచేస్తే, వైసీపీ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.600కోట్లుఖర్చుపెట్టి, 0.89శాతం పనులు మాత్రమే చేసింది. అది చాలదన్నట్లు పట్టిసీమ ఉండగానే, పోలవరం కుడికాలువపై కొత్తగా లిఫ్ట్ ఏర్పాటుచేయడానికి రూ.1200 కోట్లను మంజూరుచేసి, బహుళార్థసాథక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా మార్చడానికి సిద్ధమైంది.విలేకరులు సమావేశంలో సాగునీటిసంఘాల సమాఖ్య కార్యవర్గ సభ్యులు చెన్నుపాటి శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a Reply