– కేసీఆర్ కుశాలువాలుకప్పి, స్నేహసంబంధాలు నెరపడంకాదు జగన్మోహన్ రెడ్డిచేయాల్సింది
– తనను ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రానికి ఏంచేయాలని ఆలోచించాలి
– ఎవరి కళ్లల్లోనో ఆనందం చూడటంకోసం వల్లభనేని వంశీ ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం అతనికే నష్టం
– మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ
రాష్ట్ర విభజనతర్వాత ఏపీకి 2014 – 2019మధ్యన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండాచేయడమే కాకుండా, పరిశ్రమలకు, సాధారణ వినియోగానికి సకాలంలో విద్యుత్ అందించారని, విద్యుత్ వ్యవస్థ మెరుగుపడటంతో పారిశ్రామికవేత్తలుకూడా రాష్ట్రానికి క్యూకట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
చంద్రబాబునాయుడు విద్యుదుత్పత్తితోపాటు పోలవరం నిర్మాణంపై కూడా అమితమైనశ్రద్ధ చూపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా క రాష్ట్రానికి విద్యుత్ లోటు ఏర్పడింది. దాంతో చాలామంది పారిశ్రామిక వేత్తలు తెలంగాణ బాటపట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అక్కడి మంత్రి హరీశ్ రావుల వ్యాఖ్యలే ఏపీ దుస్థితికి నిదర్శనం. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ చీకట్లో మగ్గుతుంటే, తెలంగాణలో విద్యుత్ పుష్కలంగా ఉందని చెబుతున్నాడు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏమో ఆంధ్రాలోని పరిస్థితులు తెలంగాణకు వరంగా మారాయంటున్నారు. పొరుగురాష్ట్ర పాలకుల వ్యాఖ్యలపై ఇక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుపడాలి.
రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రావడంలేదు. బడ్జెట్ ఆదాయం రూ.లక్షా78వేలకోట్లు ఏపీకి ఉంటే, రూ.2లక్షల35వేలకోట్లు తెలంగాణకు ఉంది. ఏ వ్యక్తి అయినా ముందు అధికారంలోకి రాగానే రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలి. ఏ రంగంపై దృష్టిపెడితే, రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తుం దనే దిశగా ఆలోచించాలి. కానీ ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడు. రాష్ట్రంపై రూ.5లక్షలకోట్లవరకు అప్పుల భారముంది. అంత అప్పులచేసి ఏం చేశారంటే సమాధానం లేదు. పోల వరం పూర్తికాలేదు. మూడురాజధానులన్నారు…అవి ఏమయ్యాయో తెలియదు.
చివరకు చంద్రబాబునాయుడు నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో ఉండే ఈ ముఖ్యమంత్రి పాలనచేస్తున్నాడు. పొరుగు ముఖ్యమంత్రితో ఈ ముఖ్యమంత్రి సాగిస్తున్న స్నేహ సంబంధాలు తెలం గాణకు అనకూలంగా మారితే, మనకు శాపాలయ్యాయి. కేసీఆర్ కు శాలువాలు కప్పడంపై చూపుతున్న శ్రద్ధను ఈ ముఖ్యమంత్రి, ఏపీకి రావాల్సిన నీటికేటాయింపులు, ఇతరబకాయిల వసూళ్లపై చూపలేకపో వడంతో రాష్ట్రం అన్నివిధాలా అథమస్థాయికిచేరింది. జగన్మోహన్ రెడ్డికి పాలనపై పట్టులేదని, ఏరంగంపైనా సరైన అవగాహన లేదని అతని విధానాలే చెబుతున్నాయి.
అప్పులుచేస్తున్నారు….ఎందుకుచేస్తున్నా రంటే సమాధానంలేదు. టీడీపీప్రభుత్వం పోలవరాన్ని దాదాపు 80 శా తం వరకు పూర్తిచేస్తే, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకివచ్చి రెండేళ్లయి నా, అరశాతంపనులుకూడా జరగలేదు. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి రాష్ట్రానికి రావడానికి ఈ ముఖ్యమంత్రి కారణం కాదా?
వీటిన్నింటిపై ప్రశ్నిస్తే, ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంఅనేది లేకుండా చేయాలన్నది ఈ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన. మొన్నటికి మొన్న టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడిచేశారు. చరిత్రలో ఎన్నడూ అటువంటి దుర్గార్గం జరగలేదు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసి, తిరిగి టీడీపీపైనే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, శాసనసభ్యుల విమర్శ లు, వారిమాటలు తీవ్ర జుగుప్సాకరంగా ఉంటున్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక పరిణితితో మాట్లాడాలనే ఆలోచనలేకుండా, నీచంగా మాట్లాడితే ముఖ్యమంత్రి మెచ్చుకుంటాడని బూతులు మాట్లాడుతు న్నారు. చివరకు ఉచ్ఛనీచాలు లేకుండా అపనిందలు వేస్తున్నారు.
మనభాషపై ప్రజలు ఏమనుకుంటారనే ఇంగితం వైసీపీనేతల్లో ఇసుమం తైనా కనిపించడంలేదు. మేంఅలానే మాట్లాడితే, మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెంటనే చర్యలు తీసుకునేవారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీప్రభుత్వంలోచేసిన అభివృద్ధిపనులకు గుర్తుగా గతంలో వల్లభనేని వంశీ భారీస్థాయిలో సమావేశం కూడాఏర్పాటుచేశా డు. చంద్రబాబు సహాయసహాకారాలతో తననియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని కూడా చెప్పాడు. అలాంటి వంశీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాక, ఈ 29నెలల కాలంలో తననియోజకవర్గానికి ఏంచేశాడు? ఎవరి కళ్లల్లోనో ఆనందంచూడటం కోసం, దిగజారి మాట్లాడితే సభ్యసమాజం హర్షించదని వంశీలాంటివారు గుర్తుంచుకుంటే మంచిది.
ముఖ్యమంత్రి కూడా తనస్థాయికి తగినట్లు ప్రవర్తిస్తే మంచిది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ పౌరులుగా తామందరం సిగ్గుపడుతున్నాం. తెలంగాణ ఎలా సస్టెయిన బుల్ అవుతుందా అని విభజనతర్వాత తామందరం అనుకున్నాము. ఈనాడు తెలంగాణముందుకు పోతుంటే, ఏపీ వెనకబడటం బాధాకరం. ఆ రాష్ట్రం బాగుపడకూడదన్నది తమఉద్దేశం కాదు.. మారాష్ట్రం కూడా అన్నింటా ముందుండాలన్నదే తమ అభిమతం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తన ఆలోచనాధోరణి మార్చుకొని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేస్తున్నాం.