Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి అసమర్థత, అవినీతే రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణం

– మూడేళ్లలో రూ.60వేలకోట్ల భారాన్ని ప్రజలపై, విద్యుత్ సంస్థలపై మోపిన ముఖ్యమంత్రి, ఇప్పుడే రోజుకి 6 నుంచి 8గంటలు కోతలుపెడుతున్నాడు
• గ్రామీణప్రాంతాల్లో సాయంత్రం 6గంలకు కోతలుపెడుతున్న ప్రభుత్వం, రోజుకి 6 నుంచి 8 గంటలు విద్యుత్ లేకుండా చేస్తోంది
• ఇప్పుడే ఇలాఉంటే, ఇకవేసవిలో తమపరిస్థితేమిటని ప్రజలు వాపోతున్నారు
• చంద్రబాబునాయుడి హాయాంలో లేని విద్యుత్ కోతలు ఇప్పుడే ఎందుకుపెడుతున్నారన్న ప్రజల ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడు?
– మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు

రాష్ట్రప్రభుత్వం కరెంట్ కోతలతోపాటు, విద్యుత్ వినియోగదారుల కు వాతలుకూడా బాగానే పెడుతోందని, డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈమూడేళ్లలో రూ.11వేలకోట్ల ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళావెంకట్రావు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

విద్యుత్ ఉత్పత్తి, వినియోగం సక్రమంగా జరగడానికి జగన్ ప్రభుత్వం విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిందని ప్రజలం తా భావించారు. కానీ అప్పులకోసమని తరువాత అర్థమైంది. రూ.26,261కోట్లను ఫైనాన్స్ కార్పొరేషన్ ను సాకుగాచూపి జగన్ రెడ్డిప్రభుత్వం అప్పుతెచ్చింది. ఆ భారం కూడా ప్రజలపైనే పడు తుంది అనడంలో ఎలాంటిసందేహంలేదు. విద్యుత్ ఛార్జీలు అంటే వాతలరూపంలో రూ.11వేలకోట్లు ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ రూపంలో తెచ్చిన అప్పు రూ.26వేలకోట్ల భారాన్ని ప్రజలపైనే వేశాడు. ఇంతభారం ప్రజలపై వేస్తూకూడా విద్యుత్ కోతలు ఎందుకు అమలుచేస్తున్నారో ముఖ్యమంత్రి ప్రజ లకు సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

దక్షత లేని ఇంటికి పదిలక్షలువచ్చినా బాగుపడదన్న తీరుగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం వస్తున్నా, అదిచాలక అప్పులతో ప్రజలను పీడిస్తున్నారు. విద్యుత్ కోతలను సరిగ్గా సాయంత్రం 6 గంటలకు అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 100కు 66శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. గ్రామాల్లో ఉండేవారంతా ఎక్కడ ఏఏపనులకు వెళ్లినా, సాయంత్రం 6గంటలకు వచ్చి, వారి పనులు ప్రారంభిస్తారు. ఆసమయంలోనే ఈ ప్రభుత్వం విద్యుత్ కోతలు అమలుచేస్తోంది.గ్రామీణవాసులు 3, 4 గంటలు విద్యుత్ వినియోగించుకోవాల్సిన సమయంలోనే ప్రభుత్వం కోతలు పెడు తోంది. ఇంకా వేసవిరాకముందే జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ప్రజలంతా రాత్రిదోమలు, నల్లులతో కుట్టించుకునే పరిస్థితి. వేసవి వస్తే విద్యుత్ కోతలుఇంకెలా ఉంటాయోనని జనమంతా ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు.

మరోపక్క పంచాయతీల అభివృద్ధి, గ్రామాల్లో పారిశుధ్యనిర్వహణ కు రూపాయికూడా నిధులులేకుండా విద్యుత్ బకాయిల పేరుతో ఈ ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని లాగేసుకుంది.రూ.23,920 కోట్లను జగన్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్ లతో పనిలేకుండా విద్యుత్ బకాయిలపేరుతో లాగేసుకొంది. పంచాయతీ ఎన్నికలు అయ్యాక ఈ ప్రభుత్వం ఆ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం లాక్కున్న రూ.23వేలకోట్ల నిధులు కేంద్రప్రభుత్వం ఇచ్చినసొమ్ము. ప్రజలపై విద్యుత్ ఛార్జీలరూపంలో రూ.11వేలకోట్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు రూ. 26,261కోట్లు, పంచాయతీలనుంచి లాక్కున్న రూ.23వేల కోట్లుకలిపి విద్యుత్ బకాయిల రూపంలో దాదాపు రూ.60వేలకోట్ల వకకు జగన్ రెడ్డి ప్రభుత్వం దోచేసింది. ఆసొమ్మంతా ఏం చేశారంటే సమాధానంలేదు.

విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అయినా చెల్లించారా అంటే అదీలేదు.ఇలాంటిప్రభుత్వాన్ని దేశచరిత్రలో ఎప్పుడూచూడలేదు…ఇకపై చూడబోము కూడా. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణం ఏపీ ప్రభుత్వ విధానాలేనని చెప్పడంలో ఎలాంటిసందేహంలేదు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను జగన్ రెడ్డిప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. జెన్ కో విద్యుత్ ఉత్పత్తికేంద్రాలు, థర్మల్ పవర్ స్టేషన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, నీటిప్రాజెక్టులద్వారా వచ్చే విద్యుత్ పై ఏనాడూ ఈ ప్రభుత్వం సమీక్షించిందిలేదు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విద్యుత్ ఎంత.. ప్రజలు వినియోగించు కుంటున్నది ఎంతనేప్రశ్నకు ముఖ్యమంత్రిగానీ, విద్యుత్ శాఖామంత్రిగానీ సమాధానంచెప్పే స్థితిలోలేరు. వీటన్నింటిపై ప్రశ్నిస్తే తప్పంగా గతప్రభుత్వానిదే అంటారు.

టీడీపీప్రభుత్వ హాయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అయిన విద్యుత్ ఎంత.. వినియోగం అయింది ఎంతనే లెక్కలవివరాలు స్పష్టంగా ఉండేవి. కానీ ఈప్రభుత్వం అవేవీ పట్టించుకోదు.సోలార్, థర్మల్ విద్యుత్ ను ఈ ప్రభుత్వం యూనిట్ రూ.15కు కొంటోంది. అలానే హిందుజా సంస్థనుంచి రూ.3.80పైసలకు కొనా ల్సిన యూనిట్ విద్యుత్ ను, రూ.15కు బయటనుంచి కొంటోంది. ఈ విధంగా గతప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి చేసు కున్న ఒప్పందాలకు తిలోదకాలు ఇచ్చిమరీ, ఎక్కువధరకు విద్యుత్ ఎందుకు కొంటున్నారో పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

2014కు ముందున్న ప్రభుత్వంలో 22లక్షలమిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. ఆతరువాత చంద్రబాబునాయుడి గారి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన రెండునెలల్లోనే విద్యుత్ రంగాన్ని చంద్రబాబునాయుడు బలోపేతంచేశారు. 22లక్షల మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ లోటుని, 85శాతం వరకు తగ్గించారు. ఏపీలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపనితీరు మెరు గుపరిచి, సప్లైలో తలెత్తే లోపాలను నివారించి, విద్యుత్ లోటుని రాష్ట్రం అధిగమించేలా చేసిన ఘనత చంద్రబాబుగారికే దక్కుతుంది.

లోటు విద్యుత్ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన చంద్రబాబు గారు, తన ఐదేళ్లపాలనలో 10వేలమెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి పెరిగేలాచేశారు. ఈ ప్రభుత్వం ఆవిధంగా విద్యుత్ నష్టని వారణ చర్యలు అధిగమించడానికి ఎలాంటిచర్యలు చేపట్టిందో, విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ఎలాంటి చర్యలుతీసకుందో సమాధా నంచెప్పకుండా, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటికీ చంద్రబాబునాయుడిపై నిందలేస్తూ పబ్బంగడుపుకుంటోంది.

టీడీపీ ప్రభుత్వంలో అమలుకాని విద్యుత్ కోతలు, ఇప్పుడే ఎందుకుఅమలుచేస్తున్నారో పాలకులు సమాధానంచెప్పాలి. విద్యుత్ రంగాన్ని రాజశేఖర్ రెడ్డి హాయాంలోకూడా భ్రష్టుపట్టించా రు. ఇప్పుడు ఆయనకుమారుడైన జగన్మోహన్ రెడ్డికూడా అంతకంటే ఎక్కువగా విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేశారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా పరనిందచేయడం మానేసి, పనితీరు మెరుగుపరుచుకుంటే మంచిదని సూచిస్తున్నాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మనరాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఈప్రభుత్వం అల్లరిపాలుచేసి,ఎందుకు సాగనంపిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.సోలార్ విద్యుత్ ఉత్పత్తి టెండర్ల విషయంలో కోర్టులు ఎందుకు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టాయో పాలకులకుతెలియదా? రూ.60వేలకోట్ల పైచిలుకు భారాన్ని ప్రజలపైవేసి కూడా రాష్ట్రంలో వివిధకేటగిరీల్లో రోజుకి 6 నుంచి 8గంటలవరకు అధికారికంగానే ఎందుకు విద్యుత్ కోతలు అమలుచేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరణఇవ్వాల్సిం దేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE