కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ
జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటుచూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయి తప్ప, ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని పంట కొనుగోలు సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పూర్తిగా నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం వలన రాష్ట్రంలోని ప్రజలకు ఒక గుదిబండ లాగా ఉందని అన్నారు. ఈ జీవో ప్రకారం ఒక భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకొని దాని యొక్క నకలు ఆ భూమి యజమానినికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇదేగాని జరిగితే రాష్ట్రంలోనే ప్రతి ప్రతి ఒక్కరూ నష్టపోతారని తెలియజేశారు.