Home » 503 మంది ఎంపీ అభ్యర్థులు

503 మంది ఎంపీ అభ్యర్థులు

-2,705 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు
-అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ కు 36 నామినేషన్లు
-అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు
-చోడవరం స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు
-తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు
-స్వతంత్ర అభ్యర్థులకు త్వరలో గుర్తులు

ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 4,210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్ సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఓకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను ఈసీ ఉపసంహరించింది.

రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ కు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ఆమోదించినట్లు వెల్లడించింది. అసెంబ్లీ స్థానాలకు గాను తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలవ్వగా.. చోడవరం స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో త్వరలోనే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆర్వోలు గుర్తులను కేటాయించనున్నారు.

Leave a Reply