Suryaa.co.in

Andhra Pradesh

తప్పుడు కేసుతో చంద్రబాబును ఇరికించిన జగన్‌ సర్కారు!

• ఫిర్యాదు ఇచ్చింది ఒకరు.. ఎఫ్ఐఆర్ లో ఇంకొకరి పేరు
• సాక్షి పత్రికపై పరువు నష్టం కేసు వేసే అంశం సీఐడీ పరిశీలించాలి
• మధుసూధన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి లపై కేసు పెట్టే అంశం పరిశీలన
• సొంత వాళ్లకు రూ. 100 కోట్లకు పైగా అక్రమంగా పనులు ఇచ్చిన వైసీపీ
• సినీ దర్శకుడు వర్మ.. నా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు
– ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్‌ జీవీ రెడ్డి

విజయవాడ: వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని అందుకే కోర్టు ఆ కేసును కొట్టివేసిందని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఫైబర్ నెట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు. 2014 లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు.

టెరా సాఫ్ట్ ఎండీ వేమూరి వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. కులాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఇరికించేందుకు జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి అక్రమంగా కేసు పెట్టించారని తెలిపారు. గతంలో మాజీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్ కాలమ్ 6 లో రాశారని, ఫిర్యాదులో ఎక్కడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు.

విచారణ మొదలు పెట్టాక చంద్రబాబు ను ఇరికించాలని ఆయన పేరు పెట్టారన్నారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన చార్జి షాట్ ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు.. చార్జిషీట్ ను కోర్టు రిజెక్టు చేస్తే జగన్ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాశారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో తప్పుగా ఇచ్చిన ఆడిట్ నివేదికను కోర్టు కొట్టివేసిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తప్పులు చేసింది మీరని, మేము ఆడిట్ నివేదికను తొక్కిపెట్టినట్టు వార్త రాశారని అది అవాస్తమని ప్రశ్నించారు. మేమేదో ఆడిట్ నివేదికను తొక్కిపెట్టామంటూ సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు.. రాష్ట్ర ఫైబర్ నెట్ కు సంబంధించి గతంలో టీడీపీ వేసిన పునాదుల వల్లే గత 5 ఏళ్లలో వాళ్లు ఫైబర్ నెట్ సంస్థలో ఎన్ని అరాచకాలు చేసినా ఆ సంస్ధ తట్టుకుని నిలబడగలిగిందన్నారు.

తమకు కావాల్సిన వారికి ఇష్టమొచ్చినట్టు చెల్లింపులు చేసుకున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. అందులో ముఖ్యంగా గతంలో పనిచేసిన ఎండీ మధుసూధన్ రెడ్డి తన సొంత బ్రదర్స్ కి 100 కోట్ల కాంట్రాక్ట్స్ ఇచ్చి, అధికార దుర్వినియోగం చేశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలంటూ ఆ పేపర్ లో తప్పుడు వార్తలు రాశారన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందన్నారు. పోస్టింగులు ఇస్తే అధికారులు అనుకూలంగా పనిచేస్తారా అని ప్రశ్నించారు.

అంతేకాకుండా అలా అయితే గతంలో మీరు పోస్టింగ్ లు ఇచ్చి అధికారులతో అనుకూలంగా పనులు చేయించుకున్నారని అనుకోవాలా అని అన్నారు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా, వారి ప్రతిష్ఠ దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఆర్డీయే పూర్వ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ను బెదిరించి లొంగదీసుకున్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ హయాంలో అధికారులు చేసిన ఆడిట్ నివేదిక తప్పుడుదని కోర్టు కొట్టేసిందని తెలిపారు. మేము తప్పులు చేశామని ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినందుకు ఏపీ ఎస్ఎఫ్ఎల్ పూర్వ ఎండీ మధుసూధన్ రెడ్డి, గత ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

సీఐడీపై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి వివరణ ఇచ్చి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. లేకపోతే ఆ సంస్థపై అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. సాక్షి పేపర్ పై పరువు నష్టం కేసు వేసే అంశాన్ని సీఐడీ అధికారులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలపై దర్శకుడు వర్మకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆ నోటీసులు వర్మ అందుకున్నారని, ఫైబర్ నెట్ కేసులో చెల్లించాల్సిన డబ్బు తన వద్ద లేదని వర్మ చెబుతున్నారన్నారు.

LEAVE A RESPONSE