Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబునాయుడి విషయంలో జగన్ సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోంది

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

చంద్రబాబునాయుడి ఆరోగ్యం క్షీణించడంపై, పలువురు ప్రధాన టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు జైల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో నేతలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే ..

చంద్రబాబునాయుడి విషయంలో జగన్ సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోంది. నేడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తే, అనేక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతుంటే ఈ ప్రభుత్వం కనీస వైద్యసేవలు కూడా అందించకుండా కాలయాపన చేయడాన్ని ఏమనాలి? చర్మసంబంధిత సమస్యలు తలెత్తి చంద్రబాబు ఇబ్బందిపడుతుంటే, సాదాసీదా చర్మవైద్యుల్ని ఆయనవద్దకు పంపించి ఏవో మందులిచ్చే ప్రయత్నంచేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదు.

మాజీ ముఖ్య మంత్రి, దేశం గర్వించే నాయకుడైన చంద్రబాబు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నాం. తప్పుడు కేసులో చంద్రబాబుని జైలుకు పంపి, 34 రోజు లు అవుతున్నా, న్యాయస్థానాల్లో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఒకవైపు ఎండలు పెరిగి, ఉక్కపోతతో ఆయన డీహైడ్రేషన్ కు గురై, చర్మసంబంధిత సమస్యలతో జైల్లో బాధపడుతుంటే, తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ప్రకారం పనిచేసిన జైలు అధికారులు సమస్యను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వం వెంటనే చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై దృష్టి పెట్టి, ఆయన గురించి బాగా తెలిసిన ఆయన వ్యక్తిగత వైద్యబృందాన్ని జైల్లోకి అనుమతించి, వారితో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలి. వారి సూచనలు, సలహాల ప్రకారమే ఆయనకు వైద్యసేవ లు అందేలా చూడాలి. వారు సూచించిన మందులనే వాడాలి.

ఏసీబీ కోర్టులో జరగబోయే వాదనలు… విషయాలు తాడేపల్లి ప్యాలెస్ లో చర్చకు వస్తున్నాయి
చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో కూడా పలు ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనారోగ్య సమస్యలతో చంద్రబాబు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, పీటీ వారెంట్ పై ఆయన సోమవారం విచారణకు రావాలని ఏసీబీ కోర్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏసీబీ కోర్టులో జరుగుతున్న విషయాలన్నీ ముందే తాడేపల్లి ప్యాలెస్ లో చర్చకు వస్తున్నాయి. వీటన్నింటిపై తాము కచ్చితంగా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.” అని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

చంద్రబాబునాయుడు ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో బయటకు రాకూడదనేలా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది : వర్ల రామయ్య 
“ చంద్రబాబునాయుడు జాతీయ సంపద. 2004లో ఆయనకు ఎన్.ఎస్.జీ భద్రత కల్పించినప్పుడే ఈ మాట చెప్పారు. అలాంటి వ్యక్తిని నేడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించేలా ముందే ప్లాన్ చేశారు. దాని ప్రకారమే జైల్లో కుట్ర జరుగుతోంది. చంద్రబాబునాయుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో బయటకు రాకూడదనేలా కుట్ర జరుగుతోంది. కాబట్టి.. జాతీయ సొత్తు అయిన చంద్రబాబునాయుడిని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రప్రభుత్వంతో పాటు, ప్రధానమంత్రిపై కూడా ఉంది.

దేశ ప్రధాని ఈ విషయం లో మౌనంగా ఉంటానంటే కుదరదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, చంద్రబాబునాయుడి విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో గమనించాలి. చంద్రబాబునాయుడికి తక్షణమే జాతీయ స్థాయి ఆసు పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించాలి.” అని వర్ల రామయ్య కోరారు.

చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై జగన్ కు వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాం : బుద్దా వెంకన్న
“ నేడు చంద్రబాబునాయుడు పడుతున్న ఇబ్బంది ప్రజలకు తెలియాలంటే తక్షణం టీడీపీ నేతలు చేయాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి రిప్రంజటేషన్ ఇవ్వడం. గతంలో జోగి రమేశ్ ఎలాగైతే చంద్రబాబుకి రిప్రంజటేషన్ ఇవ్వడానికి వెళ్లాడో, మేం కూడా అలానే వెళ్లి, చంద్రబాబునాయుడి ఆరోగ్యపరిస్థితిపై ముఖ్యమంత్రికి రిప్రంజటే షన్ ఇవ్వాలనుకుంటున్నాం.” అని బుద్దా వెంకన్న తెలిపారు.

జైలు అధికారులు సంతకాలు పెట్టిమరీ చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేయడమేంటి? మాజీ ముఖ్యమంత్రిని పరిశీలించిన ప్రభుత్వవైద్యుల నోరు ఎందుకు నొక్కేశారు? కిమిడి కళావెంకట్రావు 
“ రాజ్యాంగ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని నాలుగున్నరేళ్లుగా జగన్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నాడు. జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర జైళ్లశాఖ, ప్రభుత్వ వైద్యులు చంద్రబాబునాయుడి ఆరోగ్యం విషయంలో అనుసరించిన విధానం మొత్తం చట్టవిరుద్ధమే. మాజీ ముఖ్యమంత్రిని పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోయారంటే దానికి కారణం వారికి స్వేఛ్ఛ లేకపోవడమే.

అలానే రాజమహేంద్రవరం జైలు సూపరిండెంట్ కు కూడా స్వేచ్ఛ లేదు. సాధారణంగా ప్రముఖుల ఆరోగ్య సమాచారం ఎక్కడైనా వైద్యులు..అదీ ఎక్కువగా ఆసుపత్రుల నుంచే వెల్లడిస్తుంటారు. కానీ ప్రధాన ప్రతిపక్షనేత, జాతీయస్థాయి నాయకుడైన చంద్ర బాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు తమ సంతకాలతో విడుదల చేయడం ఏమిటి? రాజమహేంద్రవరం జైలు సూపరిండెంట్ కూడా కాకుండా అసిస్టెంట్ సూపరిం డెంట్ మాజీ ముఖ్యమంత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఏమిటి? ఎవరి ఆదేశాల తో జైలు అధికారులు ఆ పనిచేశారు?

చంద్రబాబునాయుడిని తక్షణమే ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో గానీ, కేంద్రప్రభుత్వ వైద్యసంస్థల్లో గానీ చేర్పించి, మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబుని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు వాస్తవాలు చెప్పలేకపోవడం.. వారిని ప్రభుత్వం బెదిరించడం.. జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం వంటివి చూశాక టీడీపీనేతలు, కార్య కర్తలతో పాటు, ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబుకి ఏం జరిగినా కర్త, కర్మ, క్రియా జగన్మోహన్ రెడ్డే అవుతాడు. తన ప్రభుత్వం చరమాంకంలో ఉందనే వాస్తవాన్ని గుర్తెరిగి, జగన్ నడుచుకోవాలి.” అని కళా వెంకట్రావు హెచ్చరించారు.

చంద్రబాబుని చంపేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో జగన్ ఉన్నాడు. చంద్రబాబుకి జరగరానిది జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది : నక్కా ఆనంద్ బాబు
చంద్రబాబునాయుడిని జైలుకు పంపిన దగ్గర నుంచీ, జైల్లో ఆయన్ని ఎలా ఉంచాలో.. ఎలా ట్రీట్ చేయాలనే దాన్ని జగన్ సర్కార్ రోజూ పర్యవేక్షిస్తోంది. ఇది యదార్థం. చంద్ర బాబుని మానసికంగా వేధించి, ఆయన ఆరోగ్యం దెబ్బతీసి, ఆయన బయటకు వచ్చాక కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలన్నదే జగన్ రెడ్డి పన్నాగం. దాంతో తెలుగుదేశం శ్రేణుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది అని ఆలోచిస్తున్నాడు. చంద్ర బాబుని చంపేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే జగన్..ఏమీలేని అంశాల్లో అన్యా యంగా చంద్రబాబుని జైలుకు పంపారు.

జైల్లో చంద్రబాబు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే నేడు, తెలుగుదేశం నేతలందరం అత్యవసరంగా సమావేశమై ఆందోళన వ్యక్తం చేస్తున్నామో ప్రజలు కూడా ఆలోచించాలి. చంద్రబాబు కేవలం నిందితుడిగా ఆరోపణ లు మాత్రమే ఎదుర్కొంటున్నారు…ఆయనేమీ దోషి కాదు. అలాంటి వ్యక్తికి కనీస సౌక ర్యాలు కూడా కల్పించకుండా ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి కావాలనే ఆయనపై కక్షతో వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబుకి జైల్లో ఏదైనా జరగరానిది జరిగితే రాష్ట్రం అగ్నిగుం డం అవుతుంది.” అని ఆనంద్ బాబు తీవ్రస్వరంతో ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై వెల్లడించిన సమాచారం సజ్జల రాసిచ్చాడా..లేక జగన్ ఇంటి నుంచి వచ్చిందా? ఎవరిని అడిగి చంద్రబాబుకి స్టెరాయిడ్స్ కూడిన మందులు రాశారు? చంద్రబాబుని జైల్లో పరీక్షించింది వైద్యులేనా?- పంచుమర్తి అనురాధ
34 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల్ని ప్రజలు గమనిస్తున్నారు. కించిత్ చిన్నపాటి ఆధారంలేని తప్పుడు కేసులో చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపా రు. యువతకు లక్షలాది ఉద్యోగాలు, మహిళల జీవితాల్లో వెలుగులు, రైతులకు సాగు నీటి ప్రాజెక్టులు అందించిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకి భద్రత లేదు.. ఆరోగ్యం బాగోలేదు. చంద్రబాబుని పరిశీలించిన వైద్యు లు నిజంగా వైద్యులేనా? డీ హైడ్రేషన్ కు, చర్మసంబంధిత సమస్యలకు తేడా తెలియదా?

శరీరంలో ఏ అవయవం పాడైపోతున్నా…ముందుగా తలెత్తే సమస్య డీ హైడ్రేషనే. చర్మ సంబంధిత సమస్యలకు స్టెరాయిడ్స్ ఇచ్చిన వైద్యులు వైద్యులేనా? చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో సంప్రదించకుండా ,ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు వైద్యం చేసేస్తారా? బుద్ధుందారా మీకు? ఎవడో గన్నాయిగాడు రాసివ్వడం… మీరు పనిచేయడం. చంద్ర బాబు గురించి వెల్లడించే రిపోర్టులు.. సజ్జల రాసిచ్చాడా.. జగన్ ఇంటినుంచి వచ్చా యా?
చంద్రబాబు గొప్పతనం మీలాంటి సన్నాసులకు తెలియకపోవచ్చు.. కానీ 107 దేశాలకు తెలుసు. తక్షణమే ప్రభుత్వం చంద్రబాబునాయుడి వ్యక్తిగత వైద్యుల్ని జైల్లోకి అనుమతించి వారి సమక్షంలో ఆయనకు కేంద్రప్రభుత్వ వైద్యసంస్థలో వైద్యపరీక్షలు జరిపించాలి. ఇది జరక్కపోతే ఈ ప్రభుత్వం దారుణమైన మూల్యం చెల్లించుకుంటుంది. ” అని అనురాధ ఆగ్రహావేశాలతో హెచ్చరించారు.

చంద్రబాబుని పరీక్షించిన వైద్యులు ఏంచెప్పారు? వారిని మీడియాతో ఎందుకు మాట్లాడనివ్వలేదు? కావాలనే ఈ ప్రభుత్వం చంద్రబాబునాయుడి ఆరోగ్యం దెబ్బతినేలా వ్యవహరిస్తోంది- దేవినేని ఉమామహేశ్వరరావు 
“ చంద్రబాబునాయుడిని పరీక్షించి, ఆయనకు మందులు ఇచ్చేముందు, ప్రభుత్వ వైద్యులు ఆయన వ్యక్తిగత వైద్యుల్ని ఎందుకు సంప్రదించలేదు? చంద్రబాబునాయుడి ఆరోగ్యసమాచారాన్ని సాధారణంగా ప్రభుత్వమో.. ఆరోగ్యశాఖా మంత్రో.. ప్రధాన వైద్యా ధికారులో వెల్లడించాలి. అలాకాకుండా జైలు సిబ్బంది వెల్లడించడం ఏమిటి? వారికి వైద్యం గురించి, చంద్రబాబు ఆరోగ్యస్థితి గురించి ఏం తెలుసని హెల్త్ బులెటిన్ మీడియాకు అందించారు?

45 ఏళ్లపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆరోగ్యం అంటే అంత అలుసా ఈ ప్రభుత్వానికి? జైల్లో చంద్రబాబుని పరిశీలించిన వైద్యులు ఏం చెప్పారు..వారిని మీడియాతో ఎందుకు మాట్లాడించలేదు? వారి సంతకాలతో కూడిన సమాచారం ఎందుకు బయటకు రాని వ్వలేదు? వైద్యులతో జైలు అధికారులు ఎందుకు మాట్లాడలేదు? ఎవరి ఆదేశాల ప్రకారం ఇష్టానుసారం స్టెరాయిడ్స్ మిళితమైన మందుల్ని రిఫర్ చేశారు?

జరిగిన వ్యవ హారంపై తక్షణమే ముఖ్యమంత్రి నోరు విప్పాలి. ఉద్దేశపూర్వకంగా కావాలనే.. ఈ ప్రభు త్వం చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికే ఇలా వ్యవహరిస్తోంది. చంద్రబాబు వ్యక్తి గత వైద్యుల్ని సంప్రదించి, ఆయన్ని వెంటనే మంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, నాణ్య మైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

చంద్రబాబు ఆరో గ్యపరిస్థితిపై న్యాయస్థానాలు కూడా తక్షణమే స్పందించాలి. చంద్రబాబునాయుడి విష యంలో ప్రభుత్వం, ప్రధాన అధికారయంత్రాంగం స్పందించకుంటే, తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతుంది.” అని దేవినేని ఉమా హెచ్చరించారు.

LEAVE A RESPONSE