– ఉగ్రవాదంపై బీఆర్‌ఎస్ స్పందించదా?
– బీజేపీ ఉగ్రవాదానికే తప్ప ముస్లిములకు వ్యతిరేకం కాదు
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి. మురళీధర్ రావు
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం నేపథ్యంలో హమాస్ ముష్కరులు పాశవికంగా దాడులు చేయడం దిగ్భాంత్రి కలిగించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి క్రూరమైంది, విపరీతమైన హింసాత్మకమైంది. మధ్యయుగాల్లో జరిగిన హింసను తలపించేలా ఉంది. కేవలం మతం ఆధారంగా హింసను ప్రేరేపించిన దుర్ఘటనపై ప్రపంచంలోని మానవాళి దిగ్భ్రాంతి చెందింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ దృక్పథాన్ని స్పష్టం చేశారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో నష్టపోయి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశం భారత్. ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా జరుగుతున్న పరిణామాలతో, భారత్ ఇజ్రాయిల్ కు రక్షణ కల్పించేలా అండగా నిలిచింది. భారత ప్రధాని ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తూ ఇజ్రాయిల్ కు మద్దతు తెలిపారు.
తెలంగాణ ఉగ్రవాద పీడిత ప్రాంతం. అనేక ఘర్షణలతో నష్టపోయిన ప్రాంతం. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా (బీఆర్ఎస్) మారింది. ఉగ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నా ఆ దుర్ఘటన పట్ల, బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం దారుణం. ఉగ్రవాదం పై ప్రభుత్వాల వైఖరి ఏంటో తెలపాల్సిన బాధ్యత ఉంటుంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తాము భాగస్వామ్యం కాదని చెప్పడమే బీఆర్ఎస్ ఉద్దేశంగా తెలుస్తోంది.
ఓటు బ్యాంకు రాజకీయాలే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ముఖ్యం. కాంగ్రెస్ హమాస్ దాడులను ఖండిస్తూనే, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది. హమాస్ ధోరణినే అవలంభిస్తోంది. కాంగ్రెస్ తుక్డే తుక్డే గ్యాంగ్ అనుసరిస్తున్న వ్యూహాన్నే అనుసరిస్తోంది. ఉగ్రవాదులతో చేతులు కలిపిన చరిత్ర కాంగ్రెస్ ది. అనేకమార్లు రాజకీయ స్వలాభం కోసం, ఎన్నికల్లో గెలిచేందుకు ఉగ్రమూకలతో చేయి కలిపింది. ఉగ్రవాదంపై ఎంఐఎం-కాంగ్రెస్ ప్రకటన ఒకే విధంగా ఉంది.
ప్రపంచంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్నది. దేశం, ప్రజలకు ముప్పు కలిగే ప్రమాదం పొంచి ఉన్నా, బీఆర్ఎస్ మౌనం వహించడం.. తుక్డే తుక్టే గ్యాంగుకు మద్దతిస్తున్నట్లుగానే ఉంది. నేషన్ ఫస్ట్.. పీపుల్ ఫస్ట్.. హ్యూమన్ రైట్స్ ఫస్ట్ నినాదంతో పని చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. బిఆరెస్ నేతలకు మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడటం బాగా వచ్చు.. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కదా?
బిఆరెస్ రాజకీయం కూడా కాంగ్రెస్ రాజకీయాలను పోలి ఉంది. జాతీయ భద్రతకు ఏమైనా పర్లేదు.. పార్టీకి ప్రయోజనం చేకూరితే చాలు అని బిఆరెస్ భావిస్తోంది. కాంగ్రెస్ తెలంగాణలో రాజకీయం చేస్తోంది అంటే.. కర్ణాటక రిజర్వాయర్ నుంచి డబ్బులు తెచ్చి.. తెలంగాణలో పంటకు ఖర్చు పెట్టినట్లుగా మారింది. ఇవ్వాళ కర్ణాటక లో దొరికిన డబ్బు తెలంగాణ ఎన్నికల కోసమే. 360 డిగ్రీస్ లో ప్రచారాన్ని కలుషితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డబ్బు విచ్చలవిడిగా వస్తోంది.ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలి. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. మనీ బేస్డ్ పాలిటిక్స్ తో ఎన్నికలను పొల్యూట్ చేసేందుకు కాంగ్రెస్-బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ వాగ్ధానాలు- వైఫల్యాలపై బిజెపి ఆధ్వర్యంలో సమగ్రమైన చార్జ్ షీట్ ను తీసుకొస్తాం.
బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేయడంతో పాటు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం హామీలను విస్మరించింది. బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పై చార్జ్ షీట్ రూపొందిస్తాం. ఇస్లామిక్ తీవ్రవాదం, మావోయిస్టులకు వ్యతిరేకంగా బిజెపి అనేక పోరాటాలు చేసింది.
బిజెపి చేస్తున్నది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమే గాని ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా భారత్ పోరాటం చేస్తోంది. కొందరు ఎంఐఎం పార్టీ, రాడికల్ ముల్లాలు ఇచ్చే నిర్వచనం ఆధారంగా రాజకీయం చేస్తూ, కోట్లాది మంది ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉంది.
ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ , రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి , సీనియర్ నాయకులు కపిలవాయి రవీందర్ , తదితరులు పాల్గొన్నారు.