– స్పెషాలిటీ ఆస్పత్రులు సేవలు ఆపవద్దు
– పీపీపీ విధానంలో వచ్చిన నష్టం ఏమిటి?
– ఒక్కోకాలేజ్ నిర్మాణం కోసం వంద కోట్లు లంచం
– అన్నీ పూర్తి చేశామని చెప్పడానికి సిగ్గు ఉండాలి
– ఐదు కిలోమీటర్ల కు హెలికాప్టర్ లో వెళ్లే జగన్ అరవై కిలోమీటర్ల రోడ్ పై వెళ్లేందుకు అనుమతి అడుగుతున్నారు
– ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విజయవాడ: కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి అంశాలని అమలు చేసింది. అభివృద్ధి ని అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తున్నారు. కోర్టు లో పిటిషన్ లు కూడా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పేద ప్రజలకు మంచి చేయాలని పిపిపి మోడ్ లో వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది.
మెడికల్ కళాశాలలు నిర్మాణం కూడా పిపిపి మోడ్ లో చేయాలని భావించాం. పిపిపి అంటే జగన్ కు తెలియనిది కాదు కదా? నేడు కోర్టు పిపిపి మోడ్ లో వెళితే తప్పు ఏమిటని ప్రశ్నించింది. నేడు మెడికల్ కళాశాలు ఎన్ని మొండి గోడలు ఉన్నాయో అందరూ చూశారు. పిపిపి మోడ్ లో నిర్మాణం చేస్తే ప్రైవేటు కు అమ్మేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. తన పత్రిక లో విషపు రాతలు రాస్తున్నారు
అసెంబ్లీ లో, మండలిలో చర్చకు రమ్మన్నా రాకుండా పారిపోయారు. కేవలం అబద్దాలే ఆలంబనగా జగన్ ప్రచారం చేస్తున్నారు. నర్సీపట్నం వెళ్లడానికి కారణం ఏమిటొ జగన్ స్పష్టంగా చెప్పగలరా? కేవలం ప్రజలను రెచ్చగొట్టేలా బలప్రదర్శన కోసం జగన్ పర్యటన చేస్తున్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటన లు ఎలా సాగాయో చూశాం.
మెడికల్ కాలేజ్ ల పై జగన్ కు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం ఆర్భాటం, హడావుడి కోసం జగన్ పర్యటనలు. ఏపీ అభివృద్ధి చెందడం వికృత మనస్తత్వం ఉన్న జగన్ కు ఇష్టం లేదు. ఐదు కిలోమీటర్ల కు హెలికాప్టర్ లో వెళ్లే జగన్.. అరవై కిలోమీటర్ల రోడ్ పై వెళ్లేందుకు అనుమతి అడుగుతున్నారు.
విశాఖ లో గతంలో ఎంత దారుణాలు చేశారో ప్రజలు చూశారు. నర్సీపట్నం పర్యటన కు వేలాది మంది ఎందుకు? నేను వస్తా అని చెప్పినా స్పందన లేదు. యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. పీపీపీ విధానంలో వచ్చిన నష్టం ఏమిటి? ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పడం తప్ప, అది వాస్తవం అని నిరూపించారా?
అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కు 500 కోట్లు ఇచ్చి 10.70 కోట్లు మాత్రమే జగన్ ఖర్చు పెట్టారు. 8500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, 1550 కోట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చించారు. ఒక్క పులివెందుల కాలేజ్ కే నిధులు మొత్తం ఇచ్చారు. జగన్ ఏపీకి సిఎంగా పని చేశారా? ఒక్క పులివెందుల కే సిఎంగా ఉన్నారా? ఉత్తరాంధ్ర లో గిరిజన యూనివర్సిటీ రాకుండా జగన్ అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తే జగన్ కు వాస్తవం తెలుస్తుంది. పునాదులు నిర్మాణం చేసిన చోట మెడికల్ కాలేజ్ లు ఎలా నిర్వహిస్తారు? కాలేజ్ లు కట్టకుండా అన్నీ పూర్తి చేశామని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఒక్కోకాలేజ్ నిర్మాణం కోసం వంద కోట్లు లంచం జగన్ తీసుకున్నారు. కమీషన్ ల కోసం చేసిన పని బయటకి వస్తుందనే భయం జగన్ లో ఉంది. అందుకే కాంట్రాక్టర్ లను బెదిరించే నీచానికి దిగజారాడు.ఇప్పుడయినా జగన్ చేసిన తప్పు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
యన్టీఆర్ వైద్య సేవలు బంద్ పై ..
స్పెషాలిటీ ఆస్పత్రులు సేవలు ఆపవద్దని కోరుతున్నాం. గత ప్రభుత్వం 2500 కోట్లు బకాయిలు పెట్టింది. మేము వచ్చాక విడతల వారీగా చెల్లిస్తున్నాం. ఆస్పత్రుల నిర్వహణ కష్టం గా ఉందనేది మాకు తెలుసు. ప్రజలు కూడా ఇబ్బందులు పడకూడదని కోరుతున్నాం. సిఎం నుఈరోజు కలిసి ఈ అంశంపై చర్చిస్తాను. వారు కూడా సేవలు ఆపకుండా కొనసాగించాలని మా విజ్ఞప్తి.
నకిలీ మద్యం కు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి
నేను మొత్తం నకిలీ మద్యం వ్యాపారం చేసినా దొరకలేదు. ఇప్పుడు అక్కడక్కడా ఉంటేనే దొరికిపోతున్నారని జగన్ ఆశ్చర్య పోతున్నారు. మా ప్రభుత్వం లో ఎవరు తప్పు చేసినా చర్యలు ఉంటాయి. నకిలీ మద్యం కేసులో ఎవరిపాత్ర ఉన్నా అరెస్టు లు జరుగుతున్నాయి.
జగన్ హయాంలో మాత్రం నకిలీ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఎంతమంది పై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా తన పత్రిక లో వకీకరించి విషపు రాతలు రాశారు. పత్రికా విలువ లను ఏమాత్రం పట్టని వ్యక్తి జగన్. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈసారి ఈ 11 సీట్లు కూడా లేకుండా చేస్తారు.