– క్షమాపణ చెప్పి రూ.5 కోట్లు పరిహారం కట్టాలి
గుంటూరు: పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సాక్షి, వైసీపీకి చెందిన నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు అందుకున్న వారిలో వైసీపీ నేత అంబటి మురళి కూడా ఉన్నారు.
సాక్షి పత్రిక, టీవీ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు 2025 ఆగస్టు 17న.. పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పై చేసిన అసత్య ప్రచారాలపై ఆయన లాయర్ నోటీసులు పంపించారు.
అమరావతి కోసం పొన్నూరును ముంచేశారు…కొండవీటి వాగు నీరు అప్పాపురం గుంటూరు ఛానల్ కి మళ్లించారని, దాని ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని… చేబ్రోలు కొమ్మమూరు బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్టర్ల వద్ద 5 కోట్ల కమిషన్ డిమాండ్ చేశారని తప్పుడు ప్రచారాన్ని చేసిన అంబటి మురళి కృష్ణతోపాటు.. సాక్షి పత్రిక, టీవీ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా ప్రజల్లో తనపై ఉన్న ప్రతిష్టను దెబ్బతీయటానికి ఉద్దేశించినవని పేర్కొంటూ… 15 రోజుల్లోపుగా చేసిన అసత్య ప్రచారాలకు క్షమాపణ చెప్పి రూ.5 కోట్లు పరిహారం కట్టాలని లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని లాయర్ నోటీసులో ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు