– ఎంపీ సానా సతీష్ బాబు
కాకినాడ: ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయమైన సమాజం నిర్మించగలం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం మొత్తం కలత చెందుతుంది. అటువంటి కష్ట సమయంలో “మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా నేను ఆదుకుంటాను” అని మాటిచ్చిన వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఆ మాటకు తగ్గట్టుగానే ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా ప్రజల పాలిట పెన్నిధిగా మారింది. ఎటువంటి వైషమ్యాలు లేకుండా, కేవలం మానవతా దృక్పథంతో, బాధితులకు అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఉదారంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
ఈ సంకల్పానికి తోడుగా, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పేదలకు, బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి సిఫార్సుతో నేడు నలుగురు బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 13,52,134 (పదమూడు లక్షల యాభై రెండు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు) విలువైన చెక్కులను పంపిణీ చేయడం ఇందుకు ఉదాహరణ.
ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ప్రతి ప్రాణం విలువైనదే” అనే సందేశాన్ని మరోసారి బలంగా చాటింది. ఈ కార్యక్రమంలో తుని శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్ యనమల దివ్య మాజీ శాసన సభ్యులు రాజా అశోక్ బాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.