-అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు
-మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తుంటే.. ఆధారాలు లేని స్కాముల పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయి. వ్యవసాయ సంక్షోభంలో పడింది. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రైతాంగం కష్టాలు అధికమయ్యాయి. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది.
కానీ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటోంది. ఏనాడూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిన ధాఖలాలు లేవు. సభలో సమస్యలు వదిలేసి స్కోత్కర్శకాలు వినిపిస్తున్నారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారు.
ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా అరెస్ట్ చేసి కోర్టుల ముందు అబద్దాలు పెట్టి నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పోకడ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదంగా మారుతుంది.
ఆరోపణ : స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ని చంద్రబాబు కేబినెట్ కు తెలియకుండా నెలకొల్పారు
వాస్తవం : అధికారులు ఫైలు పెట్టి ముందు జీవో ఇచ్చి తరువాత కేబినెట్ లో రాటిఫికేషన్ చేద్దామని రాస్తే సంతకం పెట్టారు. అదే ఫైలులో విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం సహాని, ఆర్ధిక శాఖ కార్యదర్శి అజయ్ కల్లాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు లు కూడా సంతకాలు పెట్టారు. ఆ తరువాత దఫాదఫాలుగా డబ్బులు అడిగినప్పుడు విద్యాశాఖ, ఆర్థిక శాఖలో క్రింది స్థాయి అధికారులు కేబినెట్ రాటిఫికేషన్ చేయలేదని ఎత్తి చూపారు. అయినా పై ముగ్గురు అధికారులు పట్టించుకోలేదు.
దీనికి వారిని విచారించరు. వారిని శిక్షించరు? అప్పటి ముఖ్యమంత్రిని మాత్రం రహస్యంగా కార్పోరేషన్ పెట్టి ఏదేదో చేసేశారని జైలులో పెడతారు. విశేషమేమిటంటే ఈ పైలు కాగితాలు ఎసిబి కోర్టులో సిఐడి దాఖలు చేసిన పత్రాలలోనే ఉన్నాయి. ఎక్కడా వెతకనక్కర్లేదు. కానీ ఎవరూ పట్టించుకోరు.
ఆరోపణ: అడ్వాన్స్ గా రూ.370 కోట్లు విడుదల చేసి కోట్ల కుంభకోణానికి చంద్రబాబు కుట్ర పన్నారు.
వాస్తవం : సిఐడి వారు అన్ని కోర్టులను ఇదే వాదనతో నమ్మించాలని చూస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 50 కింద సాక్ష్యం ఇస్తూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ ప్రేమ్ చంద్రారెడ్డి రూ.370 కోట్లు తానే విడుదల చేశానని, ఆర్థిక శాఖకు చెప్పి కేంద్ర సంస్థతో మదింపు చేయించానని తరువాత తన రిటైర్ మెంట్ తరువాత వచ్చిన అధికారులు పర్యవేక్షణకు బాధ్యులని చెప్పారు. ఈ నిధుల చెల్లింపుకు సంబంధించిన పైళ్ళు కూడా ఎసిబి కోర్టు దాఖలు చేసిన పత్రాల్లో ఉన్నాయి. ఎవరూ పట్టించుకోరు.
ప్రేమ్ చంద్రారెడ్డి ఎఫ్ఐఆర్ లో లేనప్పుడు, ఆ నిధులు విడుదల చేసిన ఐవైఆర్ కృష్ణారావు , అజయ్ కలాం, పి.వి.రమేష్, సునీత ఎవరూ బాధ్యులు కానప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే బాధ్యుడు అవుతాడు అనడం దుర్మార్గపు వాదన కాదా?
ఆరోపణ: ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు బలవంతం చేసి నిధులు విడుదల చేయించారు.
వాస్తవం : దోపిడి కోసమే ఈ ఒత్తిడి జరిగింది ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సునీత 08.09.2015న స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు నిధులు గురించి ఫైలు వచ్చినప్పుడు ఒక క్లస్టర్ లో ప్రయోగం చేసి తరువాత 5 క్లస్టర్ చేస్తే బాగుంటుందని సూచన మాత్రమే చేశారు. ఆమె పై అధికారిగా ఉన్న పి.వి. రమేష్ గారు దానిని తోసిపుచ్చి 6 క్లస్టర్ లకు రూ.270 కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ను విడుదల చేశారు. నిధులు విడుదల చేస్తూ పి.వి. రమేష్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారని రాశారు.
దీనిపై కృష్ణారావును సిఐడి వారు ప్రశ్నించగా తనకు పైలు పంపకుండా తన పేరును ఉచ్చరిస్తూ పి.వి. రమేష్ రాయడం రూల్స్ కు వ్యతిరేకమని ఆ మాటలకు విలువ లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు అందరూ కలిపి చర్చించి ప్రాజెక్టును అమలు చేయాలని దానికి నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కాగితాలు కూడా ఎసిబి కోర్టుకు సిఐడి సమర్పించిన ఫైలులోనే ఉన్నాయి. నిజాలు ఇలాగ ఉంటే ఎవరికి నచ్చిన రీతిలో వారు వక్రభాష్యాలు చెప్పడం విచారకరం.
నిధులు విడుదల చేసే ముందు సీమెన్స్ – డిజైన్ టెక్ వారితో వ్యక్తిగతంగా చర్చించి పి.వి. రమేష్ 6 సూచనలు చేసి 2 విడతలుగా విడుదల చేస్తానని ఒప్పుకున్నారు. స్వయంగా ఫైలులో కూడా రాశారు. ఆ తరువాత రెండవ విడత నిధులు విడుదల ప్రేమ్ చంద్రారెడ్డి కోరినప్పుడు సునీత గారు ఈ షరతుల అమలు గురించి ప్రశ్నిస్తే ప్రేమ్ చంద్రారెడ్డి సుదీర్ఘమైన వివరణ ఇచ్చి ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ రకంగా ఫైనాన్స్ వారు నిధులు విడుదల చేస్తే దీనికి పైనాన్స్ అధికారులు ఏదో రాశారని వారు వద్దంటే ఇచ్చారని ఎందుకు ప్రచారం చేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకుంటారు. ఈ కాగితాలు కూడా ఎసిబి కోర్టుకు సిఐడి సమర్పించిన పత్రాలలోనే ఉన్నాయి.
ఆరోపణ : అసలు సీమెన్స్ సంస్థతో సంబంధమే లేదు.
వాస్తవం: సీమెన్స్ అనే పేరు బాగుందని చంద్రబాబు నాయుడు బోర్డు పెట్టారని పేర్ని నాని గారు చెబుతున్నారు. సీమెన్స్ గ్లోబల్ వారు మాకు సంబంధం లేని ఉత్తరం రాశారని సిఐడి చీప్ సంజయ్ చెబుతారు. సాక్ష్యాత్తు ఆర్థిక మంత్రి బుగ్గన సీమెన్స్ 90:10 అనేది మాకు తెలియదు అందని అలాంటిది ఎక్కడా ఉండదని హేళనగా మాట్లాడతారు.
సీమెన్స్ ప్రస్తుత ఎండి మాథ్యూస్ తరువాత ఇండియాలో సీమెన్స్ కు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారికి సెక్షన్ 50 క్రింద స్టేట్ మెంట్ ఇస్తూ సీమెన్స్ సంస్థ ఎపి స్కిల్ డెవలప్ మెంట్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం నిజమని తమ సాప్ట్ వేర్ / హార్డ్ వేర్ / సేవల ధరలలో భారీ డిస్కౌంట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టులను అన్ని దేశాలలో చేస్తామని అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు అని రూ.3000 కోట్లు నగదు ఇస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పమని ఆ విలువ మేరకు డిస్కౌంట్ లు ఇస్తూ సీమెన్స్ / డిజైన్ టెక్ సంస్థలు సాప్ట్ వేర్/హార్డ్ వేర్ సేవలు అందిస్తాయని ఈ పద్దతిని దేశంలోనే అనేక రాష్ట్రాలలో యూనివర్సిటీలలో చూడవచ్చని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. సిఐడి వారికి ఈ కాగితాలు అందుబాటులో ఉన్న కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆరోపణ: ఆదాయపు పన్ను కేసులో మనోజ్ అనే వ్యక్తి చంద్రబాబునాయుడు కి డబ్బులు ఇచ్చానని చెప్పారు
వాస్తవం : ఆదాయపు పన్ను పై మీ సంజాయిషీ ఏమిటని రెండు సంవత్సరాల క్రితం నోటీసులు ఇచ్చారు. అదే మనోజ్ అనే వ్యక్తి తనను మానసిక ఒత్తిడికి గురిచేసి, భయపెట్టి ఆ ఆ స్టేట్ మెంట్ పై సంతకం పెట్టించారని కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే తెలియజేశాడు. అలా వచ్చిన నోటీసులో రెండు సంవత్సరాల నుండి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఇంతవరకూ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చందమామ కధలు అల్లుతూ సిఐడి చేత చిలకపలుకులు పలికిస్తోంది. చంద్రబాబు గారికి పిఎస్ గా చేసిన పెండ్యాల శ్రీనివాస్ ఆగస్టు నెలాఖరు వరకు సెక్రటేరియట్ లో ప్లానింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వరించారు.
గత రెండు సంవత్సరాలుగా సిఐడి ఏ రోజు ఆయనను పిలవలేదు. ఆయన ఆరోగ్య రీత్యా సెలవు దరఖాస్తు పెట్టి అమెరికాలో బంధువుల సహకారంతో వైద్య పరీక్షల కోసం వెళితే ఆయన విదేశాలకు పారిపోయాడని మీడియాలోనూ, కోర్టుల ముందు విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. స్కిల్ కార్పోరేషన్ మీద దర్యాప్తు చేస్తున్న సిఐడి సంస్థ లేదా విజిలెన్స్ వారు లేదా ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు.
ఆగస్టు 23న సెలవు దరఖాస్తు పెట్టి అమెరికా వెళుతున్నానని తెలియజేశానని చెబుతున్నారు. తరువాత సెలవుని నిర్ధారిస్తూ ఉత్తరాలు రాశాడట. ఏదో ఆయన శాశ్వతంగా వెనకుకు రాడు అన్నట్లుగా ఆయన పేరును ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా సెక్రటేరియట్లో ఉద్యోగం నిర్వహిస్తున్నపుడు ఆయనను ఎందుకు విచారించలేదో ఇప్పుడే ఆయన పేరు మీద దుష్ప్రచారం చేస్తున్నారో సిఐడి వారు చెప్పాలి.