– తను నీతిమంతుడని నిరూపించుకోగలరా?
– ఉండవల్లి అరుణ్ కుమార్ ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
ఉండవల్లి అరుణ్ కుమార్ అవినీతిని బయట పెడతాను. తను నీతిమంతుడని నిరూపించుకోగలరా?అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం…
చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని వైసీపీ నాయకులు పిల్ వేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే. చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ అవినీతిలో ఎటువంటి సంబంధం లేదు. కంపెనీలతో ఎటువంటి డీల్ జరగలేదు. అలాంటప్పుడు పిల్ వేయడంలో అర్థంలేదు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న చంద్రబాబుపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టారు.
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. రాజమండ్రిలో ఏమీ ఉండవు. సామాన్యుడిలా నాటకాలాడుతుంటాడు. రామాజీరావును ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది. ఉండవల్లికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టాయనేది అక్షరాల నిజం.
మచ్చలేని చంద్రుడిపై రాజకీయ కక్ష ఎందుకో?
మచ్చలేని చంద్రుడిపై రాజకీయ కక్ష ఎందుకో?. ఉండవల్లి అరుణ్ కుమార్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్దాలు కట్టిపెట్టాలి. బాలకృష్ణ మీసం మీద చేయి వేస్తే మీకొచ్చిన నష్టమేంటి?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తు్ండడంతో వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పర్యాటకులకు టూరిజం స్పాట్ లు చూపాల్సిన రోజాకు వివేకా హత్య చేసిన చోటు చూపాల్సి వస్తోంది. బుగ్గన, అంబటి, రోజా, జోగి రమేష్, కాకాని గోవర్థన్ , గుడివాడ అమర్నాథ్ లకు వారి శాఖలపై ఏమాత్రం పరిజ్ఞానంలేదు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాకుండా పారిశ్రామికులను పారిపోయేలా చేసిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్.
చంద్రబాబు అవినీతి చేయకపోయినా అవినీతి బురద జల్లుతున్నారు. చంద్రబాబు హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజ్యసభ సీటు ఆశించడం నిజం కాదా? పవన్ కల్యాణ్ పిలవగానే ఆగమేఘాలమీద ఆయన వద్దకు వెళ్లావు. బీఎస్ఆర్ పార్టీకి సంబంధించి కేసీఆర్ పిలిచాడని, వెజ్ తింటావా? నాన్ వెజ్ తింటావా అని అడిగారని పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్.
చంద్రబాబునాయుడు కుటుంబం నిప్పులాంటిది. నిప్పుకు ఎప్పుడూ తుప్పు పట్టదు. ఉండవల్లి జాతకం అంతా బయట పెడతాం. జగన్ దోచుకున్నదెంతో వివరాలు చూపెడతాం.. దోచుకోలేదని చర్చకు రాగలవా? వైసీపీ నాయకులు నోరు పారేసుకోవడం మానాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలను పవన్ కల్యాణ్ ఎండగడుతుంటే అంబటి రాంబాబుకు కాపు బిడ్డ అని గుర్తు కు రాలేదా? కాపులంతా పవన్ వెంట ఉన్నారని గుర్తుకు రాలేదా?
అరగంట మంత్రి అంబటి రాంబాబుకు కలర్ వేసుకోవడం తప్ప ఏమీ తెలియదు. అనవసరంగా కులాలు అంటగడుతున్నారు. కాపు బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ జగన్ చేసే అక్రమాలను ఎండగడుతున్నప్పుడు ఎందుకు అంబటి ఊరుకున్నాడో? పవన్ కల్యాణ్ ను జగన్ తిట్టించినప్పుడు అంబటి రాంబాబు కు పౌరుషం రాలేదే? ఆ తరువాత ఎందుకొచ్చిందో? జగన్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు.