తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించే తితిదే ఎలక్ట్రిక్ బ్రహ్మరథం బస్సును దుండగులు అపహరించారు.
తిరుమలలోని తితిదే ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయం నుంచి తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి బస్సును చోరీ చేశారు. తిరుమల నుంచి తిరుపతికి .. అక్కడి నుంచి నెల్లూరు వైపునకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.
తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జీపీఎస్ సిస్టమ్ ద్వారా బస్సును.. నాయుడుపేట, గూడూరు మధ్యలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.