బిడ్డా.. జగన్.. నీకు నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా తగులుతుంది

Spread the love

తల్లి, చెల్లి ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్ ది
తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపాడు
చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమన్న మోత్కుపల్లి
జగన్ పాలనలో ఏపీలో దళితలకు తీవ్ర అన్యాయం
నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు పోవాల్సిందని స్పష్టం
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళి

2019లో జగన్ను గెలపించమని ప్రజలను కోరి పొరపాటు చేశాను. అప్పట్లో జగన్ కు మద్దతు ఇచ్చినందుకు తల దించుకుంటున్నాను. ఎవరిని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన. సీఎం‌ జగన్ కు నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా తగులుతుంది. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు ను అరెస్ట్ చేయటం దుర్మార్గం.

ముఖ్యమంత్రిగా ఎల్ల కాలం ఉండడని జగన్ గుర్తుంచుకోవాలి. లోకేష్ ను కూడా అరెస్ట్ చేయాలనుకోచటం అన్యాయం.ముష్టి 300కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటం లేదు.చంద్రబాబును

ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్ కే నష్టం. జగన్ మళ్ళీ గెలిస్తే.‌. ఆంధ్రప్రదేశ్ రావణకాష్టం కావటం ఖాయం.

151 కాదు.. నాలుగు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ కు రావు. తల్లి, చెల్లి ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్ ది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపాడు. సొంత బాబాయ్ ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్. జగన్ కపట ప్రేమను దేవుడు కూడా క్షమించడు. జగన్ పాలనలో ఏపీలో దళితలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

Leave a Reply