– మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేని రాష్ట్రం ఒక్క ఏపీనే
-పెదకాకాని లో కాంప్లెక్స్ కాపాడుకోవటానికి పోసాని చేసిన పైరవీలు అన్ని బయటపెడతాం
-పోసాని ఎక్స్ ట్రా ఆర్టిస్ట్
-నంద్యాలలో ఏ రకమైన మద్యం తయారు చేస్తున్నారో అందరికీ తెలుసు
– లిక్కర్ లింకులన్నీ చైన్నైకే
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ
‘‘దేశంలోని చిన్న బడ్డీషాపులు, సోడాలు అమ్మే తోపుడుబండ్లు, చివరకు పల్లీలు అమ్ముకునే వ్యక్తి వద్ద కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ఉంటే, ఏపీలోని ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో మాత్రం నగదు చెల్లింపు జరుగుతున్న విచిత్ర పరిస్థితి ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వెళుతోంది? లిక్కర్ షాపులోని అమ్మకాల రశీదుకు, అమ్మకాలకు మధ్య లక్షల్లో తేడా ఉన్న నిజాన్ని, మా అధ్యక్షురాలు పురందీశ్వరి నర్సాపురంలో ఆధారాలతో సహా బయటపెట్టారు. కాబట్టి ప్రభుత్వ లిక్కర్ షాపుల నుంచి డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయి?
తాడేపల్లి ప్యాలెస్‌కు అందులో ఎంత అందుతున్నాయి? లిక్కర్ లింకులు చెన్నైలోని ఒక వ్యక్తికి తగులుతున్నాయన్న సమాచారం మాకుంది. నంద్యాలలో లాంటి లిక్కర్ తయారుచేస్తున్నారో తెలుసు. రాష్ట్రంలోని డిస్టలరీస్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుని, వాటిలో ఏమంత్రి-ఏ ఎంపీ చీప్ లిక్కర్లను సొంత బ్రాండ్లతో తయారు చేసి అమ్ముతున్నారో మాకు తెలుసు. వాటిపై ఒక్కో బాటిల్ ఎంత తాడేపల్లి ప్యాలెస్‌కు వెళుతుందో మాకు స్పష్టమైన సమాచారం ఉంది. దానిని సీబీఐకి ఫిర్యాదు చేస్తాం’’ అని అన్నారు.
చంద్రమౌళి నగర్ లోని కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఇంకా ఏమన్నారంటే..
మా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎటువంటి అవినీతి మరక లేని మా అధ్యక్షురాలిపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకో.
సర్పంచ్ నిధులు మల్లింపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, మద్యం కుంభకోణాలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేక వ్యక్తి గత దూషణలు చేస్తున్నారు. ఏపీలో అవినీతి పెరిగిపోయింది.అరాచకం పెరిగి అభివృద్ధి కుంటుపడింది.
ప్రతిపక్ష నేతలపై ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది.అసమర్థ నాయకత్వంలో వైసిపి ఉంది.నిన్న ఒక కుక్క సింహం ముందు మొరిగింది. మీ ప్లూటు జింక ముందు ఊదుకోండి. సింహం ముందు ఊదితే భూమ్మీద అవకాశం కూడా ఉండదు.
పోసాని ఎక్స్ ట్రా ఆర్టిస్ట్.మద్యం అమ్మకాల్లో డబ్బులు ముట్టాయా లేదో చెప్పాలి. కల్తీ మద్యం ఉందా లేదా చెప్పాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చింది మీ సిఎం కాదా? నవరత్నాలలో ఒక రత్నం మద్యపాన నిషేధం. నంద్యాలలో ఏ రకమైన మద్యం తయారు చేస్తున్నారో అందరికీ తెలుసు. వైసీపీ నేతలు భయంతోనే సమాధానం చెప్పలేక దూషణలకు దిగుతున్నారు. పోసాని సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ఎక్సైజ్ మంత్రి అన్న సంగతి ఆ మంత్రికే తెలియదు.
మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేని రాష్ట్రం ఒక్క ఏపినే.అమ్మఒడి పేరుతో నాన్న చేతిలో కల్తీ బుడ్డి పెడుతున్నారు.మద్యం అమ్మకాల్లో కమీషన్లే ముప్పై వేల కోట్లు వచ్చాయి. డిస్టలరీల నుండి కూడా పదిహేను వేల కోట్లు కమీషన్లు తీసుకున్నారు. ఎక్సైజ్ మంత్రి చర్చకు వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తాం. మద్యం అమ్మకాల ద్వారా 41వేల కోట్లు దోచుకున్నారు.
పెదకాకాని లో కాంప్లెక్స్ కాపాడుకోవటానికి పోసాని చేసిన పైరవీలు అన్ని బయటపెడతాం.ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి పేలుతుంటారు. కాళ్ళు పట్టుకున్న చేతులను జైలుకి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మద్యం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్ని అక్రమాలు వెలికి తీస్తాం.