– తనయుడు తోడు రాగా తండ్రికి పాదాభివందనం చేసి వేదమంత్రాలతో శాస్త్రయుక్తంగా
పూజలు
– సాంప్రదాయ బద్దంగా ఛాంబర్ లోకి ప్రవేశించి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ముహూర్తానికి తొలి ఫైల్ మీద సంతకం
-హాజరైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
నల్లగొండ, సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి,గుజ్జ దీపికా యుగందర్ రావు ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,వద్దిరాజు రవిచందర్ ,లోకసభ సభ్యులు రంజిత్ రెడ్డి,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,యన్.రవీంద్ర నాయక్,చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్,యన్.బాస్కర్ రావు,శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ లు. మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి అభినందించిన ఇంధన శాఖా కార్య దర్శి సునీల్ శర్మ,ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి గోపాల్ రావు,టి యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి,టి యన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావు,రెడ్కో వి సి జానయ్య తదితరులు…
తనయుడు వేమన్ రెడ్డి తోడు రాగా తండ్రి రామచంద్రా రెడ్డికి పాదాభివందనం చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నూతన సచివాలయంలోనీ తన ఛాంబర్ లో తొలి ఫైల్ పై సంతకం చేశారు. అంతకు ముందు ఆయన వేదమంత్రాలతో పూజలు నిర్వజించి శాస్త్రయుక్తంగా అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన ముహూర్తానికి ఛాంబర్ లో ప్రవేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు విద్యుత్ శాఖా ఉన్నతాధికారులు బి అందనల నడుమ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ కు ప్రభుత్వం అందించే మొత్తంలో బాగంగా మే మాసాంతానికి 958 కోట్ల 33 లక్షల 33 వేలు డిస్కం లకు మంజూరు చేస్తూ తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు.
ఆడంబరాల నడుమ సాగిన చాంబర్ ప్రవేశ సంబరాలలో హాజరైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి,గుజ్జ దీపికా యుగందర్ రావు ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,వద్దిరాజు రవిచందర్ ,లోకసభ సభ్యులు రంజిత్ రెడ్డి,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,యన్.రవీంద్ర నాయక్,చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్,యన్.బాస్కర్ రావు,శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ లు.
మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి అభినందించిన ఇంధన శాఖా కార్య దర్శి సునీల్ శర్మ,ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి గోపాల్ రావు,టి యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి,టి యన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావు,రెడ్కో వి సి జానయ్య తదితరులు పాల్గొని మంత్రి జగదీష్ రెడ్డికి పుష్ప గుచ్చాలతో అభినందనలు తెలిపి శాలువలతో ఘనంగా సత్కరించారు.