Suryaa.co.in

Telangana

దేశ అభివృద్ధి కొరకే జమిలి ఎన్నికలు

– జమిలి తో సమయం డబ్బు రెండు అదా
– ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి

హైదరాబాద్: దేశంలో అన్ని సామాజికవర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా మోడీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నది. కార్మిక, కర్షక, శ్రామికుల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వెళ్తోంది. మహిళా సాధికారత కోసం మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.

75 ఏళ్ల పైబడిన ఆరు కోట్ల మందికి హెల్త్ కార్డులు ప్రొవైడ్ చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకో సిష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మ్యాన్ ఫ్యాక్చర్ హబ్ గా ఇండియా వేగంగా దేశం అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలబడబోతోంది.

దేశ అభివృద్ధి కొరకే జమిలి ఎన్నికలు. జమిలి తో సమయం డబ్బు రెండు అదా అవుతాయి. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశ అభివృద్ధికి కొంత ఆటంకం ఏర్పడుతుంది. దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవు. జమిలి ఎన్నికలకు కొంత సమయం పడుతుంది. అందుకే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల కు ఎన్నికలు. పార్లమెంట్ లో జమిలి బిల్లు ప్రవేశ పెడతారు. అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తది. ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే చర్చలో చెప్పొచ్చు.

LEAVE A RESPONSE