Suryaa.co.in

Political News

జగన్‌పై గురిచూసికొట్టిన జనసేన గబ్బర్‌సింగ్

– వాలంటీర్లలో భయం రేపిన పవన్ వ్యాఖ్యలు
– వాలంటీర్లు మానసికంగా భయపడ్డారా?

సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీకి బలం వాలంటీర్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సొంత పార్టీ నేతలను కూడా పక్కనపెట్టి.. వారినే అందలమెక్కించారు. నెలకు ప్రభుత్వం నుంచి 5 వేల రూపాయలిచ్చి.. ప్రజల సమాచారం తీసుకునే అద్భుతమైన వ్యూహం రచించిన జగన్‌ను, జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ గురిచూసి కొట్టారు. జగన్‌కు తిరుగులేని బలమైన వాలంటీర్లు.. గత నాలుగేళ్ల నుంచి మహిళలపై చేస్తున్న అత్యాచారాలు, కిడ్నాపులను హటాత్తుగా తెరపైకి తీసుకువచ్చి జగన్‌ను డిఫెన్స్‌లో పడేశారు. మహిళలను పార్టీకి గంపగుత్తగా దూరం చేసే పవన్ ఎత్తుగడకు, వైకాపా ఇంకా షాక్‌లోనే ఉంది.

పక్కా ప్రణాళిక ప్రకారమే వాలంటీర్ వ్యవస్థ మీద సంచలన ఆరోపణలు చేశారు జనసేనాని. “వాలంటీరు మా ఇంటికి రావడం వల్ల మాకు ఇంత నష్టం జరుగుతోందా.? …అని యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వాలంటీర్ వ్యవస్థ మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా వ్యూహం రచించారు.. న్యూట్రల్ గా ఉండే వాలంటీర్లు,,కాస్త గౌరవప్రదంగా ఉండే వాలంటీర్లు అందరినీ డిఫెన్స్ లో పడేశారు.

” వీళ్ళు ఇచ్చే 5000 కు మనం ఇన్ని మాటలు పడడం ఇంత ఊడిగం చేయడం అవసరమా,?… అనే అభద్రతాభావం వాళ్లకి కల్పించారు.. ఒకవేళ రేపు ఈ ప్రభుత్వం రాకపోతే,, ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టు మేము చేసిన పనుల మీద, రేపు వచ్చే వేరే ప్రభుత్వం కేసులు ఫైల్ చేస్తే , అప్పుడు మా పరిస్థితి ఏంటి..? అనే ఒక భయాందోళన వాతావరణం వాళ్ళలో క్రియేట్ చేశారు..

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రతిపక్షాల ఓట్లు గల్లంతు చేసే ప్రక్రియ చేపట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో చాలావరకు వాలంటీర్లు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కొంచెం ఆలోచన ఉండే ఏ వాలంటీరు, 5000 కోసం,, 6 నెలలో దిగిపోయే ప్రభుత్వం కోసం జీవితాన్ని రిస్క్ చేయడు. వాలంటీర్ వ్యవస్థతో రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న వైసీపీ ప్రభుత్వ అస్థిరత్వం మీదే దెబ్బ కొట్టారు

– ఆళ్ల హరి

LEAVE A RESPONSE