గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, ఆగస్టు23: సీయం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని బీజేపీకి నాయకులు, కార్యకర్తలు తెలిపారు. సోన్ మండల బీజేపీ అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్, వార్డ్ మెంబర్, బీజేపీ బూత్ అధ్యక్షుడు గంట మహేందర్, వార్డ్ మెంబర్ శ్రీకాంత్, పెసరి దాము తదితరులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోనే సాధ్యమని, అందుకే ఆయన వెంట నడిచేందుకు బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరామని ప్రేమ్ కుమార్ చెప్పారు. నిర్మల్ గడ్డ మీద మళ్ళీ ఎగిరేది బీఆర్ఎస్ జెండేనని స్పష్టం చేశారు. నిర్మల్ బీజేపీ నాయకులు సిద్దాంతాలను మరిచిపోయి, ఆహాంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.