Suryaa.co.in

Telangana

జర్నలిస్ట్‌ ఆదినారాయణ ఇకలేరు!

– తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌, ఈటీవీ హైదరాబాద్​ బ్యూరో చీఫ్‌ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్​మెంట్‌పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్​ రెడ్డి సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈటీవీ బ్యూరో చీఫ్‌ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బాధతప్త హృదయంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు.

LEAVE A RESPONSE