న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టుల ఆందోళన చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల పై దాడి కి నిరసన తెలిపారు. తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వంతంత్ర జర్నలిస్టుల పై దాడులు జరుగుతున్నాయని, రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు.. కానీ పరిస్థితులు అలా లేవని, రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని ఆందోళనకారులు తెలిపారు.
ఇంకా వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు అనుమతించకపోవడం తో రాహుల్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర జర్నలిస్టులు పనిచేయడం లేదు… ప్రజా సమస్యలు, వస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీ వచ్చాం… ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశాం… మేము ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం లేదు… ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులం.. కాగా, ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శంకర్, వీణవంక ప్రభాకర్, సుంకరి ప్రవీణ్, లింగస్వామి పాల్గొన్నారు.