Suryaa.co.in

Telangana

నగరంలో గర్జించిన జర్నలిస్టులు

– ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రదర్శన గ్రాండ్ సక్సెస్

మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదాన్ని నిరసిస్తూ, గురువారం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జర్నలిస్టులు గర్జించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుదాం, రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం అంటూ జర్నలిస్టులు చేసిన నినాదాలు మారుమ్రోగాయి.

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)ల నేతృత్వంలో, హెచ్.యూ.జే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ల భాగస్వామ్యంతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.

బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుంది. ఆయా ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాయి. అనంతరం ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అంబెడ్కర్ విగ్రహం వద్ద సభ జరిగింది. ఈ ప్రదర్శన, సమావేశంలో సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ చంద్రకుమార్, ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు జి.హరగోపాల్, కోదండరాం, పి.ఎల్.విశ్వేశర్ రావు, పద్మజషా, ఖాసీం, సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు, సియాసత్ సంపాదకులు అమీర్ అలీ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, వీక్షణం వేణు, పాశం యాదగిరి, తోట భవనారాయణ, రహ్మాన్, ప్రముఖ రచయిత, గాయకులు జయరాజ్, సామాజిక నిపుణులు రమా మేల్కొటే, సజయ, ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యురాలు సంధ్య, ఓ.పి.డి.ఆర్ బాధ్యురాలు జయ వింధ్యాల, ఎన్.డబ్ల్యూ.ఎం.ఐ బాధ్యురాలు వనజ, సామాజిక కార్యకర్త జస్విన్ జైరత్, మానవ హక్కుల వేదిక బాధ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు ఎం.ఏ.మాజీద్, కల్లూరి సత్యనారాయణ, డి.కృష్ణారెడ్డి, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, బి.కిరణ్, మల్లయ్య, యం.వెంకట్ రెడ్డి, చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జి.బాల్ రాజ్, న్యూడెమోక్రసీ బాధ్యుడు గోవర్ధన్ లతో పాటు 300 మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE