Suryaa.co.in

National

వాఘా బోర్డర్ ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రికార్డు

పంజాబ్ : జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌, పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్‌ను సందర్శించారు. జలియన్‌వాలాబాగ్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బీఎస్ఎఫ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అరుదైన రికార్డును లిఖించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 14,2022)ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ వాఘా
nvramana-1-1200x675 బోర్డర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దు రక్షక దళం(BSF) గౌరవ వందనాన్ని జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరించారు.

జస్టిస్ ఎన్వీ రమణ రాక సందర్భంగా బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ..
సీజేఐ కి స్వాగతం పలకటం పంజాబ్ రాష్ట్రం అంతా ఉప్పొంగిపోయింది అని తెలిపారు.

LEAVE A RESPONSE