– విజయశాంతి.బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
సీఎం కేసీఆర్‌కు మెదడు దొబ్బిందని బీజేపీ జాతీయ నేత విజయశాంతి విరుచుకుపడ్డారు. దళితులను మోసం చేస్తే కేసీఆర్ మట్టిగొట్టుకుపోతారని శపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన విజయశాంతి సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.
విజయశాంతి ఏమన్నారంటే…
అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి. రాజ్యాంగం తో పేద బడుగులు బాగుపడ్డాయి. కేసీఆర్ మొదడులో చిప్ దొబ్బిందా.. బూజు పట్టిందా? అంబేద్కర్ దళిత బిడ్డ కాబట్టి నచ్చడం లేదు. అన్ని వర్గాల వారు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యావు కేసీఆర్… వారిని అభివృద్ధి లోకి తీసుకుని రావాలి.
బడుగులకు మర్యాద ఇవ్వాని నీకు తెలంగాణ ప్రజలు మర్యాద ఇవ్వరు. భవిష్యత్తులో నీవు అధికారంలో ఉండవు. హుజూరాబాద్ లో ఓటర్లు నిన్ను ఓడించారు. ప్రతి మనిషి ని గౌరవించడం … మర్యాద ఇవ్వడం నేర్చుకో. అంబేద్కర్ విగ్రహం కడుతా అన్నావు కట్టావా?
కేసీఆర్ నీవు మనిషివి కావు. రాక్షసుడివి. నీవు ముఖ్యమంత్రి గా ఉండటం తెలంగాణ ప్రజల ఖర్మ. ఇక మిమ్మల్ని పేదలు నమ్మరు… ఇక నీవు గెలవవు. రాకేష్ టికాయిత్ ఒక ఫ్రాడ్… పాకిస్థాన్ తో కలిసి రైతులను ఆందోళన పేరుతో మోసం చేసాడు. కేసీఆర్ అబద్దాలు తిట్లు ఇప్పటి వరకు తెలంగాణ లోనే .. ఢిల్లీ ధర్నాతో నీ అబద్థాలు దేశం అంతా తెలిసాయి.
ఢిల్లీ ధర్నాలో ఎవరూ దేకలేదు. పెట్టా బేడా సర్దుకుని వచ్చాడు కేసీఆర్.ఇన్ని రోజులు రైతులను మోసం చేసావు.. కష్టపెట్టావు. ముఖ్యమంత్రిగా ఉండి వరేస్తే ఉరి అంటావా… రైతులను చనిపోమని చెబుతావా? కేసీఆర్ మాటలు విని అనేక మంది రైతులు వరి వేయలేదు.
కేసీఆర్ తన లాభం కోసం రైతుల నుంచి తక్కువ ధరలకు వడ్లు అమ్మి 250కోట్లు నష్టపోయారు.వారిని కేసీఆర్ ఆదుకోవాలి.కేసీఆర్ ఆర్థిక పరిస్థితిని దెబ్బకొట్టడం జరిగింది. ఆకలి చావులు.. ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. ఆర్థికంగా దెబ్బతీశాడు.
కేసీఆర్ వడ్లు కొంటాం అని చెప్పడం బీజేపీ మొదటి విజయం.బడుగు బలహీన వర్గాల కు న్యాయం చేసే పార్టీ బీజేపీ. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్ర పరువు నిలబెట్టే పార్టీ బీజేపీ పార్టీ. కెసిఆర్ మోసాలను నమ్మకూడదు… టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు అన్నీ ఒకటే. బీజేపీ ని ఆదరించండి… గెలిపించండి.