Suryaa.co.in

Telangana

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారీ కుంభకోణం

– మేకిన్ ఇండియా పేరుతో మోడీ చీటింగ్
*మాక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కాదు అది ఫేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం
– అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, ప్రజలసొమ్మును కార్పొరేట్ కంపెనీలకు దొడ్డి దారిన కట్టబెడుతున్న మోడీ సర్కార్
మేకిన్ ఇండియాలో భారీ అవినీతి జరుగుతోంది
– ఫేం ( ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా FAME ) పథకం ద్వారా జరిగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవినీతి జరిగింది
మేకిన్ ఇండియా ప్రోగ్రాం100 శాతం ఫెకిన్ ఇండియా గా మారింది
– 2021 & 2022 ఫైనాన్సియల్ ఇయర్స్ లో హీరో కంపెనీ 1 లక్ష 40 వేల స్కూటర్ లు అమ్మేశారు. దానికి 400 కోట్లు సబ్సీడీ.. ఒక్కొక్క వాహనానికి సగటు సబ్సీడీ 29 వేలు. కేంద్రం ఇచ్చింది
– FAME నిబంధనలకు విరుద్దంగా లిథియం బ్యాటరీల తోపాటు చాలా పార్ట్శ్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఆధారాలున్నా, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుంది
– నిబంధనలను తుంగలో తొక్కి అవినీతి పాల్పడుతున్న అవినీతికి మోడీ
సర్కార్
మోడీ చెబుతున్న మేకిన్ ఇండియా పచ్చి బూటకం.. మెకిన్ ఇండియా పేరుతో
భారత ప్రజలని మరియు విదేశీ పెట్టుబడు దారులను కూడా మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం
– – ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణ

‘ప్రజలు చెమటోడ్చి కట్టిన డబ్బుని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కార్పోరేట్ కంపెనీలకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. మెకిన్ ఇండియా పేరుతో పెద్ద స్కామ్చే స్తుంది బిజెపి సర్కార్” అని ఆరోపించారు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. మేకిన్ ఇండియా పేరుతో జరుగుతున్న అవినీతిపై హైదరాబాద్, గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాసోజు.

హీరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలో జరిగిన కుంభకోణం గురించి వివవరించారు.’స్కూటర్ లు తయారు చేయడానికి 200 పాట్స్ అవసరం. అందులో 18 కీలక పరికలు ఎప్పుడు నుండి ఇండియాలో తయారుచేయాలని చాల స్పష్టంగా గైడ్లైన్స్ లో ఉన్నాయి..హీరో ఎలక్ట్రిక్ మెకిన్ఇం డియా _ ఫేం టు అనే పధకం కింద మోటార్ వాహనాలు తయారు చేసింది. అయితే ఈ పధకం కింద సబ్సిడీ రావాలంటే ..కంపెనీ ఇండియాలోనే వుండటంతో పాటు వాహనం కు కావాల్సిన బాగాలన్నీ ఇక్కడే స్థానికంగా తయారు కావాలి. అప్పుడే సబ్సిడీ ఇవ్వాలి. కానీ పాలసీకి విరుద్దంగా హీరో ఎలక్ట్రిక్ మోటర్ వెహికిల్ విదేశాల నుంచి పార్ట్స్ ని దిగుమతి చేసుకొని వాహనాలు తయారు చేసింది’ అని పేర్కొన్నారు దాసోజు.

”2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ లో హీరో కంపెనీ లక్ష 40 వేల స్కూటర్ లు అమ్మేశారు దానికి 400 కోట్లు సబ్సీడీ.. కేంద్రం ఇచ్చింది. ఒక్కొక్క వాహనానికి సబ్సీడీ 28 వేలు. బ్యాటరీ తోపాటు చాలా పార్ట్శ్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఆధారాలు వున్నాయి. పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం, ప్రతి నెలకో సారి, నిబంధలు అమలు తీరుపై, ఆయా కంపెనీలు అధికారిక అఫడవిట్ ఇవ్వాలి. మరి అఫిడవిట్లను పరిశీలిస్తలేరు, లేక తప్పుడు అఫడవిట్లు హీరో కంపెనీ ఇచ్చిందా తెలియదు, కానీ అత్తా సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, డిపార్ట్మెంట్ అఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు, అప్పనంగా,ఏకంగా 400 కోట్ల సబ్సిడీ హీరో కంపెనీకి కట్టబెట్టిండ్రు.

ఈ పథకానికి, ఇప్పటికి కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు సబ్సీడీ కింద కేటాయించింది. గత ఏడాది, రూ 1234.69 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది దాదాపు రూ 3000 కోట్ల కేటాయించింది.డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంత దర్జాగా పబ్లిక్ సొమ్ము దోచుకుంటున్నారు అంటే, అది కేవలం ప్రభుత్వ అలసత్వ మరియు అవినీతి వైఖరి మాత్రమే. . ఇలాఅడ్డగోలుగా దోచుకుంటుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? సెంట్రల్ విజిలెన్సు డిపార్ట్మెంట్, GST డిపార్ట్మెంట్, సిబిఐ ఏమి చేస్తుండ్రు. అని ప్రశ్నించారు దాసోజు. హీరో కంపెనీ మాత్రమే కాదు మరో 51 కంపెనీలు కూడా ఇదే పని చేస్తున్నాయని అనుమానం కలుగుతోంది. ఫేమ్ టు పాలసీ ని అడ్డదారి పట్టించారు. ఆత్మ నిర్బర్ భారత్ అని మోడీ చెబుతున్నాడు..కానీ ఈ ఆత్మ నిర్భర్ భారత్ ని తలపిస్తోంది. అన్ని వ్యహారాలపై నిఘా పెట్టె ప్రధాన మంత్రి కార్యాలయం (PMO ), గుద్ది గుర్రం పళ్ళు తోముతుండ్ర అని ప్రశ్నించారు, దాసోజు.

మేకిన్ ఇండియా కాదు .. ఇది ఫేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం.. మెకిన్ ఇండియా పేరుతొ అడ్డమైన పబ్లిసిటీ ద్వారా ప్రజలని, విదేశీ పెట్టుబడిదారులను దారుణంగా చీట్ చేస్తుంది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ దుర్మార్గంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలని బయటపెట్టి దోషులని ప్రజల ముందు నిలబెడతాం” అని పేర్కొన్నారు దాసోజు.

ప్రభుత్వం నీతి, నిజాయితీ ఉంటె, వెంటనే మొత్తం ఫేమ్ పథకం పై సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించి, నిజ నిజాలు బయటకు తెచ్చి దోషులను శిక్షించాలి. అడ్డదారిన సబ్సిడీ ద్వారా దారిమళ్లిన ప్రజల సొమ్మును తిరిగి రాబట్టుకోవాలి అని దాసోజు డిమాండ్ చేసిండ్రు

LEAVE A RESPONSE