Suryaa.co.in

Andhra Pradesh

దేవదాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. రామచంద్ర మోహన్

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ గా కె.రామచంద్ర మోహన్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సాయంత్రం వేదపండితుల వేదాశీర్వచనాల నడుమ ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన దేవస్థానాల నుండి అర్చకులు, వేదపండితులు విచ్చేసి ప్రసాదం అందచేసి వేదాశీర్వచనం చేశారు. అదనపు కమిషనర్ చంద్రకుమార్ , చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్.శేఖర్ , ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గంగయ్య, స్థపతి పరమేశప్ప, లీగల్ ఆఫీసర్ సూర్యారావు, ఉపకమిషనర్లు హెచ్.జి.వెంకటేష్, మహేశ్వర రెడ్డి, ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల పర్యవేక్షకులు ఉద్యోగినీ ఉద్యోగులు నూతన కమిషనర్ ని అభినందనలతో ముంచెత్తారు.

LEAVE A RESPONSE