Suryaa.co.in

Andhra Pradesh

వంగవీటి రాధాపై రెక్కీ జరిగి పదిరోజులౌతున్నా చర్యలు శూన్యం

– కులాల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందాలని వైసీపీ ప్రయత్నం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు

వంగవీటి రాధాపై రెక్కీ జరిగి పదిరోజులౌతున్నా చర్యలు శూన్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం… వంగవీటి రాధా వైసీపీని వీడినందుకు ఆయనపై వైసీపీ నాయకులు కక్షకట్టి రెక్కి నిర్వహించారు.ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ నాటకమాడుతున్నారు.

రెక్కీ జరిగి పది రోజులైనా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. రెక్కీ నిర్వహించిన వ్యక్తులు విజయవాడలోనే యదేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ విషయాన్ని వైసీపీకి చెందినవారే చెబుతున్నారు. ఎందుకు వారిని పట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉండటం చూసి జగన్ అనుయాయులు తట్టుకోలేకపోతున్నారు.

ఆయన టీడీపీలోకి రావటం, పోటీ చేయటం, టీడీపీకి మద్దతు పలకటం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీలో ఉన్న వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తే చర్యలు తీసుకోకుండా కట్టుకథలు

చెబుతున్నారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టటానికే ఈ తతంగమంతా. సౌమ్యుడైన వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించడం చాలా బాధాకరం. వంగవీటి రంగా హత్య తప్పులేదన్నవారు ప్రస్తుతం వైసీపీలో కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నారన్న విషయం మరచిపోరాదు.

కాపు కార్పొరేషన్ ను మూసివేసి పరిపాలన చేతకాదని నిరూపించారు. వివిధ రకాలుగా రాష్ట్రానికి తెచ్చిన రూ.6 లక్షల కోట్ల అప్పు ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలి. గతంలో టీడీపీ హయాంలో కాపు సామాజికవర్గ పిల్లలకు 10 లక్షల మందిని విదేశాలకు పంపాము. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమందిని విదేశాలకు విద్యనభ్యసించడానికి పంపారో సమాధానం చెప్పాలి. జాబితా విడుదల చేయాలి.

సాధారణంగా అందరికీ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ కింద వెళ్లిన వారి ఖాతాలను కూడా వైసీపీ ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. వంగవీటి రంగాను హత్య చేయటం మంచిదే అని చెప్పిన వ్యక్తులతో వైసీపీ నాయకులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వైసీపీ నాయకులు అసహనం వీడాలి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ఇకనైనా వీటికి స్వస్తి పలకాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు హితవు పలికారు.

LEAVE A RESPONSE